అన్వేషించండి

EPFO 3.0 ATM Withdrawal: పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏటీఎంలో విత్‌డ్రా అప్‌డేట్ వచ్చేసింది !

EPFO 3.0 ATM Withdrawal: ఈపీఎప్‌వో చందాదారులకు ఊరటనిస్తూ కేంద్రం ఈపీఎఫ్‌వో 3.0 తీసుకువస్తోంది. దీని ద్వారా జూన్ నెలాఖరు నుంచి UPI, ATM ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌లో నగదు డ్రా చేసుకోవచ్చు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఈపీఎఫ్‌వో 3.0 ద్వారా పీఎఫ్ డబ్బులు ఏటీఎంలా డ్రా చేయవచ్చు.
  • బ్యాలెన్స్‌లో 75% వరకు తక్షణ విత్‌డ్రాలకు అనుమతి లభిస్తుంది.
  • ఈ సేవలతో పెన్షన్‌కు ఆటంకం ఉండదు, క్లెయిమ్‌లు ఆటోమేటిక్.
  • జూన్ చివరిలో ప్రారంభం, ఆధార్, బ్యాంక్ వివరాలు సిద్ధం చేయండి.

EPFO 3.0 ATM Withdrawal: మీ పీఎప్‌ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే ఒకప్పుడు వారాల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కంపెనీ చుట్టూ, పీఎఫ్‌ ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడేవాళ్లు. కానీ ఇకపై ఆ కష్టాలకు కాలం చెల్లింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఈపీఎఫ్‌వో 3.0 వెర్షన్‌తో మీ పీఎప్‌ అకౌంట్‌ ఒక ఏటీఎం కార్డులా మారిపోతోంది. అంటే మీ మొబైల్‌లో యూపీఐ ద్వారా గానీ లేదా దగ్గరలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్లి చిటికెలో పీఎఫ్‌ డబ్బులను డ్రా చేసుకోవచ్చు. ఈ నెలాఖరు నాటికి అంటే జూన్ చివరి వారంలోనే ఈ సరికొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. సుమారు కోట్లాది మంది వేతనజీవులకు ఇది ఒక భారీ ఊరట అని చెప్పాలి. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయాల్లో హాస్పిటల్ ఖర్చులు లేదా ఇతర అత్యవసరాల కోసం పీఎఫ్‌ డబ్బులను పొందే ప్రక్రియను EPFO పూర్తిగా డిజిటలైజ్‌ చేస్తోంది. 

ఏటీఎం నుంచి ఎంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు?

ఈపీఎఫ్‌వో 3.0 నిబంధనల ప్రకారం, చందాదారులు తమ పీఎఫ్‌ బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75 శాతం వరకు తక్షణమే విత్‌డ్రా చేసుకునే వీలు కల్పిస్తున్నారు. అయితే కొన్ని నివేదికల ప్రకారం ఇది 50 శాతం నుంచి 75 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ మొత్తం బ్యాలెన్స్‌లో కనీసం 25శాతం సొమ్మును రిటైర్‌మెంట్‌ కోసం తప్పనిసరిగా ఖాతాలోనే ఉంచాలి. 

పెన్షన్‌పై ప్రభావం ఉంటుందా?

చాలా మంది ఉద్యోగులకు ఉన్న ప్రదాన సందేహం, పీఎప్‌ డబ్బులు ఇలా ఏటీఎం ద్వారా డ్రా చేస్తే భవిష్యత్‌లో వచ్చే పెన్షన్ తగ్గిపోతుందా అని. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఈ ఏటీఎం విత్‌డ్రా సదుపాయం కేవలం మీ ఈపీఎస్‌ ఖాతాలో ఉండే పెన్షన్ డబ్బులు పూర్తిగా సురక్షితంగా ఉంటాయి. మీరు పదేళ్ల సర్వీస్‌ పూర్తి చేసిన తర్వాత నిబంధనల ప్రకారం పెన్షన్ పొందేందుకు అర్హులుగా ఉంటారు. మధ్యలో పీఎఫ్‌ డబ్బులు డ్రా చేసినా మీ సర్వీస్‌ రికార్డు మారదు. 

ఈపీఎఫ్‌వో 3.0లోని ఫీచర్స్‌ ఇవే!

