అన్వేషించండి

Forex: ఫారిన్‌ కరెన్సీ కిట్టీలో లక్ష్మీకళ, $596 బిలియన్లకు పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు

దేశంలో బంగారం నిల్వలు (Gold reserves In India) తగ్గుముఖం పట్టాయి.

India Forex Reserves: భారతదేశ విదేశీ కరెన్సీ నిల్వలు మరోసారి పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. జూన్ 16, 2023తో ముగిసిన వారంలో ఇండియా ఫారెక్స్‌ రిజర్వ్స్‌ 2.35 బిలియన్ డాలర్ల వృద్ధితో 596.09 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు జూన్ 9, 2023తో ముగిసిన వారంలో ఫారిన్‌ కరెన్సీ కిట్టీ 1.31 బిలియన్ డాలర్లు తగ్గి 593.74 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.

RBI డేటా ప్రకారం, జూన్ 16, 2023తో ముగిసిన వారంలో, విదేశీ కరెన్సీ ఆస్తులు  (Foreign Currency Assets) 2.57 బిలియన్‌ డాలర్ల జంప్‌తో 527.65 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. జూన్‌ 9తో ముగిసిన వారంలో 1.12 బిలియన్‌ డాలర్ల క్షీణతతో 525.07 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతకుముందు, జూన్ 2తో ముగిసిన వారంలో 526.20 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల విలువ. అమెరికన్‌ డాలర్ల రూపంలో ఈ విలువను చెబుతారు. 

దేశంలో బంగారం నిల్వలు
అయితే, దేశంలో బంగారం నిల్వలు (Gold reserves In India) తగ్గుముఖం పట్టాయి. జూన్ 16, 2023తో ముగిసిన వారంలో గోల్డ్‌ ఛెస్ట్‌ 324 మిలియన్ డాలర్లు తగ్గి 45.04 బిలియన్ డాలర్లకు చేరుకుంది. జూన్‌ 9తో ముగిసిన వారంలోనూ 183 మిలియన్ డాలర్లు తగ్గి 45.37 బిలియన్ డాలర్ల వద్ద ఉంది.

IMF వద్ద ఉన్న ఇండియా గోల్డ్‌ రిజర్వ్స్‌ 34 మిలియన్‌ డాలర్ల జంప్‌తో 5.14 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. జూన్‌ 9తో ముగిసిన వారంలో 8 మిలియన్ డాలర్లు తగ్గి 5.11 బిలియన్ డాలర్లకు దిగి వచ్చాయి. అంతకుముందు వారంలో అవి 5.12 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 

రూపాయి విలువ
శుక్రవారం (జూన్ 23, 2023), డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోయింది. విదేశీ పెట్టుబడిదార్ల అమ్మకాల కారణంగా ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి బలహీనపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసల స్వల్ప క్షీణతతో రూ.82.03 వద్ద ముగిసింది. అంతకుముందు సెషన్‌లో రూపాయి 81.96 స్థాయి వద్ద ముగిసింది.

ఆల్ టైమ్ హై లెవెల్ ఇది
భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్‌ నెలలో అత్యధిక స్థాయికి, 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది, ఆల్‌ టైమ్‌ హై రికార్డ్‌. అప్పటి నుంచి RBI వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టాయి. 2022 సంవత్సరం ప్రారంభంలోనూ, మన దేశ విదేశీ మారక నిల్వలు 633 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వివిధ ప్రతికూల కారణాల వల్ల విదేశీ పెట్టుబడిదార్లు భారత్‌లోని తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుని డాలర్ల రూపంలో ఆ డబ్బును వెనక్కు తీసుకెళ్లారు. ఈ కారణంగా, విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వచ్చాయి, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఉత్పన్నమయిన ప్రపంచ ఉద్రిక్తతలు కూడా మన దేశ ఫారెక్స్‌ రిజర్వ్స్‌పై ప్రభావం చూపాయి. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ముడి చమురు కొనుగోళ్ల కోసం డాలర్ల రూపంలో ఎక్కువగా వ్యయం చేయాల్సి వచ్చింది. 2022లో US ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రారంభించడంతో విదేశీ పెట్టుబడిదార్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో, రూపాయి విలువలో బలహీనత కనిపించింది. ఆ సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 శాతం పడిపోయి రూ.83 కనిష్ట స్థాయికి చేరుకుంది. రూపాయికి మద్దతు ఇవ్వడానికి, ఆర్‌బీఐ డాలర్లను విక్రయించాల్సి వచ్చింది. ఈ కారణంగానూ విదేశీ మారక నిల్వలు క్షీణించాయి.

ఏ దేశంలోనైనా, సౌకర్యవంతమైన స్థాయిలో ఉండే విదేశీ మారక నిల్వలు ఆ దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. విదేశీ మారక నిల్వల్లో క్షీణతను ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా చూడాలి. నిల్వలు పెరుగుతుంటే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలపడుతున్నాయని భావించాలి.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - కొత్త రేట్లివి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Kidney Health : కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!
ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!
Embed widget