అన్వేషించండి

PAN Card Number: పాన్‌ కార్డ్‌ నంబర్‌ గుర్తు పెట్టుకోవడం చాలా సులభం, మీ మెమరీ పవర్‌ మారిపోద్ది

పాన్‌ నంబర్‌లో ఉండేది 'సున్నా'నా (0), ఆంగ్ల అక్షరం 'ఓ'నా (O) అన్నది ఎప్పుడూ కన్‌ఫ్యూజనే.

PAN Card Number: చాలా మందికి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది, తనకు ఉన్న బ్యాంకు ఖాతాల నంబర్లు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్‌ ఐడీలు, వాటి పాస్‌వర్డ్‌లు చాలా చక్కగా గుర్తు పెట్టుకుంటారు. 12 అంకెల ఆధార్‌ కార్డ్‌ కూడా ఎప్పుడూ బుర్రలో గిర్రున తిరుగుతూ ఉంటుంది. అంతే కాదు... తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మొబైల్ ఫోన్‌ నంబర్లు కూడా వాళ్ల నాలుక మీదే ఉంటాయి, ఫోన్‌ బుక్‌తో సంబంధం లేకుండా వాళ్ల నంబర్లు డయల్‌ చేయగలరు. ఇంత మెమరీ పవర్‌ ఉన్న కొంతమందికి, వాళ్ల పాన్‌ కార్డ్‌ (PAN Card) నంబర్‌ను గుర్తు పెట్టుకోవడంలో మాత్రం ప్రయాస పడుతుంటారు, తడబడుతుంటారు. 

ఆంగ్ల అక్షరాలు, అంకెలతో కలిపి పాన్‌కార్డ్‌లో 10 డిజిట్స్ మాత్రమే ఉన్నా, దానిని గుర్తు పెట్టుకోవడం వాళ్లకు ఒక రాకెట్‌ సైన్స్‌లా అనిపిస్తుంటుంది. కొంతమందికి గుర్తు ఉన్నా, టెన్షన్‌ పడితే మాత్రం మర్చిపోతారు. మరికొందరు అక్షరాలు, అంకెల్ని అటు ఇటు రాస్తుంటారు. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే... పాన్‌ నంబర్‌లో ఉండేది 'సున్నా'నా (0), ఆంగ్ల అక్షరం 'ఓ'నా (O) అన్నది ఎప్పుడూ కన్‌ఫ్యూజనే. 

ఇప్పుడు, మీ పాన్‌ నంబర్‌ గుర్తు పెట్టుకోవడానికి మీకు పెద్ద మెమరీ పవర్‌ అక్కర్లేదు. పాన్‌ నంబర్‌ వెనుక ఉన్న కథను అర్ధం చేసుకుంటే చాలు. ఇక మీ పాన్‌ నంబర్‌ను మీరు ఎప్పటికీ మరిచిపోరు.

పాన్‌ నంబర్‌ ఒక సీరియల్‌ నంబర్‌ కాదు
పాన్‌ కార్డు మీద అంకెలు, అక్షరాలతో కలిపి ఉండే 10 డిజిట్స్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ లేదా వెహికల్‌ నంబర్‌లా ఒక సీరియల్‌ నంబర్‌ కానే కాదు. ఆ నంబర్‌ మీకు మాత్రమే కేటాయించే ప్రత్యకమైన, నిర్దిష్టమైన విషయం. పన్ను చెల్లింపులకు సంబంధించి, మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలిపేలా పాన్‌ కార్డ్‌ నంబర్‌ను మీకు కేటాయిస్తారు. 

UTI లేదా NSDL ద్వారా, ఒక క్రమపద్ధతిలో పాన్‌ నంబర్‌ను ఆదాయ ప‌న్ను శాఖ కేటాయిస్తుంది. ఆ క్రమపద్ధతి ఏంటి అన్నది మీరు అర్ధం చేసుకోగలిగితే, పాన్‌ కార్డ్‌ నంబర్‌ మీ మెదడులో ముద్రించుకుపోతుంది. 

మీ పాన్‌ కార్డ్‌ నంబర్లను మీరు పరిశీలనగా చూశారా?, మొదటి ఐదు ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. ఆ త‌ర్వాత నాలుగు అంకెలు ఉంటాయి. చివ‌ర్లో మళ్లీ ఓ ఆంగ్ల అక్షరం ఉంటుంది. ఈ అక్షరాలు, అంకెల స్థానాలు మారవు. కాబట్టి, ఆంగ్ల అక్షరాల స్థానంలో వచ్చేది 'ఓ' (O), అంకెల స్థానంలో వచ్చేది 'సున్నా' (0) అని ఇక నుంచి సులభంగా అర్ధం చేసుకోవచ్చు. సో.. 'సున్నా', 'ఓ' విషయంలో క్లారిటీ వచ్చేసినట్లేగా. ఇక, మొత్తం నంబర్‌ను ఎలా గుర్తు పెట్టుకోవాలో చూద్దాం.

4, 5 అక్షరాలకు ప్రత్యేకత
మీ పాన్‌ నంబర్‌లో మొద‌టి మూడు అక్షరాలు AAA నుంచి ZZZ వరకు ఒక సిరీస్‌లో ఉంటాయి. అంటే, ఈ మీ పాన్‌ నంబర్‌లోని మొదటి మూడు ఆంగ్ల అక్షరాలు సీరియల్‌ ప్రకారం మీకు కేటాయించడం జరుగుతుంది. నాలుగో అక్షరానికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆదాయ ప‌న్ను చెల్లింపు దృష్ట్యా, మీ హోదా ఏంటి అన్నది ఆ అక్షరం తెలియజేస్తుంది. మీరు వ్యక్తిగత (Individual) ఆదాయ పన్ను చెల్లింపుదారు అయితే, నాలుగో అక్షరం తప్పనిసరిగా ‘P’ ఉంటుంది. 

ఐదో అక్షరానికి కూడా ప్రత్యేకత ఉంది. ఈ ఐదో అక్షరం మీ ఇంటి పేరులోని మొద‌టి అక్షరాన్ని సూచిస్తుంది. ఒకవేళ, ఒక పాన్‌ కార్డ్‌ ఒక వ్యక్తి కోసం కాకుండా ఏదైనా సంస్థ తరపున తీసుకుంటే, పాన్‌ కార్డు హోల్డర్‌ పేరులోని మొదటి అక్షరం పాన్‌ కార్డ్‌ నంబర్‌లోని ఐదో స్థానంలో ఉంటుంది. ఇక్కడితో తొలి ఐదు అంకెల మీద క్లారిటీ వచ్చేసినట్లేగా. ఇక, ఆ త‌ర్వాత నాలుగు అంకెలు 0001 నుంచి 9999 మధ్య  సిరీస్‌లో ఉంటాయి, సీరియల్‌ నంబర్‌ రూపంలో మీకు వస్తాయి. పాన్‌ నంబర్‌లో చివరిదైన 10వ డిజిట్‌ ఎప్పుడూ ఆంగ్ల అక్షరమే ఉంటుంది. కాబట్టి, ఈ 10వ అంకె స్థానంలో ఎప్పటికీ సున్నా (అంకె) ఉండదు. సున్నా రూపంలో ఉంటే, అది ఆంగ్ల అక్షరం 'ఓ' (O) అని గుర్తు పెట్టుకోవాలి. ఈ చిట్కాలను గుర్తుంచుకుంటే ఇక మీరు ఎప్పటికీ మీ మీ పాన్‌ నంబర్‌ను మరిచిపోరు.

టాప్ హెడ్ లైన్స్

Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్‌, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన
Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్‌, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
This Week Movies : శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
TVK MLA Arul Vignesh: మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం!
మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
Gaganayan Mission: గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
Embed widget