అన్వేషించండి

PM Kisan Yojana Update: రైతులకు గుడ్‌న్యూస్‌! కిసాన్‌ యోజన 12వ విడత నగదు వచ్చేది అప్పుడే!

PM Kisan Yojana Update: రైతు సోదరులకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన 12వ విడత డబ్బులు విడుదల చేయనుంది.

PM Kisan Yojana Update: రైతు సోదరులకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన 12వ విడత డబ్బులు విడుదల చేయనుంది. ఆగస్టు 31 లేదా సెప్టెబర్‌ 1న అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని సమాచారం. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిసింది.

ఏ విడత ఎప్పుడంటే?

పేదలైన అన్నదాతలను ఆదుకొనేందుకు నరేంద్రమోదీ సర్కారు ప్రవేశపెట్టిన పథకం పీఎం కిసాన్‌ యోజన! ఈ స్కీమ్‌లో చేరిన లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం ఏటా రూ.6000ను పెట్టుబడి సాయంగా అందజేస్తుంది. సాధారణంగా ఏప్రిల్‌ 1 నుంచి జులై 31 మధ్యలో తొలి విడత నిధులు విడుదల చేస్తారు. ఆగస్టు 1-నవంబర్‌ 30 మధ్య రెండో విడత పంట సాయం అందిస్తారు. డిసెంబర్‌ 1-మార్చి 31 మధ్య చివరి విడత డబ్బులు బదిలీ చేస్తారు.

బలపడుతున్న రైతులు

రైతుల్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ఈ మధ్యే ఓ ట్వీట్‌ చేశారు. 'మన రైతు సోదరసోదరీమణులను చూసి దేశం గర్విస్తోంది. వారెంత సమృద్ధిని సాధిస్తే దేశం అంత పటిష్ఠంగా మారుతుంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన సహా వ్యవసాయ సంబంధ పథకాలు రైతులకు అంతులేని బలాన్ని అందిస్తున్నాయి' అని పోస్టు చేశారు.

పథకంలో చేరేందుకు ఏయే పత్రాలు కావాలంటే..

  • లబ్ధిదారులకు రెండు హెక్టార్లకు మించి భూమి ఉండొద్దు.
  • భూమి యాజమాన్యం పత్రాలు
  • ఆధార్‌ కార్డు
  • గుర్తింపు కార్డు
  • డ్రైవింగ్‌ లేదా ఓటర్‌ ఐడీ
  • బ్యాంక్‌ ఖాతా పుస్తకం
  • మొబైల్‌ ఫోన్‌ నంబర్‌
  • చిరునామా
  • భూమి పరిమాణం సహా వివరాలు
  • ఒక పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో

రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..

  • ముందుగా మీరు పీఎం కిసాన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  • తర్వాత రైతుల కార్నర్ కనిపిస్తుంది.. దాని మీద క్లిక్ చేయాలి.
  • 'కొత్త రైతు నమోదు' ఎంపికపై క్లిక్ చేయాలి.
  • తరువాత, ఆధార్ సంఖ్యను నమోదు చేయాలి.
  • దీనితో పాటు, క్యాప్చా కోడ్‌ని నమోదు చేసి.. రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి.  తర్వాత ముందుకు వెళ్లాలి.
  • ఈ ఫారమ్‌లో మీ పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయాలి
  • బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పొలానికి సంబంధించిన సమాచారాన్ని అందించాలి.
  • ఆ తర్వాత మీరు ఫారమ్‌ను సమర్పించవచ్చు.

ఇలా చెక్ చేసుకోవాలి

పీఎం కిసాన్ లబ్ధిదారుడు తన ఖాతాలో డబ్బు పడిందో లేదో తెలుసుకోవాలంటే.. ముందుగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హోమ్ పేజీ pmkisan.gov.in కి వెళ్లండి. హోమ్ పేజీలో ఉన్న 'లబ్ధిదారుని స్థితి' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. తరువాత విండో తెరుచుకోగానే.. ఏదైనా ఎంపికను ఎంచుకోండి – ఆధార్ నంబర్, ఖాతా సంఖ్య లేదా మొబైల్ నంబర్.. ఎంటర్ చేయాలి. అలా ఎంచుకున్న ఎంపికను ఎంచుకున్న తర్వాత, ‘'డేటాను పొందండి'’ పై క్లిక్ చేయండి. డేటా మీ కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. లేదా ఇక్కడ కనిపించే ‘'పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్' డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయొచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
Construction Ban: నీతి ఆయోగ్ సంచలన ప్రతిపాదన- భారత్‌లో రెండేళ్ల పాటు నిర్మాణాలపై నిషేధం-ఇందులో నిజమెంత?
నీతి ఆయోగ్ సంచలన ప్రతిపాదన- భారత్‌లో రెండేళ్ల పాటు నిర్మాణాలపై నిషేధం - ఇందులో నిజమెంత?
Credit Card Settlement Offer: క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !
క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !
Pagani Hypercars: డబ్బుంటే సరిపోదు.. పగాని కారు కావాలంటే లక్ కూడా ఉండాలి.. ముఖేష్ అంబానీ కూడా కొనలేని కార్ల కథ!
డబ్బుంటే సరిపోదు.. పగాని కారు కావాలంటే లక్ కూడా ఉండాలి.. ముఖేష్ అంబానీ కూడా కొనలేని కార్ల కథ!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget