News
News
X

Cryptocurrency Prices: తగ్గేదే లే! జోరుగా.. హుషారుగా క్రిప్టో మార్కెట్లు!

Cryptocurrency Prices Today, 25 June 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.86 శాతం పెరిగి రూ.17.75 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.32.07 లక్షల కోట్లుగా ఉంది.

FOLLOW US: 

Cryptocurrency Prices Today, 25 June 2022: క్రిప్టో మార్కెట్లు నేడు లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.86 శాతం పెరిగి రూ.17.75 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.32.07 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 6.21 శాతం పెరిగి రూ.1,01,837 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.11.66 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.05 శాతం పెరిగి రూ.82.91, బైనాన్స్‌ కాయిన్‌ 2.15 శాతం పెరిగి రూ.19,786 యూఎస్‌డీ కాయిన్‌ 0.06 శాతం పెరిగి 83.05, కర్డానో 1.28 శాతం పెరిగి రూ.41.63, రిపుల్‌ 2.92 శాతం తగ్గి రూ.30.64 వద్ద కొనసాగుతున్నాయి. డీఎఫ్‌ఐ మనీ, యార్న్‌ ఫైనాన్స్‌, కాంపౌండ్‌, ఎయిర్‌స్వాప్‌, ది సాండ్‌బాక్స్‌, ఫాంటామ్‌, ఆవె 10-27 శాతం లాభాల్లో ఉన్నాయి. సింథెటిక్స్‌, బిట్‌కాయిన్‌ క్యాష్‌, స్టార్జ్‌, జిలికా, బేసిక్‌ అటెన్షన్‌, ఎన్‌కేఎన్‌ 1-3 శాతం వరకు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి. 

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Published at : 25 Jun 2022 02:41 PM (IST) Tags: Bitcoin cryptocurrency Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 25 September: గ్లోబల్‌ మార్కెట్‌లో చమురు రేట్ల భారీ పతనం - మన దగ్గర ఎంత మారిందంటే?

Petrol-Diesel Price, 25 September: గ్లోబల్‌ మార్కెట్‌లో చమురు రేట్ల భారీ పతనం - మన దగ్గర ఎంత మారిందంటే?

Gold-Silver Price 25 September 2022: బంగారం బాగా దిగొచ్చింది, వెండిదీ అదే రూటు

Gold-Silver Price 25 September 2022: బంగారం బాగా దిగొచ్చింది, వెండిదీ అదే రూటు

Cryptocurrency Prices: నో మూమెంటమ్‌! బిట్‌కాయిన్‌ @ రూ.15.40 లక్షలు

Cryptocurrency Prices: నో మూమెంటమ్‌! బిట్‌కాయిన్‌ @ రూ.15.40 లక్షలు

CIBIL Credit Score: మీ క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉందా? పెంచుకోవడం ఇప్పుడు ఈజీ!

CIBIL Credit Score: మీ క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉందా? పెంచుకోవడం ఇప్పుడు ఈజీ!

Can Fin Homes - M&M Fin: BSE500లో 345 షేర్లు విలవిల - వారంలో 19% వరకు పతనం

Can Fin Homes - M&M Fin: BSE500లో 345 షేర్లు విలవిల - వారంలో 19% వరకు పతనం

టాప్ స్టోరీస్

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Chiranjeevi: మెగా నిర్మాతల నిర్ణయం - 'గాడ్ ఫాదర్'ని మలయాళంలో రిలీజ్ చేస్తారా?

Chiranjeevi: మెగా నిర్మాతల నిర్ణయం - 'గాడ్ ఫాదర్'ని మలయాళంలో రిలీజ్ చేస్తారా?