LPG Cylinder Price Cut: ఎల్పీజీ సిలిండర్ల ధరలు భారీగా తగ్గింపు.. సెప్టెంబర్ 1నుంచి అమల్లోకి
Domestic LPG cylinder Price | ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గించాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ ధర అమల్లోకి రానుంది.

Commercial LPG cylinder reduced | న్యూఢిల్లీ: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలపై శుభవార్త అందించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.51.50 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మార్పు రేపటి (సెప్టెంబర్ 1వ తేదీ) నుంచి అమల్లోకి రానుందని ఓ ప్రకటనలో తెలిపాయి. ఢిల్లీలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1580కి దిగొచ్చింది. అయితే, 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ల ధర (Domestic LPG Price)లో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. దాంతో డొమోస్టిక్ సిలిండర్ వినియోగదారులు మరోసారి నిరాశకు లోనయ్యారు.
హైదరాబాద్‌లో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.905 వద్ద స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1800.5కి దిగొచ్చింది. డొమెస్టిక్ 5 కేజీల సిలిండర్ ధర రూ.335.50గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.853 వద్ద స్థిరంగా ఉండగా, ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1580 అయింది. డొమెస్టిక్ 5 కేజీల సిలిండర్ ధర రూ.317.50గా ఉంది.
Oil marketing companies have revised the prices of commercial LPG gas cylinders. The rate of 19 kg commercial LPG gas cylinders has been reduced by Rs 51.50, effective from tomorrow. In Delhi, the retail sale price of a 19 kg commercial LPG cylinder will be Rs 1580 from September…
— ANI (@ANI) August 31, 2025
ఏపీలోని విశాఖపట్నంలో 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.861 కాగా, 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1632 అయింది. డొమెస్టిక్ 5 కేజీల సిలిండర్ ధర రూ.320.5గా ఉంది.
ఏపీలోని విజయవాడలో 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.877.50 వద్ద ఉండగా, 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1737కి దిగొచ్చింది. డొమెస్టిక్ 5 కేజీల సిలిండర్ ధర రూ.326గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.868.50 వద్ద స్థిరంగా ఉండగా, చెన్నైలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1737.50 అయింది. డొమెస్టిక్ 5 కేజీల సిలిండర్ ధర రూ.323గా ఉంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో సెప్టెంబర్ 1 నుంచి 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.855.50 వద్ద ఉండగా, 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1652.5కి దిగొచ్చింది. డొమెస్టిక్ 5 కేజీల సిలిండర్ ధర రూ.318.50గా ఉంది.






















