News
News
X

Indian Rupee: భవిష్యత్‌ గ్లోబల్‌ కరెన్సీగా 'రూపాయి' ఆవిర్భవిస్తుంది, ఇది తథ్యం!?

రూపాయిల్లో విదేశీ వాణిజ్యం చేపట్టడానికి, అంతర్జాతీయ కరెన్సీగా రూపాయిని నిలబెట్టడానికి భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో చురుగ్గా చర్యలు తీసుకుంటోంది.

FOLLOW US: 
Share:

Indian Rupee: ప్రస్తుతం, ప్రపంచ వాణిజ్యంలో అమెరికన్‌ డాలర్‌దే ఆధిపత్యం. వివిధ దేశాల మధ్య వాణిజ్యం, నగదు లావాదేవీలు, విదేశీ పెట్టుబడులు అన్నీ అమెరికన్‌ డాలర్ల రూపంలో వస్తుంటాయి, పోతుంటాయి. ఏ దేశమైనా, తన విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ఎక్కువగా పోగు చేసుకునేది అమెరికన్‌ డాలర్‌నే. దీని తర్వాతి స్థానం యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన యూరోది (Euro). యూరోపియన్ యూనియన్‌లోని 19 దేశాల్లో చట్టబద్ధమైన కరెన్సీ ఇది. ప్రపంచ వాణిజ్యాన్ని దాదాపుగా ఈ రెండు కరెన్సీలే లీడ్‌ చేస్తున్నాయి.

ప్రధాన వాణిజ్య కరెన్సీలు
అమెరికన్‌ డాలర్‌, యూరో కాక... మరికొన్ని ప్రధాన వాణిజ్య కరెన్సీలు (trading currencies) కూడా ఉన్నాయి. అవి..  జపనీస్ యెన్ (JPY), బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ (GBP), ఆస్ట్రేలియన్ డాలర్ (AUD), కెనడియన్ డాలర్ (CAD), స్విస్ ఫ్రాంక్ (CHF), చైనీస్ యువాన్ (CNY), స్వీడిష్ క్రోనా (SEK) , న్యూజిలాండ్ డాలర్ (NZD), మెక్సికన్ పెసో (MXN). వీటిలో వాణిజ్యం జరుగుతున్నా, అది చాలా తక్కువ స్థాయిలోనే ఉంటోంది. మన దేశ రూపాయినైతే దాదాపుగా ఏ దేశమూ పట్టించుకోవడం లేదు. దీనికి కారణం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చాలా బలహీనంగా ఉండడమే. బలమైన కరెన్సీకే ఏ దేశమైనా ప్రాధాన్యత ఇస్తుంది.

రూపాయిల్లో విదేశీ వాణిజ్యం చేపట్టడానికి, అంతర్జాతీయ కరెన్సీగా రూపాయిని నిలబెట్టడానికి భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. దీని కోసం వివిధ బ్యాంకుల ద్వారా ప్రత్యేక అకౌంట్లు ఓపెన్‌ చేయిస్తోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురుకు రూపాయిల్లో చెల్లిస్తోంది. మరికొన్ని దేశాలతోనూ రూపాయిల్లోనే వాణిజ్య వ్యవహారాలు నడిపిస్తోంది.

ఆశలు రేకెత్తించిన నోరియల్ రౌబినీ వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో, న్యూయార్క్ యూనివర్శిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నోరియల్ రౌబినీ చేసిన వ్యాఖ్యలు రూపాయి భవిష్యత్‌పై ఆశలు రేకెత్తిస్తున్నాయి. భవిష్యత్‌లో, భారతదేశ 'రూపాయి' ఒక గ్లోబల్‌ కరెన్సీగా ఆవిర్భవిస్తుందని రౌబినీ చెప్పారు. 

కాలక్రమేణా డి-డాలరైజేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తాను భావిస్తున్నట్లు నోరియల్ రౌబినీ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా వాటా 40% నుంచి 20%కి పడిపోయిందన్నారు. మొత్తం అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య లావాదేవీల్లో US డాలర్ వాటా మూడింట రెండు వంతులు ఉండటం సమంజసం కాదన్న విషయాన్ని ఈ క్షీణత నిరూపిస్తోందని చెప్పారు. అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధాన లక్ష్యాల US డాలర్‌ను ఆ దేశం ఆయుధంగా వాడుతోందని, ఇది US ప్రత్యర్థులను అసౌకర్యానికి గురి చేస్తుందన్నారు. మధ్యప్రాచ్యంలో (Middle East) లేదా ఆసియాలో ఉన్న US మిత్రదేశాల్లోనూ ఈ విధానం పట్ల విసుగు వ్యక్తమవుతోందని చెప్పారు.

ఈ పరిస్థితుల్లో, రూపాయిని ప్రపంచ ట్రేడింగ్‌ వేదికపైకి భారత్‌ వేగంగా తీసుకువస్తోందని రౌబినీ వివరించారు. భారతదేశం ఇతర దేశాలతో చేసే వాణిజ్యానికి, ముఖ్యంగా సౌత్‌ టు సౌత్‌ వాణిజ్యానికి (South-South trade) భారత రూపాయి ఒక ప్రధాన కరెన్సీగా మారుతుందని అన్నారు. భారత రూపాయిని యూనిట్‌గా తీసుకుని, ఓవర్‌సీస్‌ ట్రేడ్స్‌ నిర్వహిస్తారని చెప్పారు. ఇది చెల్లింపుల రూపంలోనూ ఉండవచ్చు, వాణిజ్య విలువను లెక్కించడానికీ ఉపయోగించవచ్చని అన్నారు. "ఖచ్చితంగా, కాలక్రమేణా, ప్రపంచంలోని గ్లోబల్ రిజర్వ్ కరెన్సీల్లో ఒకటిగా రూపాయి మారవచ్చు" అని నోరియల్ రౌబినీ స్పష్టం చేసారు.

Published at : 23 Feb 2023 12:07 PM (IST) Tags: Indian rupee Nouriel Roubini global currencies dallor

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.75వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.75వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

Stock Market News: ఆఖరి రోజు అదుర్స్‌! రిలయన్స్‌ అండతో 1031 పాయింట్లతో ఢంకా మోగించిన సెన్సెక్స్‌

Stock Market News: ఆఖరి రోజు అదుర్స్‌! రిలయన్స్‌ అండతో 1031 పాయింట్లతో ఢంకా మోగించిన సెన్సెక్స్‌

April Rules: ఏప్రిల్‌ నుంచి మారే 7 రూల్స్‌ ఇవి, జేబులోని పర్సు మీదే వీటి కన్ను

April Rules: ఏప్రిల్‌ నుంచి మారే 7 రూల్స్‌ ఇవి, జేబులోని పర్సు మీదే వీటి కన్ను

UPI Payments: UPI Payments: యూపీఐ వాడితే ఏప్రిల్‌ 1 నుంచి ఛార్జీ చెల్లించాలి, కాకపోతే?

UPI Payments: UPI Payments: యూపీఐ వాడితే ఏప్రిల్‌ 1 నుంచి ఛార్జీ చెల్లించాలి, కాకపోతే?

Stock Market News: రాకెట్లా దూసుకెళ్తున్న స్టాక్‌ మార్కెట్లు - సెన్సెక్స్‌ 550, నిఫ్టీ 160 పాయింట్లు అప్‌!

Stock Market News: రాకెట్లా దూసుకెళ్తున్న స్టాక్‌ మార్కెట్లు - సెన్సెక్స్‌ 550, నిఫ్టీ 160 పాయింట్లు అప్‌!

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి