search
×

Stock Market update: బేర్స్‌తో కొట్లాటలో బుల్స్‌దే గెలుపు! సెన్సెక్స్‌కు 436 పాయింట్ల లాభం

Stock Market Closing Bell on 2 June 2022: స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,638, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 436 పాయింట్ల లాభంతో 55,818 వద్ద ముగిశాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell on 2 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ఓపెనైన సూచీలు మధ్యాహ్నం వరకు రేంజ్‌బౌండ్‌లోనే కదలాడాయి. ఐరోపా మార్కెట్లు తెరవగానే మదుపర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. దాంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,638, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 436 పాయింట్ల లాభంతో 55,818 వద్ద ముగిశాయి. ఐటీ షేర్లకు విపరీతంగా డిమాండ్‌ కనిపించింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది.

BSE Sensex

క్రితం సెషన్లో 55,381 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,382 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. 55,135 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,891 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 436 పాయింట్ల లాభంతో 55,818 వద్ద ముగిసింది. ఫ్లాట్‌గా ఓపెనింగ్‌ సూచీ ఐరోపా మార్కెట్లు తెరిచాక రివ్వున ఎగిసింది. మదుపర్లు విపరీతంగా కొనుగోళ్లు చేపట్టారు.

NSE Nifty

బుధవారం 16,522 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,481 వద్ద ఓపెనైంది. 16,443 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,646 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 116 పాయింట్ల లాభంతో 16,638 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ విచిత్రంగా స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఉదయం 35,470 వద్ద మొదలైంది. 35,385 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,676 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 7 పాయింట్లు నష్టపోయి 35,613 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. రిలయన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌ఫార్మా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్‌, హీరో మోటోకార్ప్‌, ఐచర్‌ మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌ గ్రిడ్‌ నష్టపోయాయి. బ్యాంక్‌, ఫైనాన్షియల్‌, ఆటో సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. ఐటీ, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు భారీగా ఎగిశాయి.

Published at : 02 Jun 2022 03:56 PM (IST) Tags: sensex today bse sensex Stock Market Update share market Nse Nifty stock market today Stock Market Telugu Nifty Bank Stock Market news sensex updates sensex today live nifty 50 nifty fifty

ఇవి కూడా చూడండి

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్‌ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి

Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్‌ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి

SIP Investment Mistakes: SIPలో లక్షల నష్టానికి కారణమయ్యే 7 అతిపెద్ద తప్పులు! 

SIP Investment Mistakes: SIPలో లక్షల నష్టానికి కారణమయ్యే 7 అతిపెద్ద తప్పులు! 

టాప్ స్టోరీస్

Kokapet land auction: కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం

Kokapet land auction: కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం

Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు

Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు

Pawan Kalyan: నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే !

Pawan Kalyan: నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే  !

India vs South Africa: గువాహటి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌పై కరుణ్ నాయర్ సెటైర్లు? నవ్వు ఆపుకోలేకపోయిన అశ్విన్!

India vs South Africa: గువాహటి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌పై కరుణ్ నాయర్ సెటైర్లు? నవ్వు ఆపుకోలేకపోయిన అశ్విన్!