News
News
X

Speciality Restaurants Shares: నష్టాల మార్కెట్‌లోనూ లాభాలు వడ్డిస్తున్న రెస్టారెంట్‌ స్టాక్‌, రెండు రోజుల్లోనే 20% ర్యాలీ

గత ఒక సంవత్సరంలో, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో 1.1 శాతం లాభంతో పోలిస్తే, ఇది 183 శాతం జూమ్ అయింది.

FOLLOW US: 
Share:

Speciality Restaurants Shares: గత రెండు రోజులుగా స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో మునిగి తేలుతున్నా, స్పెషాలిటీ రెస్టారెంట్స్‌ షేర్లు మాత్రం రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇవాళ (శుక్రవారం, జనవరి 06, 2023), భారీ వాల్యూమ్స్‌ మధ్య BSEలో 6 శాతం ర్యాలీ చేసి రూ. 268.10 వద్దకు చేరుకున్నాయి. ఇది ఈ స్టాక్‌కు 52 వారాల రికార్డ్‌ స్థాయి.  

గత రెండు ట్రేడింగ్ రోజుల్లో ఈ రెస్టారెంట్ కంపెనీ స్టాక్ 20 శాతం పెరిగింది. ఈ షేర్ల కోసం ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. ఇవాళ ఒక్కరోజే ఈ కౌంటర్‌లో ట్రేడింగ్ వాల్యూమ్‌లలో మూడు రెట్లు పెరిగాయి. కంపెనీ మొత్తం ఈక్విటీలో దాదాపు 2.5 శాతానికి సమానమైన 12 లక్షల షేర్లు NSE & BSEలో చేతులు మారాయి.

ఆరు నెలల్లో రెట్టింపు రాబడి
గత ఆరు నెలల్లో, S&P BSE సెన్సెక్స్‌లో 12 శాతం పెరుగుదలతో పోలిస్తే, స్పెషాలిటీ రెస్టారెంట్స్‌ స్టాక్‌ 122 శాతం పెరిగింది. గత ఒక సంవత్సరంలో, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో 1.1 శాతం లాభంతో పోలిస్తే, ఇది 183 శాతం జూమ్ అయింది.

వ్యాపారం
'ఆసియా కిచెన్‌ బై మెయిన్‌ల్యాండ్ చైనా', 'ఓహ్! కలకత్తా', 'సిగ్రీ-గ్లోబల్ గ్రిల్' బ్రాండ్లతో స్పెషాలిటీ రెస్టారెంట్స్‌ వ్యాపారం చేస్తోంది. భారతదేశంతో పాటు, ఖతార్, UAE, యునైటెడ్ కింగ్‌డమ్‌లోనూ స్పెషాలిటీ రెస్టారెంట్స్‌ బిజినెస్‌ నడుస్తోంది. గత 25 సంవత్సరాలకు పైగా ఈ వ్యాపారంలో ఉంది. రెస్టారెంట్లతో పాటు బేకరీలు కూడా ఉన్నాయి.

సెప్టెంబర్ 30, 2022 నాటికి... ఈ కంపెనీకి భారతదేశంలోని 14 నగరాల్లో 83 రెస్టారెంట్లు, 38 బేకరీలు ఉన్నాయి. UAEలో రెండు ‘ఆసియా కిచెన్ బై మెయిన్‌ల్యాండ్ చైనా’ రెస్టారెంట్లు, ఖతార్‌లోని దోహాలో ఒక ‘రియాసత్’ రెస్టారెంట్‌ ఉంది. జాయింట్ వెంచర్ కింద లండన్‌లో ‘చౌరంగి’ బ్రాండ్‌తో ఒక రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది.

ప్రస్తుతం ఈ కంపెనీ ఫండ్‌ రైజింగ్‌ ప్లాన్‌లో ఉంది. నిధుల సమీకరణ కోసం 60 లక్షల వారెంట్ల జారీకి డిసెంబర్ 21, 2022న స్పెషాలిటీ రెస్టారెంట్స్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో వారెంటును రూ. 212.05 ధరతో జారీ చేస్తుంది. తద్వారా రూ. 127.23 కోట్ల వరకు సమీకరించాలన్నది కంపెనీ ప్లాన్‌. ఒక్కో వారెంట్‌ను ఒక్కో ఈక్విటీ షేర్‌గా మార్చుకోవచ్చు, లేదా ఈక్విటీ షేర్లతో మార్పిడి చేసుకోవచ్చు. కంపెనీ ప్రమోటర్లకు కాకుండా, ప్రాధాన్యత ఆధారంగా ఈ వారెంట్లను జారీ చేస్తారు.

ఈ నెల 18న కంపెనీ అసాధారణ సర్వసభ్య సమావేశం (EGM) ఉంది. వారెంట్ల జారీ కోసం కంపెనీ వాటాదారుల నుంచి ఆమోదం పొందడం కోసం ఈ సమావేశంలో ఓటింగ్‌ నిర్వహిస్తారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 06 Jan 2023 02:48 PM (IST) Tags: restaurants Speciality Restaurants Speciality Restaurants Share Price

సంబంధిత కథనాలు

HDFC Q3 Results: హెచ్‌డీఎఫ్‌సీ అదుర్స్‌! 13% పన్నేతర లాభం - నేడు షేర్లు ట్రేడయ్యాయో చూడండి!

HDFC Q3 Results: హెచ్‌డీఎఫ్‌సీ అదుర్స్‌! 13% పన్నేతర లాభం - నేడు షేర్లు ట్రేడయ్యాయో చూడండి!

Porsche Panamera: రూ.14 లక్షలకే రూ.1.21 కోట్ల పోర్షే - ప్రకటన ఇచ్చిన కంపెనీ - తర్వాత ఏం అయింది?

Porsche Panamera: రూ.14 లక్షలకే రూ.1.21 కోట్ల పోర్షే - ప్రకటన ఇచ్చిన కంపెనీ - తర్వాత ఏం అయింది?

Stock Market News: సాయంత్రానికి రైజైన స్టాక్‌ మార్కెట్లు - సెన్సెక్స్‌ 224 ప్లస్‌, నిఫ్టీ 5 డౌన్‌

Stock Market News: సాయంత్రానికి రైజైన స్టాక్‌ మార్కెట్లు - సెన్సెక్స్‌ 224 ప్లస్‌, నిఫ్టీ 5 డౌన్‌

Titan Q3 Results: మెరుపులు మిస్సింగ్, అంచనాలు అందుకోని టైటన్‌

Titan Q3 Results: మెరుపులు మిస్సింగ్, అంచనాలు అందుకోని టైటన్‌

Upcoming IPOs: సిద్ధంగా ఉన్నారా?, రెండు కంపెనీలు పబ్లిక్‌ ఆఫర్స్‌ ప్రకటించబోతున్నాయ్!

Upcoming IPOs: సిద్ధంగా ఉన్నారా?, రెండు కంపెనీలు పబ్లిక్‌ ఆఫర్స్‌ ప్రకటించబోతున్నాయ్!

టాప్ స్టోరీస్

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!

Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్

Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్

K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు

K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు