అన్వేషించండి

Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు

జియో ప్లాట్‌ఫార్మ్స్ సంస్థ రూ.30,213 కోట్ల IPO సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన భారీ డిమాండ్‌తో కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. ఈ నిధులలో అధిక భాగాన్ని పాత రుణాలకు చెల్లించనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జియో ఐపీఓ రెండు గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్, చరిత్ర సృష్టించింది.
  • సంస్థాగత ఇన్వెస్టర్లు 3.25 రెట్లు బిడ్లు, నిధులు రుణ తగ్గింపుకు.
  • కొత్త షేర్లతో రూ.30,213 కోట్లు సేకరించగా, జీఎంపీ 24 శాతం.

Jio Platforms IPO | జియో ప్లాట్‌ఫార్మ్స్ సంస్థ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) బుధవారం (అక్టోబర్ 21న) బిడ్డింగ్ ప్రారంభమైన తొలి 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. భారతదేశంలో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద ఐపీఓలలో ఇంత వేగంగా పూర్తిగా సబ్‌స్క్రిప్షన్ సాధించిన ఐపీఓగా నిలిచింది. బిడ్డింగ్ ప్రారంభమైన సుమారు 100 నిమిషాల్లోనే, ఉదయం 10:45 గంటల నాటికే ఆఫర్‌లో ఉన్న షేర్లలో 101 శాతం షేర్లకు బిడ్లు వచ్చాయి. సంస్థాగత కొనుగోలుదారులు (QIBs) ఈ డిమాండ్‌లో కీలకంగా వ్యవహరించారు. వీరికి కేటాయించిన వాటాకు ఏకంగా 3.25 రెట్ల బిడ్లు నమోదయ్యాయి.

భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓ జియా ప్లాట్‌ఫారమ్స్‌కు చెందినది. ఇది పూర్తిగా కొత్త షేర్ల జారీ రూపంలోనే మార్కెట్లోకి వచ్చింది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ (OFS) కాంపోనెంట్ అనేది ఏదీ లేదు. సేకరించిన నిధులలో అధిక భాగాన్ని ప్రస్తుతం ఉన్న లోన్స్ తగ్గించుకోవడానికి వినియోగించాలని కంపెనీ భావిస్తోంది.

ప్రారంభంలో సంస్థాగత ఇన్వెస్టర్ల జోరు

ఐపీఓ ప్రారంభమైన మొదటి 30 నిమిషాల్లోనే QIB విభాగానికి సంబంధించిన కేటాయింపు పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. ఉదయం 10:45 గంటల నాటికి, సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లకు 3.25 రెట్ల డిమాండ్ వచ్చింది. అదే సమయానికి ఇతర కేటగిరీల ఇన్వెస్టర్ల భాగస్వామ్యం కొంత తక్కువగా ఉంది. నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల వాటా 27 శాతం సబ్‌స్క్రైబ్ కాగా, రిటైల్ ఇన్వెస్టర్లు తమకు కేటాయించిన షేర్లలో ఆ సమయానికి 24 శాతం వరకు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.

ఉద్యోగుల కోటాకి 59 శాతం బిడ్లు రాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నత వాటాదారుల కోసం కేటాయించిన విభాగంలో 45 శాతం సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. ఉదయం 10:45 గంటల సమయానికి ఉన్న డిమాండ్‌ను ఈ లెక్కలు ప్రతిబింబిస్తాయి. బిడ్డింగ్ కొనసాగుతున్న కొద్దీ ఇవి మారుతుంటాయి. 

లోన్స్ తగ్గింపుకే ఐపీఓ నిధులలో అధిక భాగం

జియో ప్లాట్‌ఫార్మ్స్ కొత్త ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.30,213 కోట్లను సేకరిస్తోంది. OFS కాంపోనెంట్ లేని కారణంగా, ఈ నిధులన్నీ ప్రస్తుతం ఉన్న వాటాదారులకు కాకుండా నేరుగా కంపెనీకే చెందుతాయి. ఆ నిధులలో మెజారిటీ భాగాన్ని లోన్స్ తీర్చడానికి ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ నిధుల కేటాయింపు వల్ల కంపెనీ లోన్స్ తగ్గడం, ఇన్వెస్టర్లకు ఒక కీలకమైన అంశంగా మారింది. ప్రారంభంలోనే సంస్థాగత ఇన్వెస్టర్ల ప్రాధాన్యత కంపెనీ పబ్లిక్ మార్కెట్ అరంగేట్రంపై అందరి దృష్టిని ఆకర్షించాయి. 

 24 శాతం దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం (GMP)

ఈ నివేదిక సమయానికి జియో ప్లాట్‌ఫార్మ్స్ గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) రూ. 268 వద్ద ఉంది. ఐపీఓ ధర Price Band ఒక్కో షేరుకు రూ.1,065 నుంచి రూ.1,119 వరకు నిర్ణయించగా, గరిష్ట ధరపై ఇది దాదాపు 24 శాతం ప్రీమియంను సూచిస్తుంది. GMP అనేది అనధికారిక మార్కెట్ సూచిక. ఇది ఖచ్చితమైన లిస్టింగ్ ధరకు ఏ గ్యారెంటీ ఇవ్వదు. మార్కెట్ పరిస్థితులు, ఇన్వెస్టర్ల డిమాండ్‌ను బట్టి లిస్టింగ్ ధర మారవచ్చు.

ఇతర ఐపీఓలను వెనక్కి నెట్టిన జియో ప్లాట్‌ఫార్మ్స్

నివేదికల ప్రకారం.. ఇతర ప్రధాన పబ్లిక్ ఇష్యూల కంటే జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ అత్యంత వేగంగా పూర్తి సబ్‌స్క్రిప్షన్ సాధించింది. గతంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.6,560 కోట్ల ఐపీఓ తొలిరోజు మధ్యాహ్నం 2 గంటలకి పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. దేశంలో అత్యధిక బిడ్లు పొందిన ఐపీఓగా నిలిచిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఐపీఓ తొలిరోజు ముగిసే సమయానికి పూర్తిగా సబ్‌స్క్రిప్షన్ సాధించింది. కానీ కానీ జియో ప్లాట్‌ఫార్మ్స్ సుమారు 2 గంటల్లోనే ఈ మార్కు చేరి కొత్త రికార్డులు నమోదు చేసింది.చివరి సబ్‌స్క్రిప్షన్ వివరాలు, తదనంతర లిస్టింగ్ పనితీరు ఇన్వెస్టర్ల ఆసక్తిని మరింత స్పష్టంగా వెల్లడిస్తాయి.

Frequently Asked Questions

జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ ఎంత వేగంగా పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యింది?

బిడ్డింగ్ ప్రారంభమైన తొలి 2 గంటల్లోనే జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యింది. భారతదేశంలో ఇంత వేగంగా సబ్‌స్క్రిప్షన్ సాధించిన అతిపెద్ద ఐపీఓ ఇదే.

జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ నిధులను దేనికి వినియోగించనుంది?

సేకరించిన నిధులలో అధిక భాగాన్ని ప్రస్తుతం ఉన్న అప్పులను తగ్గించుకోవడానికి జియో ప్లాట్‌ఫార్మ్స్ వినియోగించాలని భావిస్తోంది. ఇది కంపెనీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది.

జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ (OFS) భాగం ఉందా?

లేదు, జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ పూర్తిగా కొత్త షేర్ల జారీ రూపంలోనే మార్కెట్లోకి వచ్చింది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ (OFS) కాంపోనెంట్ అనేది ఏదీ లేదు.

అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులు (QIBs) నుండి ఎంత డిమాండ్ వచ్చింది?

ఐపీఓ ప్రారంభమైన మొదటి 10:45 గంటల నాటికే, QIBలకు కేటాయించిన వాటాకు ఏకంగా 3.25 రెట్ల బిడ్లు నమోదయ్యాయి. ఈ డిమాండ్‌లో QIBలు కీలకంగా వ్యవహరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jio Platforms IPO: లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Jio Platforms IPO: 5జీ, బ్రాడ్‌బ్యాండ్, ఏఐ పునాదులపై భారత్ తదుపరి డిజిటల్ శతాబ్దానికి బాటలు!
JPL IPO: 5జీ, బ్రాడ్‌బ్యాండ్, ఏఐ టెక్నాలజీతో భారత్ తదుపరి డిజిటల్ శతాబ్దానికి బాటలు!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Gold Smuggling: విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
CM Chandrababu: రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
Vizianagaram Municipal Corporation Election: విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీలో మార్పు.. కలెక్టర్ లేఖతో ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం
విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీలో మార్పు.. కలెక్టర్ లేఖతో ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Graduate MLC Election: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
Andhra Pradesh Odisha Border Dispute: ఒడిశాలో ఆంధ్రా గో బ్యాక్ నినాదం - కోటియా సరిహద్దు రచ్చ వెనుక అసలు నిజాలు ఇవే!
ఒడిశాలో ఆంధ్రా గో బ్యాక్ నినాదం - కోటియా సరిహద్దు రచ్చ వెనుక అసలు నిజాలు ఇవే!
YS Jagan In Pulivendula: ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
Embed widget