అన్వేషించండి

Senior Citizen Savings Scheme: సీనియర్ సిటిజన్లకు ప్రతి 3 నెలలకు అకౌంట్లోకి రూ.25,000.. సేఫ్ సేవింగ్ స్కీమ్ పూర్తి వివరాలు

రిటైర్మెంట్ తర్వాత సీనియర్ సిటిజన్లకు రెగ్యూలర్ ఆదాయ మార్గాలు తక్కువగా ఉంటాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizen Savings Scheme) పై వార్షికంగా 8.2% చొప్పున గ్యారెంటీ వడ్డీని ఇస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వృద్ధులకు సురక్షిత ఆదాయం అందిస్తుంది.
  • ప్రస్తుతం 8.2% వడ్డీ; ప్రతి త్రైమాసికంలో ఖాతాలో నేరుగా జమ.
  • ₹30 లక్షల వరకు పెట్టుబడి, ఐదేళ్ల కాలానికి సురక్షిత ప్రభుత్వ పథకం.

Income Scheme In India | మీ వయసు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే.. లేదా మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్ ఉంటే వారికి ఇది శుభవార్త. రిటైర్మెంట్ తర్వాత సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రెగ్యులర్ ఆదాయాన్ని ఇచ్చే ఒక ప్రభుత్వ పథకం వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. 

భారత ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత నమ్మకమైన ప్రభుత్వ పథకం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizens Savings Scheme) గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వం అందించే ఈ సేవింగ్స్ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే, దీనిని ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ (60 ఏళ్లు, ఆ వయసు దాటిన వారి) కోసమే రూపొందించారు. ఇందులో క్రమం తప్పకుండా వడ్డీ వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత, లేక ఆ వయసు వచ్చిన వారికి తమ ఇతర పెట్టుబడులతో పాటు నిలకడైన ఆదాయ మార్గాన్ని కోరుకుంటే ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

వడ్డీ ఎంత వస్తుంది

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకంపై ఏడాదికి 8.2 శాతం చొప్పున గ్యారెంటీడ్ వడ్డీని అందిస్తోంది. ఈ స్కీమ్‌లో వడ్డీ చెల్లింపు ప్రతి త్రైమాసికంలో (ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1, జనవరి 1 తేదీల్లో) నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఏడాదిలో 4 సార్లు ప్రతి త్రైమాసికానికి వడ్డీ లభిస్తుంది. కనుక రిటైర్మెంట్ తర్వాత టెన్షన్ లేని సంపాదనకు ఇది ఒక మంచి స్కీమ్.

ప్రతి 3 నెలలకు 25,000 రూపాయలు

మీరు ప్రతి 3 నెలలకు 25,000 రూపాయల వరకు స్థిరమైన ఆదాయం పొందాలనుకుంటే, మీరు ₹12,20,000 (రూ. 12.20 లక్షలు) ఒకసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అసలే రిటైర్మెంట్ అయ్యేవారు కనుక వారి వద్ద ఉండే ఫండ్, లేక ఆ సమయంలో వచ్చే ఫండ్ ను ఇలా ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ మొత్తంపై 8.2 శాతం వార్షిక వడ్డీ రేటు చొప్పున ఏడాదికి వచ్చే మొత్తం వడ్డీ 1,00,040 అవుతుంది. ఈ లెక్కన ప్రతి త్రైమాసికానికి (3 నెలలకు) వీరికి ₹25,010 వడ్డీ రూపంలో ఖాతాలో లభిస్తుంది. ఈ స్కీమ్ కింద ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 30 లక్షల వరకు ఇన్వెస్ట్ పెట్టవచ్చు. ఒకవేళ సీనియర్ సిటిజన్ దంపతులు వేర్వేరు ఖాతాలు తెరిస్తే, వారిద్దరూ కలిసి రూ. 60 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.

రిస్క్ ఫ్రీగా ఆదాయం

ఇది భారత ప్రభుత్వ సపోర్టింగ్ స్కీమ్. కనుక ఇందులో ప్రైవేట్ బ్యాంక్ లేదా కార్పొరేట్ FDల తరహాలో డబ్బు నష్టపోయే ప్రమాదం ఉండదు. ఈ స్కీమ్ కింద 5 సంవత్సరాల కాలపరిమితికి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. 5 ఏళ్లు పూర్తయిన తర్వాత, మీరు దీనిని మరో 3 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. ఈ స్కీమ్‌లో మరో ప్రత్యేకత ఏంటంటే, ఒకసారి ఖాతా తెరిచిన తర్వాత భవిష్యత్తులో ప్రభుత్వం వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ, మీకు మొత్తం 5 సంవత్సరాల పాటు 8.2 శాతం వడ్డీనే లభిస్తుంది.

SCSS అకౌంట్ ఎక్కడ తెరవాలి?

మీరు దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్ (Post Office) లేదా ఏదైనా ప్రభుత్వ/ ప్రైవేట్ బ్యాంక్‌కు వెళ్లి ఈ అకౌంట్ తెరవవచ్చు. ఇందులో వచ్చే వడ్డీ పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఒకవేళ ఏడాదిలో మీ మొత్తం వడ్డీ రూ. 50,000 కంటే ఎక్కువగా ఉంటే దానిపై TDS కట్ చేస్తారు. అయితే, మీరు ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఫారమ్ 15H (Form 15H) సబ్మిట్ చేసి TDS కోత నుంచి తప్పించుకోవచ్చు.

 

Frequently Asked Questions

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అంటే ఏమిటి?

ఇది భారత ప్రభుత్వం అందించే పొదుపు పథకం, 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించబడింది. రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన, గ్యారెంటీడ్ ఆదాయాన్ని అందిస్తుంది.

ఈ పథకంపై వడ్డీ రేటు ఎంత, అది ఎలా చెల్లిస్తారు?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంవత్సరానికి 8.2% గ్యారెంటీడ్ వడ్డీ లభిస్తుంది. వడ్డీ ప్రతి త్రైమాసికంలో (ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1, జనవరి 1 తేదీల్లో) నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది.

SCSS లో గరిష్టంగా ఎంత పెట్టుబడి పెట్టవచ్చు మరియు స్థిర ఆదాయం పొందడానికి ఎంత పెట్టాలి?

ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి 3 నెలలకు రూ. 25,000 ఆదాయం పొందాలంటే, మీరు ₹12.20 లక్షలు ఒకసారి పెట్టుబడి పెట్టాలి.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాను ఎక్కడ తెరవాలి మరియు దీనిపై పన్ను నిబంధనలు ఏమిటి?

ఈ ఖాతాను దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ/ప్రైవేట్ బ్యాంకులో తెరవవచ్చు. దీనిపై వచ్చే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది, ఏడాదికి రూ. 50,000 మించితే TDS కట్ చేస్తారు. ఫారమ్ 15H సమర్పించి దీనిని నివారించవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
 Jio Maraket Listing: జియో జంబో లిస్టింగ్ రేపే.. రూ.10.3 లక్షల కోట్ల విలువతో స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. మార్కెట్ లో హుషారు
 జియో జంబో లిస్టింగ్ రేపే.. రూ.10.3 లక్షల కోట్ల విలువతో స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. మార్కెట్ లో హుషారు
నవంబర్‌లో బంగారం, స్టాక్ మార్కెట్: జ్యోతిష్య అంచనాలతో పెట్టుబడి వ్యూహం!
నవంబర్‌లో బంగారం, స్టాక్ మార్కెట్: జ్యోతిష్య అంచనాలతో పెట్టుబడి వ్యూహం!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget