By: ABP Desam | Updated at : 12 Jan 2023 10:03 AM (IST)
Edited By: Arunmali
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.71 లక్షల కోట్లు
Direct tax collection: మన దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. కార్పొరేట్ సంస్థల ఆదాయంతో పాటు, వ్యక్తిగతంగా ప్రజల ఆదాయాల మీద ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల్లో ఎప్పటికప్పుడు పెరుగుదల కనిపిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) జనవరి 10వ తేదీ నాటికి, దేశంలో స్థూల ప్రత్యక్ష పన్ను (Gross direct tax) వసూళ్లు 24.58 శాతం పెరిగి రూ. 14.71 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (Central Board of Direct Taxes - CBDT) బుధవారం (11 జనవరి 2023) ఈ గణాంకాలను విడుదల చేసింది.
వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు పెరగడం వల్ల ఈ వృద్ధి నమోదైందని తెలిపింది.
పన్ను చెల్లింపుదారులకు తిరిగి ఇచ్చిన రిఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 12.31 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 19.55 శాతం ఎక్కువ. స్థూల ప్రత్యక్ష పన్నుల నుంచి రిఫండ్స్‌ను తీసేస్తే వచ్చే మొత్తాన్ని నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లుగా లెక్కిస్తారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి, ప్రత్యక్ష పన్నుల మొత్తం బడ్జెట్ అంచనాల్లో ఇది 86.68 శాతానికి సమానం. 10 నెలలు కూడా పూర్తి కాకుండానే (2022 ఏప్రిల్ 1 నుంచి 2023 జనవరి 10 వరకు) ఈ మొత్తం వసూలైంది ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లను రూ. 14.20 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనా వేసింది.
"జనవరి 10, 2023 వరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్ల తాత్కాలిక గణాంకాలు స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తూనే ఉన్నాయి. జనవరి 10, 2023 వరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ. 14.71 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన స్థూల వసూళ్ల కంటే ఇది 24.58 శాతం ఎక్కువ. " అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది.
కార్పొరేట్ ఆదాయపు పన్ను - వ్యక్తిగత ఆదాయపు పన్ను
విడివిడిగా చూస్తే... 2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి 10వ తేదీ వరకు, స్థూల ప్రాతిపదికన కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లు (Corporate income tax collections) గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 19.72 శాతం పెరిగాయి. ఇదే కాలంలో, స్థూల ప్రాతిపదికన వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (Personal income tax collections) 30.46 శాతం పెరిగాయి.
నికర ప్రాతిపదికన చూస్తే... కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లు 18.33 శాతం, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 20.97 శాతం మేర పెరిగాయని CBDT వెల్లడించింది.
రూ. 2.40 లక్షల కోట్ల రిఫండ్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో... 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2023 జనవరి 10వ తేదీ వరకు, ఈ మధ్య కాలంలో మొత్తం రూ. 2.40 లక్షల కోట్ల రిఫండ్స్ జారీ అయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 58.74 శాతం ఎక్కువ.
Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్
Top Mileage Bikes: మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనాలనుకుంటున్నారా? - బడ్జెట్లో బెస్ట్ లుక్, బెస్ట్ మైలేజ్ వీటిలోనే!
FII stake: మూడు నెలల్లోనే ఎఫ్ఐఐ పెట్టుబడులు రెట్టింపు, ఈ బ్యాంక్‌పై ఎందుకంత నమ్మకం?
Telangana Budget 2023: రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ జిల్లా జడ్జి కోర్టులు - 1,721 పోస్టుల మంజూరు!
Stock Market News: మార్కెట్లు డల్ - కేక పెట్టించిన అదానీ షేర్లు, సెన్సెక్స్ 335 డౌన్!
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Turkey Earthquake : అల్లకల్లోలమైన టర్కీ, సిరియా- ప్రకృతి కోపానికి 2300 మంది మృతి!