By: Arun Kumar Veera | Updated at : 30 Jan 2025 01:08 PM (IST)
జపనీస్ బడ్జెటింగ్ పద్ధతి ( Image Source : Other )
What is the Kakeibo Method of Budgeting: డబ్బు ఆదా చేయడం ఒక కళ, ఇది అందరికీ ఒంటబట్టదు. పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదిస్తున్న వ్యక్తులకు కూడా మనీ సేవింగ్ ఒక సమస్యగా ఉంటుంది. దీనికి పరిష్కారం జపనీస్ బడ్జెట్ పద్ధతి "కకీబో". దీనిని ఖచ్చితంగా ఫాలో అయితే నెలవారీ ఖర్చుల్లో 35% వరకు పొదుపును కళ్లజూడవచ్చు.
కకీబో అంటే ఏమిటి?
కకీబో అనేది జపనీస్ పదం. దీని అర్ధం 'గృహ ఆర్థిక లెడ్జర్'. కకీబో అనేది జపనీస్ బడ్జెటింగ్ పద్ధతి. రోజువారీ ఖర్చులను గుర్తుంచుకోవడానికి & పొదుపు లక్ష్యాలను సాధించానికి ఇది సాయపడుతుంది. ఈ పద్ధతిని, జపనీస్ తొలి మహిళా జర్నలిస్ట్ హని మోటోకో 1904లో ప్రతిపాదించారు. జపనీస్ గృహిణులు, వృథా ఖర్చులు లేకుండా తమ ఇంటి బడ్జెట్ వేయడానికి దీనిని రూపొందించారు.
కకీబో పద్ధతిలో ఏం చేయాలి?
కకీబో పద్ధతి.. ప్రతి ఖర్చుకు ఒక ఖాతాను రూపొందిస్తుంది. మొదటస, ఒక వ్యక్తి తన ఖర్చులను నాలుగు వర్గాలు విభజించాలి:
1. అవసరాలు: ఒక వ్యక్తి జీవించడానికి కనీస అవసరాలు ఇవి & ఇవి లేకుండా జీవించలేరు. ఉదా.. ఆహారం, రోజువారీ అవసరాలు, వైద్య ఖర్చులు, రవాణా ఖర్చులు వంటివి.
2. కోర్కెలు: ఇవి, జీవితాన్ని ఆస్వాదించడానికి అనుమతించే ఖర్చులు, మనుగడకు తప్పనిసరి కాదు. ఉదా.. బయట తినడం, షాపింగ్ వంటివి.
3. సంస్కృతి/వ్యాపకాలు: సాంస్కృతితో అనుబంధాన్ని కొనసాగించడానికి అనుమతించే వ్యయాలు ఇవి. ఉదా.. పుస్తకాలు, మ్యూజియం, నాటకాలు, సినిమా కోసం చేసే ఖర్చులు.
4. ఊహించని ఖర్చులు: ముందుగా అంచనా వేయలేని ఖర్చులు. ఉదా.. అనారోగ్య పరిస్థితులు, ఇంటి మరమ్మతులు వంటివి.
మీ ఖర్చులను ట్రాక్ చేయడానికి, ఒకటి పెద్దది & ఒకటి చిన్నది చొప్పున రెండు నోట్‌బుక్స్ నిర్వహించాలి. చిన్న నోట్‌బుక్‌ను మీ వెంట తీసుకెళ్లాలి, ప్రతి రోజూ చేసే నాలుగు వర్గాల ఖర్చులను దీనిలో రాయాలి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ప్రతి ఖర్చును వర్గం వారీగా పెద్ద నోట్‌బుక్‌లోకి ఎక్కించాలి. తద్వారా, మీరు ఎలాంటి ఖర్చులు పెడుతున్నారో మీ కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఏది అవసరమో, ఏది అనవసరమో అర్ధం అవుతుంది.
డబ్బు ఆదా కోసం కకీబోను ఎలా ఉపయోగించాలి?
కకీబోను విజయవంతంగా అమలు చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి:
1. స్థిర ఖర్చులు: అద్దె, యుటిలిటీ ఖర్చులు, EMIలు వంటి స్థిర ఖర్చులతో సహా మీ నెలవారీ మొత్తం ఖర్చులను విశ్లేషించండి.
2. నెలవారీ ఆదాయం: రాబోయే నెలలో మీకు వచ్చే అన్ని రకాల ఆదాయాలను యాడ్ చేయండి. మీకు ఖచ్చితమైన ఆదాయం లేకున్నప్పటికీ, వచ్చే నెలలో ఆశించే ఆదాయాన్ని నమోదు చేయండి.
3. వచ్చే నెల పొదుపు లక్ష్యం: వచ్చే నెలలో మీరు ఎంత ఆదా చేయాలనుకుంటున్నారో ఇక్కడ నిర్ణయించండి. ఈజీగా సాధించే లక్ష్యాన్ని కాకుండా, కష్టమైన విషయంలో డబ్బు ఆదా కోసం టార్గెట్ పెట్టుకోండి.
4. ఎంత ఖర్చు చేయవచ్చు?: ఈ ఖర్చులలో, మీ స్థిర ఖర్చులు కాకుండా అన్ని ఖర్చులు ఉంటాయి.
