search
×

Personal loan: ఒక పర్సనల్ లోన్ తీసుకునే ముందు పరిగణించవలసిన 4 అంశాలు

ఖర్చుల నిర్వహణ కొరకు మీరు ఒక పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు ఈ దిగువన ఇవ్వబడ్డాయి.

FOLLOW US: 
Share:

ఖర్చుల నిర్వహణ కొరకు మీరు ఒక పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు ఈ దిగువన ఇవ్వబడ్డాయి.

ఒక అత్యవసర పరిస్థితి కొరకైనా, లేదా వివాహము లేదా విహార యాత్రకైనా మీకు నిధుల కొరత ఏర్పడినప్పుడు ఒక పర్సనల్ లోన్ ప్రాణరక్షకి కావచ్చు. ఇది మీ పొదుపుల తగ్గించుకోకుండా నిధులకు ప్రాప్యత పొందే ఒక త్వరిత మరియు సులభమైన విధానము. కాని ‘ఇప్పుడే దరఖాస్తు చేయండి” బటన్ పై క్లిక్ చేసే ముందు, ఒక్క క్షణం ఆగి మీరు అప్పు తీసుకునే అనుభవాన్ని సానుకూలం చేసే లేదా ప్రతికూలం చేసే కొన్ని కీలక అంశాలను గమనించండి.

ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేసే ముందు మీరు పరిగణించవలసిన 4 ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

1. మీకు ఋణము ఎందుకు కావాలో ఖచ్ఛితంగా తెలుసుకోండి
పర్సనల్ లోన్స్ బహుముఖమైనవి, కాని దాని అర్థం స్పష్టమైన ఉద్దేశము లేకుండా మీరు ఋణము తీసుకోవాలని కాదు.
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి: నాకు ఈ ఋణము అవసరం ఉందా?
ఇది అనుకోని వైద్య బిల్లులను కవర్ చేయటానికా? ఇంటి పునరుద్ధరణ కోసమా? పిల్లల విద్యాభ్యాసము కోసం చెల్లించాలా? యూరప్ యాత్రకు వెళ్ళాలా?

మీ కారణము గురించి ఖచ్ఛితంగా తెలుసుకోవడం ఈ విధంగా సహాయపడుతుంది:
• మీకు నిజంగా అవసరమైన మొత్తాన్ని మాత్రమే ఋణముగా తీసుకోండి
• మీ ఆర్ధిక పరిస్థితికి సరిపోయే కాలపరిమితిని ఎంచుకోండి
• తరువాత అనవాసరమైన ఆర్ధిక ఒత్తిడికి లోనవ్వకండి.

ఉదాహరణ: ఒకవేళ మీరు మీ ఇంటిని పునరుద్ధరిస్తూ ఉంటే మరియు దాని ఖర్చు రూ. 5 లక్షల వరకు వస్తుంది అని అంచనావేస్తే, “ఒకవేళ అవసరం అయితే” అని ఆలోచిస్తూ రూ. 10 లక్షల ఋణము తీసుకోకండి. మీ బడ్జెట్ కు కట్టుబడి ఉండండి. ఎక్కువగా-అప్పు తీసుకోవడం అంటే అధిక ఈఎంఐలు మరియు వడ్డీ చెల్లింపులు. 

భారతదేశపు ప్రముఖ ఆర్ధిక సంస్థలలో ఒకటి అయిన బజాజ్ ఫైనాన్స్, తక్షణ ఆమోదాలు మరియు అనువైన తిరిగిచెల్లింపు నియమాలతో రూ. 55 లక్షల వరకు పర్సనల్ లోన్ అందిస్తుంది.

2. మీ ఋణ అర్హత మరియు క్రెడిట్ స్కోర్ ను పరీక్షించుకోండి
ఒక పర్సనల్ లోన్ అసురక్షితమైనది (అంటే ఎలాంటి కొల్లాటరల్ అవసరం లేనిది) అయినప్పటికీ, ఋణము మంజూరు చేసే ముందు ఋణదాతలు మీ క్రెడిట్ యోగ్యతను అంచనావేస్తారు. మీ CIBIL స్కోర్, ఆదాయము, ఉద్యోగ స్థిరత్వము మరియు ప్రస్తుతం ఉన్న అప్పులు కీలక పాత్ర పోషిస్తాయి.

దరఖాస్తు చేసే ముందు:
• మీ క్రెడిట్ స్కోర్ ను పరీక్షించుకోండి
• మీ నెలవారి బాధ్యతలను సమీక్షించుకోండి
• స్థిరమైన ఆదాయ వనరును నిర్ధారించండి

బజాజ్ ఫైనాన్స్ తో సహా, ఋణదాతలు ఆన్లైన్ లో సులభమైన అర్హతా చెక్ ను అందిస్తాయి. మీకు అర్హత ఉందా లేదా అని మీరు క్షణాలలో తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ముందుగా-ఆమోదించబడిన ఆఫర్ ఉందా అని పరీక్షించుటకు మీ ఫోన్ నంబర్ మరియు ఓటిపిని ఎంటర్ చేయండి.

3. వడ్డీ రేటు మరియు మొత్తం ఋణము ఖర్చును అర్థంచేసుకోండి
తక్కువ వడ్డీ రేటు అంటే చవకైన ఋణము అని అర్థం కాదు. మీరు మొత్తం ఋణము ఖర్చు ఎంత అనేది చూసుకోవాలి, ఇందులో ఉన్నవి:
• వడ్డీ రేటు (ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్)
• ప్రాసెసింగ్ ఫీజు
• ముందస్తుచెల్లింపు/జప్తు చార్జీలు
• ఆలస్య చెల్లింపు జరిమానాలు
• మరేవైనా ఫీజులు మరియు చార్జీలు
బజాజ్ ఫైనాన్స్ తో, మీకు పారదర్శకమైన ధరలు, అనువైన కాలపరిమితులు (96 నెలల వరకు) మరియు సున్నా దాగిఉన్న చార్జీలు ఉంటాయి, దీనితో మీరు మీ తిరిగిచెల్లింపులు ప్రణాళిక చేసుకోవడం సులభం అవుతుంది.

నిపుణుడి చిట్కా: మీరు దరఖాస్తు చేసే ముందు మీ నెలవారి చెల్లింపులను తెలుసుకొనుటకు పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించండి.

ఉదాహరణ: 36 నెలల కొరకు 11% ప్రకారం రూ. 3 లక్షల ఋణానికి 24 నెలల కంటే తక్కువ ఈఎంఐలు ఉంటాయి. కాని మొత్తమ్మీద మీరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారు. మీ నెలవారి స్తోమత మరియు దీర్ఘ-కాలిక వడ్డీ భారము ఆధారంగా ఎంచుకోండి.

4. వెసులుబాటు మరియు మద్ధతును అందించే విశ్వసనీయమైన ఋణదాతను ఎంచుకోండి
అన్ని పర్సనల్ లోన్స్ ఒకేరకంగా తయారుచేయబడవు. ఒక ప్రముఖ ఋణదాతను ఎంచుకోవడం వలన దరఖాస్తు, తిరిగిచెల్లింపు మరియు ఆ తరువాత ఏవైనా సమస్యలు తలెత్తినా మీ అనుభవములో పెద్ద వ్యత్యాసము చూపుతుంది:
• తక్షణ ఆన్లైన్ ఆమోదము మరియు కనీస దస్తావేజులు
• అనువైన తిరిగిచెల్లింపు ఎంపికలు మరియు పాక్షిక-ముందస్తుచెల్లింపు సదుపాయాలు
• దృఢమైన వినియోగదారు సపోర్ట్
• యాప్ లేదా పోర్టల్ ద్వారా సులభమైన ఖాతా నిర్వహణ

బజాజ్ ఫైనాన్స్ తో, మీరు ఒక పర్సనల్ లోన్ కొరకు కేవలం కొన్ని నిమిషాలలో పూర్తిగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఈ క్రింది ఫీచర్స్ కూడా అందుతాయి:
• 24 గంటలలో పంపిణి*
• ఆన్లైన్ లోన్ ఖాతా నిర్వహణ
• నామమాత్రపు ఫీజుతో పాక్షిక-ముందస్తుచెల్లింపు మరియు జప్తు ఎంపికలు

ఇది ఎందుకు ముఖ్యం: మీ ఋణాన్ని ముందుగా చెల్లించుటకు లేదా ముందుగానే మూసివేయుటకు ఉన్న వెసులుబాటు వలన వడ్డీ రూపములో మీరు వేలరూపాయలు ఆదా చేసుకోవచ్చు. సహాయకారిగా ఉండే కస్టమర్ కేర్ బృందము మీరు చేసే తిరిగిచెల్లింపులను మృదువైనవిగా చేస్తుంది, ముఖ్యంగా జీవితములోని అనుకోని మలుపులలో.

అంతిమ ఆలోచనలు
ఒక పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకోవడం చాలా పెద్ద నిర్ణయము – సరిగ్గా అమలు చేస్తే అపారమైన ఉపశమనాన్ని ఇస్తుంది లేదా ఒకవేళ తొందరపడితే ఆర్ధిక ఒత్తిడి కలుగుతుంది. ఎప్పుడు ఈ అంశాల గురించి ఆలోచించండి:
• స్పష్టమైన ఉద్దేశాన్ని ఏర్పరచుకోండి
• మీ అర్హత తెలుసుకోండి
• ఖర్చును అర్థంచేసుకోండి
• విశ్వసనీయమైన ఋణదాతను ఎంచుకోండి

ఒక అత్యవసర అవసరం కోసం రూ. 1 లక్ష అయినా, జీవితములో ప్రధానమైన మైలురాయి కోసం రూ. 25 లక్షలు అయినా, నమ్మకముతో నిర్ణయాన్ని తీసుకోండి.

Disclaimer: This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.

Published at : 16 Jun 2025 02:29 PM (IST) Tags: Personal Loan Personal Finance

ఇవి కూడా చూడండి

SBI ATM Transaction Fees:ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!

SBI ATM Transaction Fees:ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?

Best Business Plan: గ్రామంలో పిండి మరను ఎలా తెరవవచ్చు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది?

Best Business Plan: గ్రామంలో పిండి మరను ఎలా తెరవవచ్చు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది?

Today Gold and Silver Prices: నేడు బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో చూడండి! 10 గ్రాముల పసిడి కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది?

Today Gold and Silver Prices: నేడు బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో చూడండి! 10 గ్రాముల పసిడి కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది?

PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?

PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?

టాప్ స్టోరీస్

Rahul Gandhi On Rohit Vemula Act: "రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi On Rohit Vemula Act:

Hyderabad News: హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

Hyderabad News: హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

IND vs NZ 3rd ODI: ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్

IND vs NZ 3rd ODI: ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్

PF Withdrawal By UPI: PF ఖాతాదారులకు శుభవార్త.. UPI యాప్స్ ద్వారా నగదు విత్‌డ్రాపై బిగ్ అప్‌డేట్

PF Withdrawal By UPI: PF ఖాతాదారులకు శుభవార్త.. UPI యాప్స్ ద్వారా నగదు విత్‌డ్రాపై బిగ్ అప్‌డేట్