ఈ సరికొత్త సిస్టమ్‌ కేవలం విత్‌డ్రాయల్స్‌ కోసమే కాదు, మరిన్ని అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఐదు లక్షల వరకు ఉండే అడ్వాన్స్‌ క్లెయిమ్స్‌ ఇప్పుడు ఎటువంటి మాన్యువల్‌ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గా సెటిల్ అవుతాయి. పేరు, పుట్టిన తేదీ లేదా ఇతర ప్రొఫైల్‌ వివరాలను ఆఫీసులకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో సరిచేసుకోవచ్చు. ఈ వ్యవస్థను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియాతో కలిసి రూపొందించారు. దీని వల్ల UAN నంబర్‌, OTP వెరిఫికేషన్ ద్వారా అత్యంత వేగంగా లావాదేవీలు జరుగుతాయి. గతంలో పీఎఫ్‌ విత్‌డ్రా కోసం యజమాని అనుమతి తప్పనిసరిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆధార్ ఆధారిత అథెంటికేషన్‌తో ఈ ప్రక్రియ చాలా సులభతరం కానుంది. 

ఈ సేవలు ఎప్పటి నుంచి ప్రారంభం?

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఇప్పటికే దీనిపై కీలక ప్రకటన చేశారు. సిస్టమ్‌ టెస్టింగ్ పూర్తి అయ్యిందని త్వరలోనే అధికారికంగా లాంచ్ చేస్తామని తెలిపారు. సర్వర్‌ వెర్షన్ 2.01 అందుబాటులోకి వచ్చిన వెంటనే జూన్ నెలాఖరులోపు  ఈ సర్వీస్‌లు లైవ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. 

పీఎఫ్‌ ఏటీఎం సేవలు పొందాలంటే మీరు చేయాల్సిన పనులు

ఈ సదుపాయం ప్రారంభం కాకముందే మీ అకౌంట్‌ను సిద్ధం చేసుకోవడం మంచిది. దీని కోసం మీ UANతో ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. పీఎప్‌ పోర్టల్‌లో మీ బ్యాంక్ అకౌంట్‌ వివరాలు, IFSC కోడ్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఆధార్‌, పాన్, పీఎప్‌ రికార్డుల్లో మీ పేరు, పుట్టిన తేదీ ఒకేలా ఉండాలి. మీ బ్యాంకు అకౌంట్‌కు లిక్ అయ్యి ఉన్న UPI ఐడీని యాక్టివ్‌గా ఉంచుకోండి. 

Frequently Asked Questions

ఈపీఎఫ్‌వో 3.0 అంటే ఏమిటి?

ఇది పీఎఫ్‌ ఖాతాను ఏటీఎం కార్డులా మార్చే సరికొత్త వ్యవస్థ. మొబైల్ యూపీఐ లేదా ఏటీఎం ద్వారా పీఎఫ్‌ డబ్బులను సులభంగా డ్రా చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో పీఎఫ్‌ పొందే ప్రక్రియను డిజిటలైజ్ చేస్తుంది.

ఏటీఎం ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌లో ఎంత శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు?

చందాదారులు తమ పీఎఫ్‌ బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75 శాతం వరకు తక్షణమే విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, కనీసం 25 శాతం సొమ్మును రిటైర్‌మెంట్‌ కోసం ఖాతాలోనే ఉంచాలి.

పీఎఫ్‌ ఏటీఎం విత్‌డ్రాల వల్ల పెన్షన్‌పై ప్రభావం ఉంటుందా?

లేదు, ఈ ఏటీఎం విత్‌డ్రా సదుపాయం మీ ఈపీఎస్‌ ఖాతాలో ఉండే పెన్షన్ డబ్బులను ప్రభావితం చేయదు. పెన్షన్ డబ్బులు పూర్తిగా సురక్షితంగా ఉంటాయి మరియు సర్వీస్‌ రికార్డు మారదు.

ఈపీఎఫ్‌వో 3.0 సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి?

సిస్టమ్ టెస్టింగ్ పూర్తయింది. జూన్ నెలాఖరులోపు ఈ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు.

పీఎఫ్‌ ఏటీఎం సేవలు పొందడానికి ఏమి చేయాలి?

మీ UANకు ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ వివరాలు, IFSC కోడ్ సరిగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఆధార్, పాన్, పీఎఫ్‌ రికార్డుల్లో పేరు, పుట్టిన తేదీ ఒకేలా ఉండాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget