Bank Holiday: బ్యాంకులకు ఇవాళ బక్రీద్ సెలవు, మీ పని రేపు పెట్టుకోండి
హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోని బ్యాంకుల గేట్లు ఇవాళ మూసేసి కనిపిస్తాయి.
Bakrid 2023 Holiday to Banks: ఇవాళ, ఈద్ ఉల్-అజా (బక్రీద్) పర్వదినం సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు, బ్యాంకులు పని చేయవు బుధవారం కూడా చాలా చోట్ల బ్యాంకులు మూసేశారు. ఇవాళ మీకు బ్యాంకులో ఏదైనా పని పెట్టుకుంటే, దానిని రేపటికి (శుక్రవారం) పోస్ట్‌పోన్ చేసుకోవాల్సిందే.
తెలుగు రాష్ట్రాలు సహా చాలా చోట్ల బ్యాంకులు బంద్
బక్రీద్ సందర్భంగా బుధవారం కొన్ని ఏరియాల్లో బ్యాంకులకు సెలవు ఇచ్చారు. బేలాపూర్, జమ్ము, కోచి, ముంబై, నాగ్‌పూర్, శ్రీనగర్, తిరువనంతపురంలో బ్యాంకులు పని చేయలేదు. కానీ, ఎక్కువ రాష్ట్రాల్లోని బ్యాంకులు మాత్రం ఇవాళ పబ్లిక్ హాలిడే తీసుకున్నాయి. వీటిలో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోని బ్యాంకుల గేట్లు ఇవాళ మూసేసి కనిపిస్తాయి. వీటితో పాటు.. న్యూదిల్లీ, శ్రీనగర్, చండీగఢ్, ఇంఫాల్, జైపూర్, అహ్మదాబాద్, అగర్తల, బెంగళూరు, ఐజ్వాల్, పనాజీ, పట్నా, చెన్నై, దెహ్రాదూన్, రాంచీ, జమ్మూ, కోల్‌కతా, లక్నో, షిల్లాంగ్, సిమ్లా, భోపాల్, గువాహటి, కాన్పూర్‌లోనూ బ్యాంకులకు ఇవాళే పబ్లిక్ హాలిడే.
2023 జులై నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 15 రోజులు సెలవులు ఉన్నాయి. రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులతో పాటు, పండుగలు, ఇతర కార్యక్రమాల వల్ల వచ్చే సెలవులు కూడా కలిసి 15 రోజులు పబ్లిక్ హాలిడేస్ వచ్చాయి. జులై 02న ఆదివారంతో మొదలై 31న షహీద్ ఉధమ్ సింగ్ అమరవీరుల దినోత్సవంతో హాలిడేస్ అయిపోతాయి. బ్యాంకు సెలవుల జాబితా ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి మారుతుంది. 2000 రూపాయల నోట్లు మార్చుకోవడానికి గానీ, మరో పని కోసం గానీ వచ్చే నెలలో బ్యాంక్‌కు వెళ్లాలని మీరు అనుకుంటుంటే, ఆ నెలలో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్‌ను కచ్చితంగా గుర్తుంచుకోండి. ఆ లిస్ట్‌కు తగ్గట్లుగా మీ పనిని ప్లాన్ చేసుకోవచ్చు.
2023 జులైలో బ్యాంకులకు సెలవు రోజులు:
జులై 02, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 05, 2023- గురు హరగోవింద్ జయంతి సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు
జులై 06, 2023- MHIP డే కారణంగా మిజోరంలో బ్యాంక్‌లకు సెలవు
జులై 08, 2023 - రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 09, 2023 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 13, 2023- భాను జయంతి సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు
జులై 13, 2023- బోనాలు సందర్భంగా తెలంగాణలో బ్యాంకులకు సెలవు
జులై 13, 2023- అమరవీరుల దినోత్సవం సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు
జులై 16, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 17, 2023- యు టిరోట్ సింగ్ డే సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు
జులై 22, 2023 - నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 23, 2023 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 29, 2023- మొహర్రం సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
జులై 30, 2023 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 31, 2023- షహీద్ ఉధమ్ సింగ్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా హరియాణాలో బ్యాంకులకు సెలవు
బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్ అండర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్'. ఏ బ్యాంక్ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా/డిపాజిట్ చేయాల్సివస్తే ATMను ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా UPIని ఉపయోగించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఒక్క ఏడాదిలో 350 కోట్ల లీటర్ల కిక్కు, ఎక్కువ ఎంజాయ్ చేసిన రాష్ట్రాలివి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial