By: ABP Desam | Updated at : 27 Apr 2022 05:30 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎల్‌ఐసీ ( Image Source : Getty )
LIC IPO Two Important Things Policyholders Need To Check Before Applying For Issue : దేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న ఎల్‌ఐసీ ఐపీవోకు ముహూర్తం ఫిక్స్ అయింది. 2022, మే 4న ఇష్యూ మొదలవుతోంది. మే9న ముగియనుంది. 16న ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు జమ అవుతాయి. ఆ మరుసటి రోజే మార్కెట్లో లిస్ట్ అవుతాయి.
ఎల్‌ఐసీ రూ.6 లక్షల కోట్ల విలువతో ఐపీవోకు వస్తోంది. ఇందులో 3.5 శాతం వరకే ప్రభుత్వం వాటా విక్రయిస్తోంది. రూ.20,557 కోట్లు విలువైన 22.13 కోట్ల షేర్లను మాత్రమే విక్రయిస్తోంది. షేర్ల ధరను రూ.902-949గా నిర్ణయించింది. ఒక్కో లాట్‌లో 15 షేర్లు ఉంటాయి. ఉద్యోగులకు 15.81 లక్షల షేర్లు, పాలసీ దారులకు 2.21 కోట్ల షేర్లను రిజర్వు చేశారు. రిటైల్ షేర్ హోల్డర్లు, ఉద్యోగులకు రూ.45, పాలసీహోల్డర్లకు రూ.60 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
పాలసీ హోల్డర్లు డిస్కౌంట్ పొందేందుకు ఎల్‌సీఐ కొన్ని నిబంధనలు విధించింది. 2022, ఫిబ్రవరి 22లోపే ఎల్‌ఐసీ పాలసీలతో పాన్‌ను అనుసంధానం చేసుకోవాలని చెప్పింది. ఆ తర్వాత చేసిన వాళ్లు రిజర్వు పోర్షన్‌లో షేర్లు పొందేందుకు అర్హులు కారని వెల్లడించింది. 'పాలసీదారుడు సాధ్యమైనంత త్వరగా పాన్ వివరాలను పాలసీ రికార్డులతో అనుసంధానం చేసుకోవాలి. సెబీ వద్ద ఎల్‌ఐసీ ఐపీవో ముసాయిదా దాఖలుకు రెండు వారాల ముందు (2022, ఫిబ్రవరి 28)గా పాన్ అప్‌డేట్ చేసుకోవాలి. లేదంటే వారు రిజర్వు కోటాలో షేర్లు పొందేందుకు అర్హులు కారు' అని డ్రాఫ్ట్‌లో ఎల్‌ఐసీ తెలిపింది.
ఎల్‌ఐసీ పాలసీలతో పాన్‌ను లింక్ చేసుకోవడం ఇలా!
ఎల్‌ఐసీ వద్ద పాన్ వివరాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం ఎలా?
మీ పాలసీ నంబర్, పుట్టినరోజు, క్యాప్చా ఎంటర్ చేస్తే ఎల్‌ఐసీలో ఈ పాన్ వివరాలు అప్‌డేట్‌గా ఉన్నాయో లేవో చూపిస్తుంది.
Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Personal loan Interest Rates: దిగొచ్చిన పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు.. టాప్ 5 బ్యాంకులలో ఏది తక్కువ వడ్డీకి లోన్ ఇస్తుంది
PPF vs FD : సేవింగ్స్ చేయడానికి PPF మంచిదా? FD బెటరా? ఎక్కువకాలం పొదుపు చేస్తే ట్యాక్స్, వడ్డీ ఎలా ఉంటాయి?
పర్సనల్ లోన్ కొరకు అర్హత: బజాజ్ ఫైనాన్స్ తో త్వరిత నిధులకు సులభమైన మార్గదర్శకం
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత!
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!