అన్వేషించండి

Sundar Pichai: గూగుల్‌కు 25 ఏళ్లు: ఉద్యోగులు, యూజర్లకు సుందర్ పిచాయ్ హృద్యమైన మెసేజ్

ప్రపంచ దిగ్గజ సంస్థ పుట్టి నేటికి 25 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తమ ఉద్యోగులను ఉద్దేశించి ఓ బ్లాగ్ రాశారు.

ప్రస్తుతం గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా జనాలకి కనీస అవసరంగా మారిపోయిన సంగతి తెలిసిందే. అసలు సెర్చ్ ఇంజన్‌ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు గూగుల్‌ అనేంతలా ఆ సంస్థ ఎదిగింది. సెర్చ్ చేయడానికి ‘గూగుల్‌ చేయండి’ అనడం చాలా సందర్భాల్లో మనకి వినిపిస్తుంటుంది. అంతటి ప్రపంచ దిగ్గజ సంస్థ పుట్టి నేటికి 25 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తమ ఉద్యోగులను ఉద్దేశించి ఓ బ్లాగ్ రాశారు. దాంట్లో తన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లతో పాటుగా గూగుల్‌కు సంబంధించిన పలు ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.

‘‘చాలా ఏళ్ల క్రితం నేను అమెరికాలో చదువుతున్నప్పుడు భారత్‌లో ఉంటున్న మా నాన్నకు తొలి ఈ - మెయిల్ అడ్రస్ వచ్చింది. నా తండ్రితో కమ్యూనికేట్ చేయడానికి వేగవంతమైన, చవకైన మార్గం లభించినందుకు నేను చాలా సంతోషించాను. అందుకే నాన్నకి ఈ మెసేజ్ పంపాను. అప్పుడు నేను చాలా వెయిట్ చేశాను. ఆయన నుంచి సమాధానం రావడానికి నాకు 2 రోజులు పట్టింది. డియర్ పిచాయ్, ఈ-మెయిల్ అందుకున్నాడు అని రాశారు. ఈ-మెయిల్ రావడం ఆలస్యం కావడంతో, పిచాయ్ తన తండ్రికి కూడా ఫోన్ చేశారు. అతని తండ్రి తన కార్యాలయంలోని ఎవరైనా తన కంప్యూటర్‌లో ఈ-మెయిల్‌ను చూడాల్సి ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత ప్రింట్ తీసి వారికి డెలివరీ చేయాల్సి ఉంటుంది.

నేటి కాలంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఒకసారి నేను నా కొడుకుతో ఉన్నాను. ఏదో చూసి మొబైల్ లో ఫోటో తీశాడు. ఆపై స్నేహితులకు షేర్ చేసుకున్నారు. తర్వాత ఒకరికొకరు మెసేజ్‌లు పంపుకున్నారు. జేబులోంచి ఫోన్ తీసినంత వేగంగా అదంతా జరిగింది. కొన్నేళ్ల క్రితం నేను నా తండ్రికి మెసేజ్ పంపిన తీరుతో పోలిస్తే, ఈ రోజు నా కొడుకు తన తండ్రితో సంభాషించే విధానం, తరాల మధ్య ఎంత మార్పు జరుగుతుందో చూపిస్తుంది.

నల్లా రిపేర్ నుంచి గూగుల్‌ ఇంటర్వ్యూ వరకు..
కుప్పలు తెప్పలుగా ఉన్న సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒక క్రమ పద్ధతిలో అందించాలన్న లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ ఆలోచనతోనే గూగుల్‌ మిషన్ ప్రారంభమైంది. అలా గూగుల్‌ సెర్చ్‌ పేరుతో తీసుకొచ్చిన ప్రొడక్ట్‌ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి పరిష్కారాలను వెతికి పెట్టింది. సరైన సమాధానాలు వెతికి పెట్టే గూగుల్‌ సామర్థ్యాన్ని చూసిన నేను ఆశ్చర్యపోయేవాడిని. ‘లీక్ అవుతున్న నల్లాకు రిపేర్ చేయడం ఎలా?’ దగ్గరి నుంచి తాను ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో ‘గూగుల్‌ ఇంటర్వ్యూని ఫేస్ చేయడం ఎలా?’ వరకు అనేక ప్రశ్నలకు గూగుల్‌ నాకు సమాధానం ఇచ్చింది. కాలక్రమంలో నేను ప్రశ్నలు అడిగిన తీరుతో పాటు గూగుల్‌ నుంచి సమాధానం ఇచ్చే విధానంలోనూ చాలా మార్పులు వచ్చాయి’’ అని సుందర్ పిచాయ్ ఓ బ్లాగ్ లో వివరించారు.

విశ్వాసం చూరగొనడం అతిపెద్ద సవాలు
గూగుల్ నుంచి ఎన్నో సర్వీస్ లు తేవడం ఒక ఎత్తు అయితే, యూజర్ల నమ్మకాన్ని పొందడం అతిపెద్ద సవాలు అని సుందర్ పిచాయ్ అన్నారు. అందుకే గూగుల్‌ మొదటి నుంచి సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించిదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సమాచారం, ప్రైవసీకి భద్రత కల్పించడాన్ని ప్రాధాన్యంగా ఎంచుకున్నామని అన్నారు. అలాగే, ఏఐ రూపంలో వస్తున్న మరో సాంకేతిక విప్లవానికి మనం తొలి దశలో ఉన్నామని సుందర్ పిచాయ్ చెప్పారు. దీన్ని అందరూ యూజర్లకి మరింత సహాయకారిగా మార్చడం, దానిని బాధ్యతాయుతంగా అమలు చేయడమే రాబోయే 10 సంవత్సరాలు తమ లక్ష్యం అని పిచాయ్ స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget