search
×

PM Kisan Yojana: రైతన్నలూ.. ఇకపై రూ.6000 పొందాలంటే ఈ కార్డు మీవద్ద ఉండాల్సిందే

కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.6000 ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై ఆ నగదు పొందాలంటే కొత్తగా మరో కార్డును చూపించాలి. లేదంటే నగదు బదిలీ ఆగిపోతుంది.

FOLLOW US: 
Share:

రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం 'పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన'. ఇందులో భాగంగా రెండు హెక్టార్లకు తక్కువ భూమి ఉన్న పేద కర్షకులకు ప్రభుత్వం రూ.6000 వరకు ఇస్తోంది. ఇప్పుడీ పథకంలో ఓ మార్పు చేశారు. ఇకపై లబ్ధిదారులు ఇతర పత్రాలతో పాటు కచ్చితంగా రేషన్‌ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే డబ్బులు రావు.

అనర్హులు జొరపడకుండా..!

ఈ పథకంలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేషన్‌ కార్డును తప్పని సరి చేసింది. అయితే అర్హతలు ఉండీ రేషన్‌ కార్డు లేకుంటే ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న రైతులు, ఇకపై చేసుకోవాలని అనుకుంటున్న రైతులూ తప్పకుండా రేషన్‌ కార్డును చూపించాల్సిందే. కార్డు లేనివారు త్వరగా దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించిన పోర్టల్‌లో రేషన్‌ కార్డు సంఖ్య సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది.

ఏయే పత్రాలు కావాలంటే..

 • లబ్ధిదారులకు రెండు హెక్టార్లకు మించి భూమి ఉండొద్దు.
 • భూమి యాజమాన్యం పత్రాలు
 • ఆధార్‌ కార్డు
 • గుర్తింపు కార్డు
 • డ్రైవింగ్‌ లేదా ఓటర్‌ ఐడీ
 • బ్యాంక్‌ ఖాతా పుస్తకం
 • మొబైల్‌ ఫోన్‌ నంబర్‌
 • చిరునామా
 • భూమి పరిమాణం సహా వివరాలు
 • ఒక పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో

త్వరలో పదో విడత బదిలీ

ప్రభుత్వం ఈ పథకం కింద ఇప్పటి వరకు 9 దఫాల్లో నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. పదో విడత నగదు 2021, డిసెంబర్‌ 15న జమ చేస్తారని తెలుస్తోంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద రైతులకు రూ.6000ను మూడు విడతల్లో రూ.2000 చొప్పున వేస్తారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 11.37 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. రూ.1.58 లక్షల కోట్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ పథకంలో చేరాలంటే సాగుచేస్తున్న భూమి రెండు హెక్టార్లలోపే ఉండాలి. వయసు 18-40 మధ్యే ఉండాలి.

Also Read: Paytm Vijay Shekhar Sharma: 10 వేలతో మొదలై రూ.17వేల కోట్లకు విజయ్‌.. పేటీఎం ఫౌండర్‌ విజయ గాథ ఇది!

Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!

Also Read: Skoda Slavia: స్కోడా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు

Also Read: Pan Card Update: అర్జెంట్‌గా పాన్‌ కావాలా? ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తుంది

Also Read: Petrol-Diesel Price, 19 November: యథాతథంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Nov 2021 04:59 PM (IST) Tags: Formers PM Kisan Yojana Big Change PMKSNY

సంబంధిత కథనాలు

UAN Number: మీ యూఏఎన్‌ నంబర్‌ మర్చిపోయారా, ఒక్క నిమిషంలో తెలుసుకోండి

UAN Number: మీ యూఏఎన్‌ నంబర్‌ మర్చిపోయారా, ఒక్క నిమిషంలో తెలుసుకోండి

Recurring Deposit: రికరింగ్‌ డిపాజిట్‌లో ఎక్కువ డబ్బు పొందాలంటే ఎలా?

Recurring Deposit: రికరింగ్‌ డిపాజిట్‌లో ఎక్కువ డబ్బు పొందాలంటే ఎలా?

Budget 2023: సుకన్య సమృద్ధికి బడ్జెట్‌లో బూస్ట్‌ - అలాంటి వారికీ ఛాన్స్‌ ఇస్తారట!

Budget 2023: సుకన్య సమృద్ధికి బడ్జెట్‌లో బూస్ట్‌ - అలాంటి వారికీ ఛాన్స్‌ ఇస్తారట!

Gold-Silver Price 30 January 2023: ₹58 వేలను దాటేలా కనిపిస్తున్న పసిడి, కొద్దికొద్దిగా పెరుగుతోంది

Gold-Silver Price 30 January 2023: ₹58 వేలను దాటేలా కనిపిస్తున్న పసిడి, కొద్దికొద్దిగా పెరుగుతోంది

Gold-Silver Price 29 January 2023: మళ్లీ పెరిగిన పసిడి, నగలు కొనాలనుకుంటే ఓసారి ఆలోచించుకోండి

Gold-Silver Price 29 January 2023: మళ్లీ పెరిగిన పసిడి, నగలు కొనాలనుకుంటే ఓసారి ఆలోచించుకోండి

టాప్ స్టోరీస్

టీడీపీ నేతలకు షాక్ - పరువు నష్టం దావా వేసిన రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

టీడీపీ నేతలకు షాక్ - పరువు నష్టం దావా వేసిన రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Adani vs Hindenburg: ₹14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 32 వేల పదాల నివేదిక

Adani vs Hindenburg: ₹14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 32 వేల పదాల నివేదిక

Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?

Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?

Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి

Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి