అన్వేషించండి

UPI: శ్రీలంక, మారిషస్‌లోనూ యూపీఐ చెల్లింపులు, ఈ దేశాలకు నిశ్చింతగా వెళ్లి రావచ్చు

యూపీఐ పరిధిని ప్రపంచవ్యాప్తం చేసేందుకు భారత ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

UPI Services Launched in Sri Lanka and Mauritius: డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశాన్ని అగ్రరాజ్యంగా నిలబెట్టడంలో UPIది అతి పెద్ద పాత్ర. ఇప్పుడు భారతదేశం వెలుపల కూడా UPI బలపడుతోంది. నగదు లావాదేవీలు మాత్రమే కాదు, బ్యాంకింగ్ సేవల డిజిటలైజేషన్‌లోనూ భారత్‌ నానాటికీ పురోగతి సాధిస్తోంది. 

శ్రీలంక & మారిషస్‌ దేశాలను చేరిన UPI సేవలు
తాజాగా.. మన పొరుగు దేశాలైన శ్రీలంక, మారిషస్‌లోనూ UPI సర్వీస్‌ ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నాథ్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే సమక్షంలో.. శ్రీలంక, మారిషస్‌లో ఈ రోజు (సోమవారం, 12 ఫిబ్రవరి 2024) యూపీఐ సేవలను ప్రారంభించారు. దీంతో పాటు, శ్రీలంక, మారిషస్ రెండింటిలోనూ రూపే కార్డ్ ‍‌(RuPay Card) సేవలు కూడా ప్రారంభమయ్యాయి. మీరు శ్రీలంక లేదా మారిషస్‌ వెళితే.. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించొచ్చు. లేదా, రూపే కార్డ్‌ను వాడొచ్చు. కొన్ని రోజుల క్రితం, ఫ్రాన్స్‌లోనూ UPI సేవలు ప్రారంభమయ్యాయి.

భారతదేశ చెల్లింపుల నియంత్రణ సంస్థ 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' ‍(NPCI), UPIని రూపొందించింది. ఇది తక్షణ చెల్లింపు వ్యవస్థ కాబట్టి భారత్‌లో విపరీతమైన ప్రజాదరణ లభించింది. కూరగాయల బండి నుంచి కిరాణా షాప్‌ వరకు, టీ కొట్టు నుంచి స్టార్‌ హోటల్‌ వరకు ప్రతిచోటా యూపీఐ ఉనికి ఉంది. దీనివల్ల చిల్లర సమస్య కూడా తొలగిపోయింది. అత్యంత సులభంగా, రెప్పపాటు కాలంలో ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు డబ్బు పంపే సౌలభ్యం కారణంగా గ్రామీణ జనం కూడా యూపీఐకి బాగా అలవాటు పడ్డారు. 

ఐఫిల్ టవర్‌లో UPI ప్రారంభం
ప్రపంచవ్యాప్తంగా UPIని ఆమోదింపజేసేందుకు భారత ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెలలో, ప్రధాన యూరోపియన్ దేశం ఫ్రాన్స్‌లో UPI సర్వీస్‌ను లాంచ్‌ చేశారు. మీరు పారిస్‌లోని ఐఫిల్ టవర్‌ దగ్గర మీరు ఏదైనా షాపింగ్‌ చేస్తే, ఇప్పుడు UPI ద్వారా చెల్లింపు చేయొచ్చు. ఐఫిల్ టవర్‌ వెబ్‌సైట్‌లోనూ QR కోడ్ ఇచ్చారు. UPIతో అనుసంధానమైన యాప్‌ (గూగుల్‌ పే, ఫోన్‌పే వంటివి) నుంచి దీనిని స్కాన్ చేసి, డబ్బు చెల్లించొచ్చు.

కొంత కాలం ముందు, సింగపూర్‌లోనూ UPI అందుబాటులోకి వచ్చింది. సింగపూర్‌కు చెందిన ఇన్‌స్టాంట్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్ 'పేనౌ'తో (PayNow) ఇండియన్‌ UPI లింక్ అయింది. ఈ లింకేజీ వల్ల.. సింగపూర్‌ నుంచి భారతదేశానికి. భారతదేశం నుంచి సింగపూర్‌నకు రియల్‌ టైమ్‌లో నగదు బదిలీ సాధ్యమైంది. అంతేకాదు.. UAE, నేపాల్, భూటాన్ సహా భారతదేశం వెలుపల చాలా దేశాల్లో కూడా UPI సేవలు అందుబాటులో ఉన్నాయి.

అంతర్జాతీయ నంబర్లలోనూ అందుబాటు
ఇండియన్‌ యూపీఐ గ్లోబల్‌ యూపీఐగా మారుతున్న ఈ అద్భుతమైన ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయి సాధ్యమైంది. అది.. అంతర్జాతీయ మొబైల్ నంబర్‌ల ద్వారా యూపీఐ యాక్సెస్ అందుబాటులో ఉండటం. UPIని దాదాపు డజను దేశాల్లో అంతర్జాతీయ నంబర్‌ల నుంచి యాక్సెస్ చేయవచ్చు, ఉపయోగించవచ్చని ఒక రిపోర్ట్‌ వెల్లడించింది. మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంగ్‌ కాంగ్, ఒమన్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), బ్రిటన్‌లో ఈ సేవ అందుబాటులో ఉందని ఆ రిపోర్ట్‌ వెల్లడించింది. ఈ దేశాలలో అంతర్జాతీయ నంబర్‌ల ద్వారా, భారతీయ ప్రజలు NRE & NRO అకౌంట్ల నుంచి UPIని ఉపయోగించవచ్చు.

మరో ఆసక్తికర కథనం: ఐటీఆర్‌ ఫైలింగ్‌కు ముందు కచ్చితంగా క్రాస్‌ చెక్‌ చేయాల్సిన విషయాలివి

టాప్ హెడ్ లైన్స్

Alphabet Stock Crash: చరిత్రలోనే తొలిసారిగా అల్ఫాబెట్‌ షేర్లు భారీ పతనం.. ఒకే రోజులో ఆవిరైన రూ.47 లక్షల కోట్లు!
చరిత్రలోనే తొలిసారిగా అల్ఫాబెట్‌ షేర్లు భారీ పతనం.. ఒకే రోజులో ఆవిరైన రూ.47 లక్షల కోట్లు!
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
 Jio Maraket Listing: జియో జంబో లిస్టింగ్ రేపే.. రూ.10.3 లక్షల కోట్ల విలువతో స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. మార్కెట్ లో హుషారు
 జియో జంబో లిస్టింగ్ రేపే.. రూ.10.3 లక్షల కోట్ల విలువతో స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. మార్కెట్ లో హుషారు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Embed widget