News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Indian Stock Market In 2022: 2022లో సత్తా చాటిన రిటైల్ ఇన్వెస్టర్లు, తగ్గిన ఫారిన్‌ ఫండ్స్‌ జోరు - స్టాక్‌ మార్కెట్‌ ఓవర్‌లుక్‌

2022లో పెట్టుబడిదారులకు సానుకూల రాబడిని అందించిన ఏకైక మార్కెట్ భారతీయ స్టాక్ మార్కెట్ మాత్రమే. చైనా, అమెరికా, యూరోప్ మార్కెట్లు నెగెటివ్‌ రిటర్న్స్‌తో ఇన్వెస్టర్లను ముంచేశాయి.

FOLLOW US: 
Share:

Indian Stock Market In 2022: ప్రస్తుత 2022 సంవత్సరంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ భారీగా పతనం అయ్యాయి. మొదటి కారణం ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం, రెండో కారణం వస్తు ధరల పెరుగుదల కారణంగా దశాబ్దాల గరిష్ట స్థాయులకు చేరిన ద్రవ్యోల్బణం. అయితే, ప్రపంచ మార్కెట్ల నుంచి ఇప్పుడు ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు డీ-కపుల్ అయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో ఏం జరిగినా, చిన్న చిన్న షాక్‌లు తప్ప భారతీయ మార్కెట్లు చెక్కు చెదరడం లేదు, విదేశీ మదుపర్ల అడుగులకు మడుగులు ఒత్తడం లేదు. దీనికి కారణం, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్న దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లు. 

2022లో పెట్టుబడిదారులకు సానుకూల రాబడిని అందించిన ఏకైక మార్కెట్ భారతీయ స్టాక్ మార్కెట్ మాత్రమే. చైనా, అమెరికా, యూరోప్ మార్కెట్లు నెగెటివ్‌ రిటర్న్స్‌తో ఇన్వెస్టర్లను ముంచేశాయి.

FPIలను ఎదిరించిన రిటైల్‌ ఇన్వెస్టర్లు
2022లో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కమొడిటీ ధరల్లో షాప్‌ జంప్ కనిపించింది. ముడి చమురు ధర బ్యారెల్‌కు రికార్డు స్థాయిలో 139 డాలర్లకు చేరుకుంది. ఆహార పదార్థాల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. ఏప్రిల్ 2022లో భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరింది. ఆ తర్వాత రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పాలసీ రేట్లను ఐదుసార్లు పెంచింది. అమెరికా & యూరోప్‌ దేశాల్లోనూ, అక్కడి సెంట్రల్ బ్యాంక్‌లు వడ్డీ రేట్లు పెంచాయి. ఈ కారణంగా 2022లో నాస్‌డాక్ 30 శాతం క్షీణించింది. 2023లో మాంద్యం వచ్చే అవకాశం ఉంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడంతో, విదేశీ పెట్టుబడిదారులు (FPIలు) భారతీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. 2022లో విదేశీ మదుపర్లు భారత మార్కెట్ నుంచి దాదాపు రూ. 2 లక్షల పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు. దీంతో ఇండియ్‌ స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. ఇదే సమయంలో, రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు ప్రారంభించారు, మార్కెట్లు మరింత పతనం కాకుండా కాపాడారు. ఫలితంగా సెన్సెక్స్ 63,600, నిఫ్టీ 18,900 జీవన కాల గరిష్ట స్థాయులకు చేరుకున్నాయి. ఇప్పుడు, విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారత మార్కెట్‌ వైపు మొగ్గు చూపే పరిస్థితి నెలకొంది.

SIP మీద పెరిగిన నమ్మకం
స్టాక్ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడని ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) రూట్‌లో మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ సెక్టార్ నియంత్రణ సంస్థ అయిన 'అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా' (AMFI -ఆంఫి) డేటా ప్రకారం... సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా వచ్చే పెట్టుబడులు రికార్డు సృష్టిస్తున్నాయి. 2022 నవంబర్ నెలలో SIP రూట్‌ పెట్టుబడి రికార్డు స్థాయిలో రూ. 13,307 కోట్లకు చేరుకోగా, అక్టోబర్‌లో రూ. 13,040 కోట్లుగా ఉంది. సిప్ పెట్టుబడులు రూ. 13,000 కోట్లు పైగా నమోదు కావడం ఇది వరుసగా రెండో నెల. 2022 మే నెల నుంచి సిప్‌ పెట్టుబడులు రూ. 12,000 కోట్లకు పైనే ఉన్నాయి, తప్ప తగ్గలేదు. మ్యూచువల్ ఫండ్స్‌లో చిన్న పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లకు మద్దతు లభిస్తోంది.

రికార్డ్‌ స్థాయి డీమ్యాట్‌ అకౌంట్లు
కరోనా మహమ్మారి మొదటి వేవ్‌ కారణంగా దేశంలో లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు, భారత స్టాక్ మార్కెట్‌ను ఒక సునామీ తాకింది. నిఫ్టీ 7500, సెన్సెక్స్ 25000 పాయింట్ల దగ్గరకు పడిపోయాయి. ఎప్పుడైతే మార్కెట్‌లో భారీ పతనం ఏర్పడిందో, అప్పుడు వాల్యుయేషన్లు చాలా ఆకర్షణీయంగా మారాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లలో బందీలైన రిటైల్ ఇన్వెస్టర్ల చూపు చవగ్గా ఉన్న స్టాక్‌ మార్కెట్ల మీద పడింది. ఇక పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు వాళ్లంతా మార్కెట్ నుంచి విపరీతంగా డబ్బు సంపాదించారు. మార్చి 2020కి ముందు మన దేశంలో 4 కోట్ల కంటే తక్కువ మంది డీమ్యాట్ అకౌంట్లు ఉంటే.. ఇప్పుడు 11 కోట్లకు చేరుకున్నాయి. దీనిని బట్టి రిటైల్‌ ఇన్వెస్టర్లు ఏ రేంజ్‌లో మార్కెట్‌లోకి వచ్చారో అంచనా వేయవచ్చు. గత ఏడాది కాలంలో 3.30 కోట్ల మంది డీమ్యాట్ ఖాతాలు తెరిచారు.

అద్భుతంగా సాగిన IPO మార్కెట్ 
2021 చివరి నాటికి స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్ట్‌ అయిన టెక్ కంపెనీలను పరిగణనలోకి తీసుకోకుండా లెక్కలు వేస్తే, 2022లో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ అయిన చాలా కంపెనీలు తమ పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడి అందించాయి. ఇందులో అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ విల్మార్ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. అది కాకుండా.. వేదాంత ఫ్యాషన్స్, వెరాండా లెర్నింగ్, క్యాంపస్ యాక్టివ్‌వేర్‌, ప్రుడెంట్ అడ్వైజర్స్, వీనస్ పైప్స్ వంటి IPOలు ఇన్వెస్టర్లకు మంచి ఆదాయం సంపాదించి పెట్టాయి.

Published at : 27 Dec 2022 12:52 PM (IST) Tags: Indian stock market SIP FPIS Demat account Year Ender 2022 Retail investors IPO In 2022

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Adani Group Investment Plan: ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

Adani Group Investment Plan: ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

Train Ticket: కన్ఫర్మ్‌డ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్‌ ప్రయత్నించండి

Train Ticket: కన్ఫర్మ్‌డ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్‌ ప్రయత్నించండి

Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ ఛెస్ట్‌ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు

Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ ఛెస్ట్‌ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు

GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు

GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు

టాప్ స్టోరీస్

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
×