Income Tax: దేశంలో ఏ కంపెనీ ఎక్కువ టాక్స్ కడుతోంది? టాప్-10 లిస్ట్ ఇదిగో
దేశంలోని టాప్-500 లిస్టెడ్ కంపెనీలు కార్పొరేట్ టాక్స్ (Corporate Tax) రూపంలో ప్రభుత్వ ఖజానాకు రూ.3.64 లక్షల కోట్లు జమ చేశాయి.
Income Tax: 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను వసూళ్ల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ చాలా డబ్బు సంపాదించింది. గత ఆర్థిక సంవత్సరంలో, BSE 500 కంపెనీలన్నీ కలిసి ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్ల రూపాయలు చెల్లించాయి.
ఏస్ ఈక్విటీ డేటా ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో, దేశంలోని టాప్-500 లిస్టెడ్ కంపెనీలు కార్పొరేట్ టాక్స్ (Corporate Tax) రూపంలో ప్రభుత్వ ఖజానాకు రూ.3.64 లక్షల కోట్లు జమ చేశాయి. అంతకుముందు సంవత్సరం కంటే ఇది 7 శాతం ఎక్కువ. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.3.41 లక్షల కోట్ల టాక్స్ కట్టాయి.
ఎక్కువ టాక్స్ కడుతున్న టాప్-10 గ్రూప్‌లు
ఎక్కువ పన్ను చెల్లించిన కంపెనీల్లో పబ్లిక్ సెక్టార్ సంస్థలదే పై చేయి. అన్ని లిస్టెడ్ ప్రభుత్వ కంపెనీలు (లిస్టెడ్ PSUలు) కలిసి, 2022-23లో, రూ.1.08 లక్షల కోట్ల పన్ను చెల్లించాయి.
ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో టాటా గ్రూప్ టాప్ ప్లేస్‌లో ఉంది. టాటా గ్రూపునకు చెందిన లిస్టెడ్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో గవర్నమెంట్ ఖజానాకు రూ. 30,000 కోట్లకు పైగా తరలించాయి. BSE-500 ఇండెక్స్‌లో మొత్తం 17 టాటా గ్రూప్ కంపెనీలు ఉన్నాయి.
టాటా గ్రూప్ తర్వాత, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ కంపెనీలు కౌంట్‌లోకి వచ్చాయి. అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూపు కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.20,730 కోట్ల కార్పొరేట్ టాక్స్ పే చేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ రూ.20,300 కోట్ల కాంట్రిబ్యూషన్‌తో ఫోర్త్ ర్యాంక్ తెచ్చుకుంది. ఐసీఐసీఐ గ్రూప్ రూ.12,800 కోట్ల టాక్స్ కట్టి ఫిప్త్ ప్లేస్‌లో నిలిచింది. BSE-500 ఇండెక్స్‌లో HDFC గ్రూప్ & ICICI గ్రూప్ రెండింటికి తలో 4 కంపెనీలు ఉన్నాయి.
బజాజ్ గ్రూప్ కంపెనీలు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.10,554 కోట్ల పన్ను చెల్లించాయి. BSE-500లో 6 కంపెనీలున్న బజాజ్ గ్రూప్, హైయెస్ట్ టాక్స్ పేమెంట్స్‌లో ఆరో స్థానంలో నిలిచింది. రూ.10,547 కోట్ల పన్ను చెల్లించి అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్ ఏడో స్థానంలో ఉంది. అనిల్ అగర్వాల్ 2 కంపెనీలు BSE-500 గ్రూప్‌లో ఉన్నాయి.
కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.10,100 కోట్లు చెల్లించి ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. రూ.9,200 కోట్ల కార్పొరేట్ టాక్స్ చెల్లించి రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్, తొమ్మిదో స్థానంలో ఉంది. రూ.7,768 కోట్ల పన్ను చెల్లింపుతో యాక్సిస్ బ్యాంక్ 10వ స్థానంలో నిలిచింది.
టాప్-5 టాక్స్ పేయింగ్ కంపెనీలు
కంపెనీల వారీగా చూస్తే... రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.20,713 కోట్ల పన్ను చెల్లిస్తూ ముందంజలో ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ రూ.18,840 కోట్లతో ఆ తర్వాతి ప్లేస్‌లోకి వచ్చింది. రూ.15,350 కోట్లు చెల్లించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మూడో స్థానంలో నిలిచింది. టీసీఎస్ రూ.14,604 కోట్లతో ఫోర్త్ ప్లేస్‌లో, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.11,793 కోట్లతో ఫిప్త్ ప్లేస్‌లో ఉన్నాయి.
మరో ఆసక్తికర కథనం: ఈ నెలలో బ్యాంకులు 15 రోజులు పని చేయవు, మీ ప్లాన్ మార్చుకోండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial