అన్వేషించండి

Dreamfolks Services IPO: తొలిరోజే సూపర్ హిట్టు! డ్రీమ్‌ఫోక్స్‌ ఐపీవోకు 1.45 రెట్ల స్పందన!

Dreamfolks Services IPO: విమానాశ్రయ సేవల కంపెనీ డ్రీమ్‌ఫోక్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకు మంచి స్పందన లభిస్తోంది. తొలిరోజే 1.45 రెట్లకు పైగా బిడ్డింగులు వచ్చాయి.

Dreamfolks Services IPO: విమానాశ్రయ సేవల కంపెనీ డ్రీమ్‌ఫోక్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకు మంచి స్పందన లభిస్తోంది. తొలిరోజే 1.45 రెట్లకు పైగా బిడ్డింగులు వచ్చాయి. రిటైల్‌ కోటాలో 6.57 రెట్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. ఎన్‌ఐఐ కోటాలో 0.66 రెట్లు బుక్‌ అయినట్టు బీఎస్‌ఈ డేటా ద్వారా తెలిసింది. డ్రీమ్‌ఫోక్స్‌ షేర్ల కోసం దరఖాస్తు చేసుకొనేందుకు ఆగస్టు 26 చివరి తేదీ. షేర్ల ప్రైస్‌ బ్యాండ్‌ రూ.308-326గా నిర్ణయించారు.

యాంకర్‌ ఇన్వెస్టర్లకు 7.76 కోట్ల షేర్లు

పబ్లిక్‌ ఇష్యూకు ముందు డ్రీమ్‌ఫోక్స్‌ యాంకర్‌ ఇన్వెస్టర్ల ద్వారా రూ.253 కోట్లు సమీకరించింది. ఒక్కో షేరుకు రూ.326 చొప్పున 7.76 కోట్ల షేర్లను వారికి కేటాయించింది. ఇక ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) కింద 1.72 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. పీటర్‌ కల్లాట్‌, దినేశ్‌ నాగ్‌పాల్‌, ముకేశ్‌ యాదవ్‌ కంపెనీ ప్రమోటర్లుగా ఉన్నారు. పోస్ట్‌ ఆఫర్‌ పెయిడప్‌ ఈక్విటీ షేర్‌ క్యాపిటల్‌లో 33 శాతం ప్రజలకు కేటాయించారు.

గ్రే మార్కెట్‌ ప్రీమియం

మార్కెట్‌ వర్గాల ప్రకారం డ్రీమ్‌ఫోక్స్‌ సర్వీసెస్‌ షేర్లు రూ.62 ప్రీమియంతో (GMP) గ్రే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 2022, సెప్టెంబర్‌ 6న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో షేర్లు నమోదవుతాయని తెలిసింది.

బ్రోకింగ్‌ కంపెనీల వివరణ

'కొన్ని అంశాల ఆధారంగా ఈ ఐపీవోను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలని సూచిస్తున్నాం. కంపెనీకి ఎలాంటి అప్పులు లేవు. లాభాల్లో ఉంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రయాణ రంగంలో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. కంపెనీలో ఎలాంటి ప్రైవేట్‌ ఈక్విటీ లేదు. కంపెనీ విలువ కాస్త అధికంగానే అనిపిస్తున్నా ఈ రంగంలో ఐపీవోకు వస్తున్న తొలి భారతీయ కంపెనీ ఇదే కావడం గమనార్హం. చైనా, బ్రిటన్‌లో మాత్రమే ఇలాంటి కంపెనీలు ఐపీవోకు వెళ్లాయి' అని జైనమ్‌ బ్రోకింగ్‌ తెలిపింది.

డ్రీమ్‌ఫోక్స్‌ సేవలు

విమానాశ్రయాల్లో ప్రయాణికులు మెరుగైన ప్రయాణ అనుభవం అందించేందుకు డ్రీమ్‌ఫోక్స్‌ సాయపడుతుంది. టెక్నాలజీ ద్వారా లాంజ్‌లు, ఆహారం, పానీయాలు, స్పా, ఎయిర్‌ పోర్టుకు వచ్చిన వారికి మీట్‌ అండ్‌ అసిస్ట్‌, హోటల్‌కు తీసుకెళ్లడం, పడక గదులు, బ్యాగుల తరలింపు వంటి సేవలు అందిస్తుంది.

మార్కెట్‌ సెంటిమెంటును బట్టి లిస్టింగ్‌

'డ్రీమ్‌ ఫోక్స్ వ్యాపార విధానం బాగుంటుంది. షేర్ల ధరలు, కంపెనీ విలువ అధికంగా ఉన్నట్టు అనిపిస్తోంది. 104.82x పీఈతో షేర్లు విక్రయిస్తున్నారు. 32 శాతం వాటాను ఓఎఫ్‌ఎస్‌ ద్వారా కేటాయిస్తున్నారు. రిటైల్‌ కోటా, మార్కెట్‌ సెంటిమెంటును బట్టి సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. బహుశా సానుకూలంగానే నమోదవ్వొచ్చు' అని అన్‌లిస్టెట్‌ ఎరీనా సహ వ్యవస్థాపకుడు అభయ్‌ దోషీ అంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Axis Mutual Fund NFO: యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్
యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
EPFO Update 2026: లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 
లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pradeep Constructions Somajiguda : నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
2026 Renault Kwidలో ఏ వేరియంట్‌ కొనడం తెలివైన నిర్ణయం - ధరలు, ఫీచర్లపై అనాలసిస్‌
2026 Renault Kwid - ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఏ వేరియంట్ బెస్ట్ ఛాయిస్‌? పూర్తి విశ్లేషణ
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Black Thread: చేతికి, కాలికి నల్లదానం ఎందుకు? ఆధ్యాత్మిక రహస్యం & సైన్స్ ఏం చెబుతున్నాయ్?
చేతికి, కాలికి నల్లదానం ఎందుకు? ఆధ్యాత్మిక రహస్యం & సైన్స్ ఏం చెబుతున్నాయ్?
Embed widget