By: Arun Kumar Veera | Updated at : 12 Feb 2024 03:09 PM (IST)
ఐటీఆర్ ఫైలింగ్‌కు ముందు కచ్చితంగా క్రాస్ చెక్ చేయాల్సిన విషయాలివి
Income Tax Return Filing 2024: కొన్నేళ్ల క్రితం వరకు, ఆదాయ పన్ను పత్రాల దాఖలును (ITR Filing) ఒక రాకెట్ సైన్స్‌లా ఉండేది. గజిబిజి లెక్కలు, సెక్షన్లతో సామాన్యుడికి అర్ధం కాని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలా కనిపించేదు. ఐటీఆర్ ఫైల్ చేయాలంటే కచ్చితంగా ఒక ఆడిటర్ అవసరం ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ మారింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చేసింది. దీంతో... ఎవరికి వాళ్లే, ముఖ్యంగా వేతన జీవులు తమ సొంతంగా రిటర్న్ ఫైల్ చేసుకునేలా ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ చాలా మార్పులు తెచ్చింది. తద్వారా ఆదాయ పన్ను పత్రాల సమర్పణను సులభంగా మార్చింది. ఇప్పుడు, ప్రి-ఫిల్‌డ్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (Pre-Filled Income Tax Return) కూడా అందుబాటులో ఉంది.
టాక్స్‌పేయర్‌కు సంబంధించిన ప్రతి ఆదాయం, TDS సమాచారం మొత్తం AIS (Annual Information Statement), TIS (Taxpayer Information Summary), ఫామ్ 26AS వంటి డాక్యుమెంట్లలో నమోదవుతుంది. కాబట్టి, ప్రి-ఫిల్డ్ ఐటీఆర్‌తో వీటిని సరిపోల్చుకుంటే సరిపోతుంది. కొన్ని ముఖ్యమైన ఆదాయాల గురించి మర్చిపోయే ఆస్కారం కూడా ఉండదు. కాబట్టి, ఐటీఆర్‌ను సులభంగా ఫైల్ చేయవచ్చు.
ఇన్‌కమ్ డిక్లరేషన్ ఈజీగా మారినా, అది ఒక సాంకేతికాంశం. చిన్న పొరపాటు జరిగినా ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీస్ రావచ్చు. మీరు 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయబోతున్నట్లయితే, ముందుగా కొన్ని విషయాల గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఇలా చేస్తే.. ఐటీఆర్ ఫైల్ చేయడం సులభమే కాకుండా తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఐటీఆర్ ఫైల్ చేసే ముందు కచ్చితంగా చూడాల్సిన విషయాలు:
మీరు మొదటిసారి ఐటీఆర్ ఫైల్ చేస్తున్నట్లయితే, ముందుగా మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీ పర్మినెంట్ మొబైల్ నంబర్‌ను మీ వద్ద ఉంచుకోండి. మీ ఆధార్ నంబర్-పాన్ కచ్చితంగా లింక్ అయి ఉండాలి. ఇప్పుడు, ఆదాయ పన్ను విభాగం అధికారిక వెబ్‌సైట్ https://eportal.incometax.gov.in లోకి వెళ్లండి. మొదటిసారి రిటర్న్ ఫైల్ చేసే వ్యక్తులు ముందుగా తమ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ వెబ్‌సైట్ హోమ్ పేజీలో, టాప్ రైడ్ సైడ్ కార్నర్‌లో క్రియేట్ బటన్ ఉంటుంది. దాని ద్వారా మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. మీ పాన్ నంబరే మీ యూజర్ ఐడీ అవుతుంది. పాస్‌వర్డ్ మీరే సృష్టించొచ్చు.
ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌తో ఎప్పుడూ పని ఉండదు కాబట్టి, సాధారణంగా చాలా మంది తమ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోతుంటారు. అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సిన బాక్స్ కింద కనిపించే "ఫర్‌గాట్ పాస్‌వర్డ్" ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు. మీ అకౌంట్‌కు మీరు లింక్ చేసిన ఫోన్ నంబర్‌కు OTP వస్తుంది. ఇక్కడ అడిగిన వివరాలను సరిగ్గా పూర్తి చేస్తేక మళ్లీ కొత్త పాస్‌వర్డ్ సృష్టించొచ్చు.
ITR ఫైల్ చేసే ముందు AIS, TIS, ఫామ్-26ASను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. వార్షిక సమాచార నివేదికలో (AIS) మీ పూర్తి ఆదాయాల వివరాలు ఉంటాయి. దీనిని చూడాలంటే.. ఆదాయ పన్ను విభాగం పోర్టల్‌లోకి మీ యూజర్ ఐడీ (పాన్), పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. మెయిన్ మెనూ బార్‌లో కనిపించే సర్వీసెస్‌ను క్లిక్ చేస్తే మరొక డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో AISను ఎంచుకోండి. ఇందులోని పార్ట్ వన్‌లో.. మీరు పేరు, పాన్, ఆధార్ వంటి వ్యక్తిగత సమాచారం ఉంటుంది. రెండో భాగంలో.. మీ సంపాదన, TDS, అడ్వాన్స్ టాక్స్, సెల్ఫ్ అసెస్‌మెంట్, డిమాండ్ వంటి పూర్తి సమాచారం ఉంటుంది. వీటన్నింటినీ తనిఖీ చేసి, తప్పులు ఏవైనా ఉన్నామో చూసుకోండి. ఏదైనా అంకె సరిగ్గా లేదు అనిపిస్తే, మీ యాజమాన్యాన్ని లేదా బ్యాంక్‌ను సంప్రదించాలి. ఆ ఇబ్బందిని తొలగించుకున్న తర్వాత ITR ఫైల్ చేయండి. ఇలా చేస్తే మీ వైపు నుంచి ఎలాంటి పొరపాటు జరగదు, ఐటీ నోటీస్ కూడా రాదు. ఆల్ హ్యాపీస్.
మరో ఆసక్తికర కథనం: ఓ కస్టమర్ కోపం - కోర్ట్ మెట్లు ఎక్కనున్న జొమాటో
Tax Saving Tips: రూ.18 లక్షల జీతంపైనా "జీరో టాక్స్" - చట్టాన్ని మీ చుట్టం చేసుకోవచ్చు!
Multiple Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా, తగ్గుతుందా?
Dividend: 17 నెలల పసివాడు సంపాదించిన డివిడెండ్ రూ.3.3 కోట్లు - ఎవరీ ఏకాగ్ర?
Gold Creates New Records: 7 రోజుల్లో 5 రికార్డ్‌లు బద్ధలు - అక్షయ తృతీయ నాడు రేటు ఎలా ఉండొచ్చు?
Cheaper Life Insurance: చవకైన జీవిత బీమా కావాలా?, ఈ 7 సింపుల్ ట్రిక్స్ ప్రయత్నించండి
Pahalgam Terror Attack Viral Photo: ఆ ఫోటో మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది… పహల్‌గామ్ దాడిలో చనిపోయిన వ్యక్తి ఫోటో వైరల్
Pahalgam Attack: కళ్లముందే ఉగ్రదాడి చూసి వణికిపోతున్న బాధితులు..మేమున్నాం అని ధైర్యం చెబుతున్న భారత సైన్యం!
AP Tragedy: ఉగ్రదాడుల్లో మరణించిన ఏపీ వాసులకు మంత్రుల నివాళి, వైజాగ్ చేరుకున్న చంద్రమౌళి మృతదేహం
Pak Reaction on Pahalgam Attack: మేం ఏం చేయలేదు, పహల్గాం ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వమే కారణం: పాకిస్తాన్