అన్వేషించండి

Karur Vysya Bank: కరూర్ వైశ్యా బ్యాంక్ రికార్డు స్థాయి లాభాలు - 2024-25 ఆర్థిక ఫలితాలు ప్రకటన

Bank Results: కరూర్ వైశ్యా బ్యాంక్ తమ ఆర్థిక ఫలితాలనుప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం , లాభాలను భారీగా పెంచుకున్నారు.

Karur Vysya Bank Financial Results:  మార్చి 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రముఖ బ్యాంక్ కరూర్ వైశ్యా బ్యాంక్ ్ద్భఉతమైన పనితీరుకనబరిచింది. త్రైమాసికం/సంవత్సరానికి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 31.3.2025 తో ముగిసిన సంవత్సరానికి బ్యాంక్ ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా రూ. 1,942 కోట్ల లాభాలను ఆర్జించింది . నాల్గవ త్రైమాసికంలో అత్యధికంగా రూ. 513 కోట్ల లాభాలను ఆర్జించింది. వృద్ధి, లాభదాయకత , బలమైన ఆస్తులు అనే ప్రాతిపదికన  బ్యాంక్  బలమైన పనితీరును కొనసాగిస్తోందని బ్యాంక్ ఎండీ, సీఈవో రమేష్ బాబు తెలిపారు. 

ఈ సంవత్సరం అడ్వాన్సులతో పాటు అప్పుల వ్యాపారం కూడా   14% పెరిగాయి. ఏడాది పొడవునా  రిటైల్, వ్యవసాయం , MSME రంగాలలో  లో 20% వృద్ధిని నమోదు చేస్తూ మేము బలమైన వృద్ధి పథాన్ని కరూర్ వైశ్యా బ్యాంక్ కొనసాగించారు. ఈ సంవత్సరం 4వ త్రైమాసికంలో మా మొత్తం వ్యాపారం ₹ 1,86,569 కోట్లు దాటింది, డిపాజిట్లు 1 ట్రిలియన్ దాటాయి. మొత్తం వ్యాపారం నా  14.08%  పెరిగింది.  డిపాజిట్ 14.55%  పెరిగాయి. లోన్ బుక్  13.53%  పెరిగింది.  రీటైల్, వ్యవసాయం , MSME  టైర్ రుణాలకు  19.79% శాతం ఎక్కువగా కేటాయించారు. 

 
మార్చి 31, 2025 నాటికి బ్యాలెన్స్ షీట్  రూ.1,19,367 కోట్లుగా ఉంది. అంతకు ముందు మార్చి 31, 2024 నాటికి  రూ 105,453 కోట్లు మాత్రమే. అంటే 13.19% వృద్ధి నమోదు అయింది. మార్చి 31, 2025 నాటికి మొత్తం వ్యాపారం రూ. 1,86,569 కోట్లు, ఇది వార్షిక వృద్ధి 14.08% నమోదు చేసింది. 31.03.2024 నాటితో పోలిస్తే రూ. 23,032 కోట్లు పెరిగింది. 2025 మార్చి 31 నాటికి మొత్తం డిపాజిట్లు రూ. లక్ష కోట్లు దాటి  రూ. 1,02,078 కోట్లకు చేరుకున్నాయి.  ఇది వార్షిక వృద్ధిని 14.55% అంటే రూ.12,965 కోట్లు పెరిగింది, ఇది 31.03.2024 నాటికి రూ. 89,113 కోట్ల నుండి.

మార్చి 31, 2025 నాటికి మొత్తం అడ్వాన్సులు  రూ. 84,491 కోట్లు, సంవత్సరం వృద్ధిని 13.52% అంటే రూ. 10,068 కోట్లు పెరిగింది  సంవత్సరానికి నికర లాభం 20.99% బలమైన వృద్ధిని నమోదు చేసి  రూ. 1,942 కోట్లుగా తేలింది.  ఇది గత సంవత్సరం ఇదే కాలంలో ₹ 1,605 కోట్లుగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరానికి PPOP 19.81% పెరిగి రూ. 3,212 కోట్లకు చేరుకుంది, ఇది గత సంవత్సరం ఇదే కాలంలో రూ. 2,681 కోట్లు   ఉంది. నికర వడ్డీ ఆదాయం 11.57% పెరిగి రూ. 4,260 కోట్లకు చేరుకుంది, గత సంవత్సరం ఇదే కాలంలో ₹ 3,818 కోట్లు ఉంది. 
నికర వడ్డీ మార్జిన్ 4.09%గా ఉంది, ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 4.20%గా ఉంది.

డిపాజిట్ల ఖర్చు 42 బేసిస్ పాయింట్లు పెరిగి 5.61%గా ఉంది, ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 5.19%గా ఉంది. అడ్వాన్సులపై దిగుబడి 10.15% పెరిగి 20 బేసిస్ పాయింట్లు పెరిగింది, ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 9.95%గా ఉంది. కమీషన్ ,  ఫీజు ఆధారిత ఆదాయం సంవత్సరం వారీ ప్రాతిపదికన 12.33% మెరుగుపడి రూ. 965 కోట్లకు చేరుకుంది.

2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్వహణ ఖర్చులు రూ. 2,877 కోట్లు, గత సంవత్సరం ఇదే కాలంలో ₹ 2,639 కోట్లు. ఆదాయానికి ఖర్చు నిష్పత్తి 2024 ఆర్థిక సంవత్సరానికి 48.26% నుండి 2025 ఆర్థిక సంవత్సరానికి 47.25%గా ఉంది. ఆర్థిక పనితీరు – Q4 FY 2025 vs. Q4 FY 2024:
ఈ త్రైమాసికంలో నికర లాభం 12.50% వృద్ధిని నమోదు చేసి రూ. 513 కోట్లకు చేరుకుంది, ఇది గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 456 కోట్లుగా ఉంది.

గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో  రూ. 710 కోట్లతో పోలిస్తే (రూ.157 కోట్ల SR-NPI యొక్క వన్-ఆఫ్ అంశం మినహా) ఈ త్రైమాసికంలో PPOP 17.60% పెరిగి రూ. 835 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ₹ 998 కోట్లతో పోలిస్తే నికర వడ్డీ ఆదాయం 9.11% పెరిగి ₹ 1,089 కోట్లకు చేరుకుందని బ్యాంక్ తెలిపిదంి. 

గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ 4.05%గా ఉంది, ఇది గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 4.20%గా ఉంది. డిపాజిట్ల ఖర్చు 38 బేసిస్ పాయింట్లు పెరిగి 5.74% వద్ద ఉంది, గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 5.36% ఉంది. అడ్వాన్సులపై దిగుబడి 11 బేసిస్ పాయింట్లు పెరిగి 10.21%కి చేరుకుంది, గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 10.10%. కమీషన్ మరియు ఫీజు ఆధారిత ఆదాయం Q-o-Q ప్రాతిపదికన 10.20% పెరిగి రూ. 270 కోట్లకు చేరుకుంది, గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ. 245 కోట్లు.

గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో నిర్వహణ ఖర్చులు రూ. 764 కోట్లు, గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ. 757 కోట్లు.. ఆదాయ వ్యయ నిష్పత్తి 47.77% (గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 51.62%) వద్ద ఉంది.

మూలధన సమృద్ధి:
బాసెల్ III మార్గదర్శకాల ప్రకారం మూలధన సమృద్ధి నిష్పత్తి (CRAR) మార్చి 31, 2025 నాటికి 18.17% (మార్చి 31, 2024 నాటికి 16.67%) వద్ద ఉంది. ఇది నియంత్రణా అవసరం 11.50%. టైర్ 1 మార్చి 31, 2025 నాటికి 17.12% వద్ద ఉంది, మార్చి 31, 2024 నాటికి 15.46% వద్ద ఉంది. రిస్క్-వెయిటెడ్ ఆస్తులు మార్చి 31, 2025 నాటికి రూ. 66,261 కోట్లు (మార్చి 31, 2024 నాటికి రూ. 61,125 కోట్లు) ఉన్నాయి.

ఆస్తి నాణ్యత:
స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) 64 బేసిస్ పాయింట్లు మెరుగుపడి మార్చి 31, 2025 నాటికి స్థూల అడ్వాన్సులలో 0.76% (రూ. 642 కోట్లు) వద్ద ఉంది, ఇది మార్చి 31, 2024 నాటికి 1.40% (రూ. 1,042 కోట్లు) వద్ద ఉంది.

నికర నిరర్థక ఆస్తులు (NNPA) 1% కంటే తక్కువగా ఉంది మరియు మార్చి 31, 2025 నాటికి నికర అడ్వాన్సులలో 0.20% (రూ. 166 కోట్లు) వద్ద ఉంది, మార్చి 31, 2024 నాటికి 0.40% (రూ. 298 కోట్లు) వద్ద ఉంది.
ప్రొవిజన్ కవరేజ్ రేషియో (PCR) మార్చి 31, 2025 నాటికి 96.81% వద్ద ఉంది, ఇది మార్చి 31, 2024 నాటికి 94.85% వద్ద ఉంది.

నెట్‌వర్క్:

మార్చి 31, 2025 నాటికి కరూర్ వైశ్యా బ్యాంక్ భారీగా విస్తరించింది.  బ్యాంక్ పంపిణీ నెట్‌వర్క్ 888 శాఖలు ,  1 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ గా నమోదు అయింది. అలాగే  2,252 ATMలు / క్యాష్ రీసైక్లర్‌లు ఉన్నాయి. మార్చి 31, 2024 నాటికి 838 శాఖలు మరియు 2,262 ATMలు / క్యాష్ రీసైక్లర్‌లుగా ఉన్నాయి.  ఒక్క ఏడాదిలో యాభై బ్రాంచ్‌లను ప్రారంభించారు. మా శాఖలలో 55% సెమీ-అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. అదనంగా, మాకు 352 మంది వ్యాపార కరస్పాండెంట్లు ఉన్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

Reliance Foundation Outreach: రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక సేవలు - జియో ఉచిత ఏఐ కోర్సుతో డిజిటల్ విప్లవం!
రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక సేవలు - జియో ఉచిత ఏఐ కోర్సుతో డిజిటల్ విప్లవం!
Reliance Industries 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Embed widget