By: Rama Krishna Paladi | Updated at : 23 Jul 2023 12:57 PM (IST)
వడ్డీరేట్ల పెంపు
Federal Reserve Rates:
గ్లోబల్ ఎకానమీకి ఈ వారం అత్యంత కీలకం కానుంది. అమెరికా ఫెడ్, ఐరోపా, జపాన్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయాలు తీసుకున్నాయి. తమ తమ ద్రవ్య విధానాలను సమీక్షించబోతున్నాయి. ఇన్‌ఫ్లేషన్ ఇప్పటికీ అధికంగానే ఉండటంతో రెపో రేట్లు పెంచడం సహజమేనన్న అంచనాలు ఉన్నాయి.
అమెరికా ఫెడరల్ బ్యాంకు, ఐరోపా సెంట్రల్ బ్యాంకులు ఈసారి చెరో 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీరేట్లు పెంచుతాయని తెలిసింది. మున్ముందు విధాన రేట్ల పెంపు ఇంకా ఉంటుందా? లేదా కొంత సమయం నిలిపివేస్తారా అన్నది ఈ వారం తెలుస్తుంది. ద్రవ్యోల్బణం ఇప్పటికీ అధికంగానే ఉందని అటు ఫెడ్ ఛైర్ జెరోమ్ పావెల్ ఇటు ఈసీబీ అధ్యక్షురాలు క్రిస్టీన్ లగార్డ్ హెచ్చరిస్తుండటం గమనార్హం. అందుకే విధాన రేట్లు పెంచక తప్పడం లేదని పేర్కొంటున్నారు.
బ్యాంక్ ఆఫ్ జపాన్ సైతం వడ్డీరేట్లను పెంచడం ఖాయమే! ద్రవ్యోల్బణాన్ని లక్షిత రెండు శాతానికి తగ్గించేందుకు గవర్నర్ కజువో ఉయెడా కఠిన నిర్ణయం తీసుకుంటారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా ఫెడ్ పాలసీ మేకర్స్ బుధవారం సమావేశం అవుతున్నారు. వడ్డీరేట్లను 5.25 - 5.5 శాతానికి తీసుకెళ్తారని తెలిసింది. ఇదే జరిగితే చివరి 16 నెలల్లో 11వ సారి పెంచినట్టు అవుతుంది. దాంతో 22 ఏళ్లలో తొలిసారి అత్యధిక స్థాయికి రెపోరేటు చేరినట్టు అవుతుంది.
నిజానికి జూన్‌లో ఫెడ్ కొంత విరామం ఇచ్చింది. అయితే జులై నుంచి మళ్లీ వడ్డీరేట్ల పెంపు కొనసాగించింది. పెరుగుతున్న ధరలను అదుపు చేయాలంటే ఇది తప్పదని అంటోంది. ఇక ఐరోపా సెంట్రల్ బ్యాంకు ఇప్పటి వరకు 400 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇక పైనా పెంచితే 25 ఏళ్లలోనే అత్యధిక రేటు అవుతుంది.
అమెరికా, ఐరోపా, జపాన్ సెంట్రల్ బ్యాంకుల విధాన సమీక్షను బట్టి ఇండోనేసియా, హంగేరీ, ఉక్రెయిన్, ఉజ్బెకిస్థాన్, చిలీ, నైజీరియా, ఘనా, మలావి, లెసెతో బ్యాంకులు రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటాయి. మిడిల్ ఈస్ట్‌లోని బ్యాంకులూ వీరినే అనుసరించనున్నాయి.
Also Read: మీ డబ్బును పెంచే ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్, ఆగస్టు 15 వరకే అవకాశం
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Stock Market Today: సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లు విలవిల - రూ.22 లక్షల వద్దే బిట్‌కాయిన్
Artificial Intelligence: కృత్రిమ మేథకు మోదీ బూస్ట్! జీపీయూ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్న కేంద్రం
Stock Market Today: వరుస నష్టాలకు తెర! రీబౌండ్ అయిన నిఫ్టీ, సెన్సెక్స్
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్ 279
చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
/body>