ఉదాహరణకు మీ ఆదాయం = రూ.50,000
స్థిర ఖర్చులు (అద్దె, యుటిలిటీలు వంటివి) = రూ.20,000
పొదుపు లక్ష్యం = రూ.10,000
ఈ లెక్కన, వచ్చే నెలలో మీరు ఖర్చు చేయగల డబ్బు = ఆదాయం – స్థిర ఖర్చులు – పొదుపు. అంటే.. 50000 – 20000 – 10000 = 20.000.
రూ. 50,000 ఆదాయం ఉన్న వ్యక్తిగా, మీ స్థిర ఖర్చులు కాకుండా మిగిలిన అన్ని ఖర్చుల కోసం మీరు వెచ్చించాల్సిన డబ్బు రూ.20,000. తదుపరి నెలలో మీరు ఈ పరిధిని దాటకూడదు.
5. ఖర్చు చేసే డబ్బును 4తో భాగించండి: సాధారణంగా, ఒక నెలలో నాలుగు వారాలు ఉంటాయి. రూ.20,000 ఖర్చు చేసేందుకు, మీరు ప్రతి వారం గరిష్టంగా రూ.5,000 ఖర్చు చేయవచ్చు. కాబట్టి, మీ వారపు ఖర్చులను రూ.5,000కు పరిమితం చేయాలి. తద్వారా మీరు ఎప్పుడూ బడ్జెట్‌ను దాటరు.
6. ప్రణాళికలో ఉన్న ఖర్చులకు - వాస్తవ ఖర్చులకు పోలిక: ప్రతి వారం చివరిలో, మీరు ఖర్చు చేసిన మొత్తాన్ని, వాస్తవంగా మీరు ఖర్చు చేయాలనున్న మొత్తాన్ని పోల్చి చూడండి. దీనివల్ల, మీకు ఏ ఖర్చులు నిజంగా ముఖ్యమైనవి, ఏవి కావు అనే అంచనాకు వస్తారు. తద్వారా, ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయడం అలవాటు అవుతుంది. ఒకవేళ, ఒక నెలలో ఏదైనా అత్యవసరం కోసం బడ్జెట్‌ను మించి ఖర్చు చేయాల్సి వస్తే, దానిని భర్తి చేయడానికి కోరికలు లేదా వ్యాపకాల విభాగంలో తక్కువ ఖర్చు చేయవచ్చు.
కకీబో చెప్పే అదనపు పాఠాలు
* ఏదైనా వస్తువు/సేవ మీకు కావాలనిపిస్తే.. దానిని తదుపరి నెల వరకు వాయిదా వెయ్యండి. నెల తర్వాత దానిపై ఆసక్తి తగ్గిపోవచ్చు. అప్పటికీ ఆ వస్తువు/సేవ కోసం తపిస్తుంటే, దానిని కొనడం వల్ల మీ జీవితానికి ఎలాంటి విలువను జోడించగలరో విశ్లేషించుకోండి.
* మార్కెట్‌కు వెళ్లేటప్పుడు కచ్చితంగా షాపింగ్ లిస్ట్‌ను తీసుకెళ్లండి, ఆ లిస్ట్‌లో ఉన్నవి మాత్రమే కొనండి. దీనివల్ల, అనుకోని కొనుగోళ్లు చేసే అవకాశం తగ్గుతుంది.
* ఒక వస్తువు అమ్మకానికి ఉంటే, 'అది అమ్మకానికి లేకుంటే దానిని కొనుగోలు చేయలేం కదా' అని ప్రశ్నించుకోండి.
* ప్రతి కొనుగోలుకు నగదును ఉపయోగించడానికి ప్రయత్నించండి. నేరుగా నగదు ఇవ్వడం వల్ల ఎంత ఖర్చు చేస్తున్నారో మీకు తెలుస్తుంది. కార్డ్‌తో చేసే చెల్లింపుల్లో మీకు ఈ అనుభవం రాదు.
మరో ఆసక్తికర కథనం: 5 కంపెనీలు 'ఫ్రీ'గా షేర్లు ఇస్తున్నాయి, వీటిలో ఒక్కటయినా మీ పోర్ట్‌ఫోలియోలో ఉందా?
Income Tax: రూ.12 లక్షల ఆదాయంపై పన్ను మిహాయింపు గ్రాస్ శాలరీ మీదా, నెట్ శాలరీ మీదా? సమాధానం మీకు తెలుసా?
PM Kisan Nidhi: ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లోకి రూ.2000 - ఈ రైతులకు మాత్రం డబ్బులు రావు!
50 30 20 Rule : శాలరీని 50-30-20 రూల్‌తో ఎలా బ్రేక్ చేయాలి.. సేవింగ్స్ నుంచి ఖర్చులు దాకా ఇలా ప్లాన్ చేసుకోండి
Bank Deposit Insurance Coverage: రూ.5 లక్షలు దాటిన డిపాజిట్‌లకు కూడా బీమా కవరేజ్!, మీ డబ్బుకు మరింత భద్రత
Gold-Silver Prices Today 19 Feb: పసిడి పరుగును ఎవరైనా ఆపండయ్యా - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
ABP Network Ideas of India Summit 2025: ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ - ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
HYDRA Success: వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!