News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Cryptocurrency Prices: ఎరుపెక్కిన క్రిప్టో మార్కెట్లు - బిట్‌కాయిన్‌ రూ.35వేలు డౌన్‌

Cryptocurrency Prices Today, 28 June 2023: క్రిప్టో మార్కెట్లు బుధవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు.

FOLLOW US: 
Share:

Cryptocurrency Prices Today, 28 June 2023:

క్రిప్టో మార్కెట్లు బుధవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.17 శాతం తగ్గి రూ.24.87 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.48.30 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 0.77 శాతం తగ్గి రూ.1,52,631 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.18.35 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.04 శాతం పెరిగి రూ.82.05, బైనాన్స్‌ కాయిన్‌ 2.16 శాతం తగ్గి రూ.19,143, రిపుల్‌ 0.77 శాతం తగ్గి రూ.39.05, యూఎస్‌డీ కాయిన్‌ 0.03 శాతం తగ్గి రూ.82.03, లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.71 శాతం తగ్గి రూ.152,598, డోజీ కాయిన్ 0.08 శాతం తగ్గి రూ.5.28 వద్ద కొనసాగుతున్నాయి. హైఫి ఫైనాన్స్‌, బ్లాక్స్‌, స్టెల్లార్‌, వీచైన్‌, క్రిప్టాన్‌ డావో, కాంపౌండ్‌, కస్పా లాభపడ్డాయి. బ్లర్‌, రాడిక్స్‌, ఈరాడిక్స్‌, ఆంక్ర్‌ నెట్‌వర్క్‌, వేవ్స్‌, ఆర్డీ, ఓపెన్‌ ఎక్స్‌ఛేంజ్‌ నష్టపోయాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 28 Jun 2023 03:29 PM (IST) Tags: Bitcoin Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin cryptocurrency

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Adani Group Investment Plan: ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

Adani Group Investment Plan: ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

Train Ticket: కన్ఫర్మ్‌డ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్‌ ప్రయత్నించండి

Train Ticket: కన్ఫర్మ్‌డ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్‌ ప్రయత్నించండి

Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ ఛెస్ట్‌ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు

Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ ఛెస్ట్‌ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు

GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు

GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు

టాప్ స్టోరీస్

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Telangana Results KCR : కాంగ్రెస్‌పై అభిమానం కన్నా కేసీఆర్‌పై కోపమే ఎక్కువ - తెలంగాణ ప్రజలు ఇచ్చిన సందేశం ఇదేనా ?

Telangana Results KCR :  కాంగ్రెస్‌పై అభిమానం కన్నా కేసీఆర్‌పై  కోపమే ఎక్కువ -  తెలంగాణ ప్రజలు ఇచ్చిన సందేశం ఇదేనా ?

Winning Minister 2023: మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విజయం- ఆయనతోపాటు గెలిచిన మంత్రులు వీళ్లే

Winning Minister 2023: మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విజయం- ఆయనతోపాటు గెలిచిన మంత్రులు వీళ్లే

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
×