search
×

Stock Market: ఊగిసలాడిన సూచీలు - రూపాయి 18 పైసలు జంప్‌!

Stock Market Closing 28 March 2023: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. ఆద్యంతం ఊగిసలాడాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 28 March 2023: 

స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. ఆద్యంతం ఊగిసలాడాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 34 పాయింట్లు తగ్గి 16,951 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 40 పాయింట్లు తగ్గి 57,613 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు పెరిగి రూ.82.19 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 57,653 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,751 వద్ద మొదలైంది. 57,494 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 57,949 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 40 పాయింట్ల నష్టంతో 57,613 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

సోమవారం 16,985 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  మంగళవారం 17,031 వద్ద ఓపెనైంది. 16,913 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,061 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 34 పాయింట్లు తగ్గి 16,951 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 39,545 వద్ద మొదలైంది. 39,326 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,645 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 136 పాయింట్లు పెరిగి 39,563 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 17 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ఉన్నాయి. యూపీఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా, హీరో మోటో కార్ప్‌, టాటా మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్‌ సూచీలు పుంజుకున్నాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.240 తగ్గి రూ.59,450 గా ఉంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.73,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.20 తగ్గి రూ.25,720 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 28 Mar 2023 03:47 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

సంబంధిత కథనాలు

Stock Market News: 18,600 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 223 పాయింట్లు ఫాల్‌, పెరిగిన రూపాయి

Stock Market News: 18,600 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 223 పాయింట్లు ఫాల్‌, పెరిగిన రూపాయి

Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్‌ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!

Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్‌ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!

Stock Market News: ఫ్లాట్‌.. ఫ్లాట్‌.. ఫ్లాట్‌! స్వల్ప నష్టాల్లో మొదలైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market News: ఫ్లాట్‌.. ఫ్లాట్‌.. ఫ్లాట్‌! స్వల్ప నష్టాల్లో మొదలైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market News: స్టాక్‌ మార్కెట్లో జజ్జనక! 18,700 పైన నిఫ్టీ, 63,142 వద్ద సెన్సెక్స్‌ క్లోజింగ్‌!

Stock Market News: స్టాక్‌ మార్కెట్లో జజ్జనక! 18,700 పైన నిఫ్టీ, 63,142 వద్ద సెన్సెక్స్‌ క్లోజింగ్‌!

Stock Market News: టర్న్‌ అరౌండ్‌ అయిన సెన్సెక్స్‌, నిఫ్టీ - ఎరుపెక్కిన ఐటీ ఇండెక్స్‌!

Stock Market News: టర్న్‌ అరౌండ్‌ అయిన సెన్సెక్స్‌, నిఫ్టీ - ఎరుపెక్కిన ఐటీ ఇండెక్స్‌!

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్