అన్వేషించండి

Unacademy Lays Off: చెప్పాపెట్టకుండా 1000 మందిని ఉద్యోగాల్లోంచి తీసేసిన అన్‌అకాడమీ!

Unacademy Lays Off: ఎడ్యూటెక్‌ స్టార్టప్‌ అన్‌అకాడమీ (UNacademy) ఉద్యోగుల గుండెలు గుభేల్‌మనిపించింది! ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా కొన్ని వారాలుగా 1000 మందిని ఉద్యోగాల్లోంచి తీసేసింది.

Unacademy Lays Off: ఎడ్యూటెక్‌ స్టార్టప్‌ అన్‌అకాడమీ (UNacademy) ఉద్యోగుల గుండెలు గుభేల్‌మనిపించింది! ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా కొన్ని వారాలుగా 1000 మందిని ఉద్యోగాల్లోంచి తీసేసింది. ఇందులో రెగ్యులర్‌, కాంట్రాక్టు ఎడ్యుకేటర్లు ఉన్నట్టు తెలిసింది.

అన్‌అకాడమీ ప్రధాన కేంద్రం బెంగళూరులో ఉంది. గత వారం ఈ కంపెనీ 600 మందిని ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోవాలని చెప్పింది. వెంచర్‌ ఫండింగ్‌ తగ్గిపోవడం, ఆర్థిక వాతావరణం అనువుగా లేకపోవడంతో ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే డౌన్‌సైజింగ్‌ చేపట్టింది. గతేడాది ఆగస్టులో అన్‌అకాడమీ 3.4 బిలియన్‌ డాలర్ల విలువతో 440 మిలియన్‌ డాలర్లను సింగపూర్‌కు చెందిన టెమాసెక్‌ నుంచి సేకరించింది.

ఉద్యోగాల్లోంచి తీసేసిన 1000 మందిలో దాదాపుగా 300 మంది ఎడ్యుకేటర్లు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. మిగతా వాళ్లు సేల్స్‌, బిజినెస్‌, ఇతర విభాగాల్లో ఉన్నారు. అన్‌అకాడమీ టెస్టు ప్రిపరేషన్‌ ప్రొడక్టులో భాగమైన వారిని ఎక్కువగా తీసేసింది. లేఆఫ్‌లు ప్రకటించక ముందు కంపెనీలో దాదాపుగా 6000 మంది పనిచేస్తున్నారు. కాగా పనితీరును మదింపు చేసిన తర్వాతే కొందరిని తీసేశామని కంపెనీ అంటోంది. తమ పనితీరు, పారదర్శకత చాలా ఎక్కువని పేర్కొంది. ప్రస్తుతం బిజినెస్‌ చాలా వృద్ధి సాధిస్తోందని వెల్లడించింది.

ఉద్యోగులు మాత్రం మరోలా చెబుతున్నారు. తమకు ఎలాంటి ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వకుండానే వెళ్లిపోమ్మన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పనితీరు పట్ల కంపెనీ ఎలాంటి ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వలేదన్నారు. ప్రొబేషన్‌ పూర్తికాకుండానే జాయిన్‌ అయిన రెండు నెలలకే పంపించేశారని చెబుతున్నారు. కంపెనీ ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ ఛానెల్‌ 'స్లాక్‌' నుంచి తమను ఉన్నపళంగా తొలగించారని, తర్వాత ఈమెళ్లకు ఒక లింక్‌ పంపించి తీసేశారని వాపోతున్నారు. 'అక్కడ చాలా ప్రెజర్‌ ఉంటుంది. విషం చిమ్ముతూనే ఉంటారు. ప్రతిరోజు 12-14 గంటలు పని చేయించుకొనేవారు. లేదంటే వెళ్లిపోవాలని చెప్పేవారు. మా పనితీరు గురించి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. పైగా ఇవన్నీ మేనేజ్‌మెంట్‌ నిర్ణయాలని హెచ్‌ఆర్‌ చెప్పారు' అని ఉద్యోగులు అంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Does Gen Z Use Credit Cards:క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
EPFO Crediting Interest: కోట్లాది మంది ఉద్యోగులకు EPFO తీపి కబురు! 8.25% వడ్డీ జమ ప్రారంభం.. ఇలా చెక్ చేసుకోండి!
కోట్లాది మంది ఉద్యోగులకు EPFO తీపి కబురు! 8.25% వడ్డీ జమ ప్రారంభం.. ఇలా చెక్ చేసుకోండి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Embed widget