search
×

Multibagger Stock: రూ.20వేలకు రూ.కోటి లాభం..! ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసిన మల్టీబ్యాగర్‌

కొన్ని కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తాయి. ఈ షేరూ అలాంటిదే. రూ.20వేల పెట్టుబడికి రూ.కోటికి పైగా లాభం ఇచ్చింది.

FOLLOW US: 
Share:

ఒక కంపెనీ షేర్లు కొంటున్నామంటే ఆ వ్యాపారం మనమే చేస్తున్నట్టు లెక్క! అందుకే సుదీర్ఘ కాలం అందులోనే పెట్టుబడి కొనసాగిస్తే మంచి రాబడి వస్తుంది. స్వల్పకాలం లేదా ట్రేడింగ్‌ చేయడం వల్ల నష్టపోయే అవకాశాలే ఎక్కువుంటాయి. 5,10, 15, 20 ఏళ్ల కాల పరిమితితో షేర్లు కొనుగోలు చేసి అట్టిపెట్టుకుంటే ఆ పెట్టుబడికి ఎన్నో రెట్ల సొమ్ము చేతికి అందుతుంది.

భారత్‌ రసాయన్‌ షేర్లు అందుకు ఓ ఉదాహరణ. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ఇందులో రూ.20,000 పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడవి రూ.కోటి అయ్యేవి. ఈ రెండు దశాబ్దాల్లో ఈ కంపెనీ షేర్ల ధర 500 రెట్లు పెరిగింది మరి! 20 ఏళ్ల క్రితం రూ.20గా ఉన్న షేరు ఇప్పుడు రూ.9895కు చేరుకుంది. గత ఆరు నెలలుగా షేరు ధర ఒత్తిడి గురవుతోంది. రూ.12,682 నుంచి రూ.9,895కు చేరుకుంది. ఇన్వెస్టర్లు తమ లాభాలను స్వీకరిస్తుండటమే ఇందుకు కారణం.

షేరు చరిత్ర ఇదీ

  • గత ఏడాది కాలంలో భారత్‌ రసాయన్‌ షేరు రూ.8710 నుంచి రూ.9985కు చేరుకుంది.
  • చివరి ఐదేళ్ల కాలంలో రూ.1910 నుంచి రూ.9985కు చేరుకుంది. అంటే 425 శాతం అన్నమాట.
  • అలాగ గత పదేళ్లలో రూ.110 నుంచి రూ.9985కు చేరింది. ఇక 20 ఏళ్లలో రూ.20 నుంచి రూ.9985కు వచ్చింది.

ఎప్పుడు కొంటే ఎంత అందేది?

  • భారత్‌ రసాయన్‌లో 6 నెలల క్రితం రూ.20వేలు పెట్టుంటే ఇప్పుడు రూ.16,000 అందుకొనేవారు.
  • ఏడాది క్రితం రూ.20,000 పెట్టుంటే ఇప్పుడు రూ.23,000 అయ్యేది.
  • ఐదేళ్ల క్రితం రూ.20,000 పెట్టుంటే ఇప్పుడు రూ.1.05 లక్షలు అందేవి.
  • పదేళ్ల క్రితం షేరుకు రూ.110 పెట్టుంటే ఇప్పుడు రూ.18.15 లక్షలు అందుకొనేవారు.
  • ఇక రూ.20 వద్ద 20 ఏళ్ల క్రితం రూ.20,000 పెట్టుంటే అక్షరాలా రూ.కోటి అందేవి.

Also Read: Paytm Vijay Shekhar Sharma: 10 వేలతో మొదలై రూ.17వేల కోట్లకు విజయ్‌.. పేటీఎం ఫౌండర్‌ విజయ గాథ ఇది!

Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!

Also Read: Skoda Slavia: స్కోడా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు

Also Read: Pan Card Update: అర్జెంట్‌గా పాన్‌ కావాలా? ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తుంది

Also Read: Petrol-Diesel Price, 19 November: యథాతథంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 19 Nov 2021 03:59 PM (IST) Tags: Stock market share market Multibagger stock Profit Bharat Rasayan Shares price

ఇవి కూడా చూడండి

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం

ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం

Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా

Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా

Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్‌ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI

Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్‌ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI

Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!

Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!

టాప్ స్టోరీస్

VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ

VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ

Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం

Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం

GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు

TTD adulterated ghee case:  టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు