By: ABP Desam | Updated at : 08 May 2022 04:55 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎల్ఐసీ ఐపీవో
LIC IPO GMP To Subscription Status: ఆదివారం, సెలవు రోజు, మార్కెట్లు బంద్! అయినా ఎల్‌ఐసీ ఐపీవో (LIC IPO)కు స్పందన తగ్గట్లేదు. దేశంలోనే అతిపెద్ద ఇష్యూపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపుగా అన్ని విభాగాల్లోనూ సబ్‌స్క్రిప్షన్ పూర్తైంది. ఇప్పటి వరకు 1.66 రెట్లు స్పందన లభించిందని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వం 16.2 కోట్ల షేర్లను మాత్రమే ఆఫర్ చేస్తుండగా 26.83 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. ఈ మొత్తం ఇష్యూ ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్ల వరకు సేకరిస్తున్న సంగతి తెలిసిందే.
LIC IPO GMP అప్‌డేట్
ప్రస్తుతం ఎల్‌ఐసీ గ్రే మార్కెట్ ప్రీమియం (LIC IPO GMP) ఒక్కో షేరుకు రూ.50గా ఉంది. నిజానికి గత రెండు రోజుల్లో జీఎంపీ ధర 50 శాతం తగ్గిపోయింది. మార్కెట్లలో హెవీ సెల్‌ఆఫ్ ఉండటమే ఇందుకు కారణం. తాజా అంచనాల ప్రకారం ఎల్ఐసీ షేరు రూ.1009 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే అప్పర్ బ్యాండ్ ధర రూ.949 కన్నా 6 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
1.66 రెట్లు స్పందన
ఐపీవో ఆరంభమైన ఐదో రోజుకు ఎల్‌ఐసీని 1.66 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. పాలసీ హోల్డర్ల కోటాకు 4.67 రెట్లు, ఉద్యోగుల కోటాకు 3.57 రెట్లు స్పందన వచ్చింది. రిటైల్ ఇన్వెస్టర్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోటాకూ పూర్తి స్థాయిలో సబ్‌స్క్రిప్షన్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటాలో మాత్రం ఇంకా 30 శాతం సబ్‌స్క్రైబ్ కాలేదని తెలిసింది.
ఎల్ఐసీ వివరాలు
LICలో 3.5 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.21,000 కోట్లతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. మే 4న మొదలయ్యే ఇష్యూ 9న ముగుస్తుంది. భారత్ స్టాక్‌మార్కెట్లలో అతిపెద్ద ఇష్యూ ఇదే కావడం గమనార్హం. ఐపీవోకు దరఖాస్తు చేసేవారు కొన్ని కీలక వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.
సబ్‌స్క్రిప్షన్ తేదీ: ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ 2022, మే4, బుధవారం మొదలవుతుంది. మే 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రైస్ బ్యాండ్ : ఎల్‌ఐసీ షేర్ల ధర రూ.902 - 949గా నిర్ణయించారు. ఒక్కో షేరు ఫేస్ వాల్యూ రూ.10గా ఉండనుంది. పాలసీ హోల్డర్లకు రూ.60, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
ఆఫర్ వివరాలు: అప్పర్ బ్యాండ్ ధరకు ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు సమీకరించనుంది. ఇది మొత్తంగా ఆఫర్ ఫర్ సేల్ ఐపీవో. 221,374,920 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తం ఆఫర్లో 50 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లు, మిగిలిన 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు.
ఎన్ని లాట్లు ఇస్తారు: ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు బిడ్ దాఖలు చేయొచ్చు. ఒక లాట్‌లో 15 షేర్లు ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు 14 లాట్లు అంటే 210 షేర్లకు బిడ్ వేయొచ్చు. మొత్తం రూ.1,99,290 అవుతుంది. రిటైల్ ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఎల్‌ఐసీ పాలసీదారులు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Delhivery Listing Price: డెల్హీవరీ లిస్టింగ్ ప్రీమియం తక్కువే! ముగింపులో రూ.49 లాభం
eMudhra IPO: ఈ-ముద్రా ఐపీవోకు తొలిరోజు 47% స్పందన, రిటైల్ కోటాలో 90% బుక్!
IPOs this Week: ఐపీవో పండగ! ఈ వారం ఇష్యూకు వస్తున్న 3 కంపెనీలు
LIC IPO: 14 ఏళ్ల రిలయన్స్ రికార్డు బ్రేక్ చేసిన ఎల్ఐసీ ఐపీవో! ఇష్యూ ధర రూ.949గా నిర్ణయం!
LIC IPO GMP Status: ఎల్ఐసీ షేర్లు కొంటున్నారా? బీ అలర్ట్! GMP భారీగా పడిపోయిందట!
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి