By: ABP Desam | Updated at : 10 Aug 2022 07:41 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఎన్ఎఫ్‌టీలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది.
ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్ స్టా.. ఇలా రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కంటెంట్ ప్రొవైడర్లు, టాలెంట్లు ఉన్నవాళ్లు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అయితే అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని తామిస్తామంటూ ముందుకొస్తున్నారు బ్లాక్ చైన్ ప్రొవైడర్లు. క్రిప్టో కెరన్సీకి మూలమైన బ్లాక్ చైన్ ప్రొవైడర్లు.. నాన్ ఫంజిబుల్ టోకెన్ల(NFT) పేరుతో ఆదాయాన్ని అందిస్తామంటున్నారు. మన వద్ద ఒరిజినల్ కంటెంట్ ఉంటే దాన్ని బ్లాక్ చైన్ ప్రొవైడర్ల ద్వారా వేలం వేసి టోకెన్ల రూపంలో ఆదాయాన్ని సముపార్జించడమే నాన్ ఫంజిబుల్ టోకెన్ అనే కాన్సెప్ట్. భారత్ లోని కళాకారులు, కంటెంట్ ప్రొవైడర్లు ఇప్పుడిప్పుడే NFT వైపు ఆకర్షితులవుతున్నారు.
భారత్‌లో సినీ, గేమింగ్ పరిశ్రమలకు NFTల ద్వారా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కళాకారులు, వివిధ ప్లాట్ ఫామ్‌ల యజమానులు వేలం ద్వారా ఊహకందని ఆదాయాన్ని పొందేందుకు NFTలు సరికొత్త ఉపాధి మార్గాన్ని చూపెడుతున్నాయి.
2021లో, భారతదేశం 86కి పైగా యాక్టివ్ NFT-బేస్డ్ స్టార్టప్ లు మొదలయ్యాయి. వాటిలో 71 స్టార్టప్ లను 2021లో తొలిసారిగా ప్రవేశ పెట్టారు. 2021లోనే సెలబ్రిటీలు తమ సొంత డిజిటల్ లైన్ ను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. అప్పటి వరకు వారంతా యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా రెవెన్యూపై ఆధారపడ్డారు. అయితే NFTల విషయంలో థర్డ్ పార్టీలకు అవకాశమే ఉండదు కాబట్టి, మరింత ఆదాయాన్ని సముపార్జించే అవకాశం ఉంటుంది.
అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, మనీష్ మల్హోత్రాతో సహా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు తమ డిజిటల్ టోకెన్ లకు 2021లోనే పథక రచన చేశారు. విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు లేదా ప్రకటించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రీడాకారులు తమ అభిమానులకు తమ ఉత్పత్తులను సొంతంగా అందించడానికి NFT మార్కెట్ ను ఉపయోగించుకుంటున్నారు. NFTలలోని మొత్తం కళాఖండాల విలువ 50 బిలియన్ డాలర్లకు చేరువ అవుతుందని అంచనా.
ముందుగా NFTలో అకౌంట్ తీసుకుని, దానికి పాస్ వర్డ్ జతచేసి మన దగ్గర ఉన్న ఒరిజినల్ కంటెంట్ ద్వారా ఆదాయాన్ని అందుకోవచ్చు. ఓటీటీలకు మరింత అడ్వాన్స్ గా ఈ NFT రూపొందుతోంది. అయితే ఇప్పటి వరకూ సెలబ్రిటీలు మాత్రమే ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. సామాన్యులు కూడా దీనిపై దృష్టిసారించే రోజులు వస్తాయంటున్నారు నిపుణులు. ఆన్ లైన్ కరెన్సీ క్రిప్టోకు కూడా భారత్ లో త్వరలో అనుమతి లభిస్తుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో NFTల మార్కెట్ కూడా విస్తృతం అవుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తుందని చెబుతున్నారు.
డిస్‌క్లెయిమర్: ఈ వెబ్‌సైట్‌లో వివిధ రచయితలు, ఫోరమ్ భాగస్వాములు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, నమ్మకాలు, అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి. క్రిప్టో ఉత్పత్తులు, NFTలు క్రమబద్ధీకరించబడవు. అలాగే అవి చాలా ప్రమాదకరమైనవి. అటువంటి లావాదేవీల ద్వారా కలిగే నష్టానికి ఎటువంటి రెగ్యులేటరీ ఉండకపోవచ్చు. క్రిప్టోకరెన్సీ చట్టబద్ధమైనది కాదు అలాగే మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటుంది. పాఠకులు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాను పొందాలి. ఆఫర్ డాక్యుమెంట్(లు)తో పాటు సబ్జెక్ట్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను జాగ్రత్తగా చదవాలి. క్రిప్టోకరెన్సీ మార్కెట్ అంచనాలు ఊహాజనితమైనవి. ఏ పెట్టుబడి అయినా పాఠకుల ఖర్చు, రిస్క్‌పై ఆధారపడి ఉంటుంది.
Today Gold and Silver Prices: నేడు బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో చూడండి! 10 గ్రాముల పసిడి కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది?
PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?
World Cheapest Silver Price: ప్రపంచంలో అత్యంత చౌకగా వెండి లభించే దేశం ఏదీ? భారత్ కంటే 40 వేల రూపాయల వరకు తక్కువ!
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
Iran vs America: అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!