అన్వేషించండి

Investment Plans for Childldren: పిల్లల భవిష్యత్‌ కోసం బెస్ట్‌ ప్లాన్స్‌ ఇవి, ఇకపై డబ్బుకి ఇబ్బంది ఉండదు

దీర్ఘకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద కొన్ని బ్యాంకులు 8% వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

Investment Plans for Childldren: పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం భారీ స్థాయిలో డబ్బు అవసరం. పిల్లల సురక్షితమైన భవిష్యత్తు కోసం, వారి పసితనం నుంచే దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రారంభించాలి. అప్పుడే, అవసరమైన సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. పిల్లల భవిష్యత్‌ లక్ష్యాల ఆధారంగా పెట్టుబడిని నిర్ణయించుకోవాలి. ఇందుకోసం, మన దేశంలో అందుబాటులో ఉన్న ఉత్తమ పెట్టుబడి ఎంపికలు ఇవి:

ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్
నిర్దేశిత కాలానికి కొంతమొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం ఒక మంచి పెట్టుబడి ప్రణాళిక. 7 రోజులు మొదలుకుని 10 సంవత్సరాల వరకు వివిధ కాల పరిమితుల ఆప్షన్లు ఈ స్కీమ్స్‌లో ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం 10 సంవత్సరాల సుదీర్ఘ కాల FD చేయవచ్చు. దీర్ఘకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద కొన్ని బ్యాంకులు 8% వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
మీ చిన్నారుల కోసం ఉత్తమమైన దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి. మీ జూనియర్స్‌ కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఇందులో మీకు 7.1 శాతం రాబడి లభిస్తుంది. ఈ స్కీమ్‌లో 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో పెట్టుబడి పెడితే, ఆదాయపు పన్ను సెక్షన్ 80-సి కింద మీకు ఆదాయపన్ను మినహాయింపు ప్రయోజనం కూడా దక్కుతుంది.

మ్యూచువల్ ఫండ్స్
మీరు కొద్దిగా రిస్క్‌ తీసుకోగలిగితే మ్యూచువల్‌ ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రారంభించవచ్చు.  ఇది స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి కాబట్టి రిస్క్‌, రివార్డ్‌ రెండూ ఉంటాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ చాలా పథకాలను అందిస్తున్నాయి. వీటిలో ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయవచ్చు, ప్రతినెలా కొంత మొత్తాన్ని (SIP) పెట్టుబడిగా జమ చేస్తూ వెళ్లవచ్చు. దీనివల్ల దీర్ఘకాలంలో మంచి మొత్తాన్ని సృష్టించవచ్చు. SIP మార్గంలో ప్రతి నెలా కనీసం రూ.100 పెట్టుబడి పథకంలోనూ చేరవచ్చు. 

సుకన్య సమృద్ధి యోజన
ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక పథకం సుకన్య సమృద్ధి యోజన. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 7.6 శాతం రాబడి లభిస్తుంది. ఈ పథకంలో, 0-10 సంవత్సరాల వయస్సున్న ఆడపిల్లల కోసం పెట్టుబడి పెట్టవచ్చు. ఒక సంవత్సరంలో కనిష్టంగా రూ. 250, గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీ చిన్నారికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత లేదా 21 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, అప్పటివరకు జమ చేసిన మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు పొందుతారు.

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్‌కు దేశంలో మంచి ఆదరణ లభిస్తోంది. మీకు దగ్గరలో ఉన్న పోస్టాఫీసులోనే ఈ పథకం కింద 5 సంవత్సరాల కాల పరిమితితో ఖాతా తెరవవచ్చు. ఈ పథకంలో మీకు 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. త్రైమాసిక ప్రాతిపదికన, అంటే మూడు నెలలకు ఒకసారి వడ్డీని అందిస్తారు. నెలకు రూ. 2,000 మొత్తంతోనూ ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఇలా నెలకు రూ. 2000 చొప్పున 5 సంవత్సరాల్లో మీరు ఒక లక్ష 20 వేల రూపాయలు జమ చేస్తారు. 5 సంవత్సరాల తర్వాత కాస్త భారీ మొత్తాన్ని పొందుతారు. కావాలంటే, 3 సంవత్సరాల తర్వాత ఖాతాలో జమ చేసిన డబ్బును ముందస్తుగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ డబ్బును మీ పిల్లల చదువులకు వినియోగించుకోవచ్చు.

సావరిన్ గోల్డ్ బాండ్
ద్రవ్యోల్బణానికి విరుగుడుగా పని చేసే ఉత్తమ పెట్టుబడి ఎంపిక బంగారం. సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో, సంవత్సరానికి 2.5 శాతం చొప్పున MRP, క్యాపిటల్ అప్రిసియేషన్‌ మీద వడ్డీని తిరిగి పొందుతారు. మీరు SIP పద్దతిలో గోల్డ్ ETFలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Embed widget