News
News
X

Cryptocurrency Prices: రివ్వున ఎగిసిన క్రిప్టోలు! భారీగా పెరిగిన బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices Today, 08 August 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 4.87 శాతం పెరిగి రూ.19.94 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.35.03 లక్షల కోట్లుగా ఉంది.

FOLLOW US: 

Cryptocurrency Prices Today, 08 August 2022: క్రిప్టో మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 4.87 శాతం పెరిగి రూ.19.94 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.35.03 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 5.62 శాతం పెరిగి రూ.1,36,963 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.16.40 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.04 శాతం పెరిగి రూ.83.24, యూఎస్‌డీ కాయిన్‌ 0.04 శాతం పెరిగి 83.73, బైనాన్స్‌ కాయిన్‌ 4.79 శాతం పెరిగి రూ.26,030, రిపుల్‌ 2.68 శాతం పెరిగి రూ.31.70, కర్డానో 5.60 శాతం పెరిగి రూ.45.01 వద్ద కొనసాగుతున్నాయి. ది గ్రాఫ్‌, అవలాంచె, చైన్‌లింక్‌, పొల్కాడాట్‌, లూప్‌రింగ్‌, బాన్‌కర్‌, హార్మనీ 8-22 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. క్వాంట్‌ స్టాంప్‌, ఎయిర్‌ స్వాప్‌, ట్రూ యూఎస్డీ, పాక్స్‌ డాలర్‌ 1 నుంచి 5 శాతం వరకు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి. 

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది

Published at : 08 Aug 2022 05:43 PM (IST) Tags: Bitcoin cryptocurrency Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin

సంబంధిత కథనాలు

Petrol Price Today 07 October 2022: వాహనదారులకు ఊరట, స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - అక్కడ భారీగా

Petrol Price Today 07 October 2022: వాహనదారులకు ఊరట, స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - అక్కడ భారీగా

Gold Rate Today 07 October 2022: పసిడి ప్రియులకు షాక్ - ఎగబాకిన బంగారం ధరలు, ఊరటనిచ్చిన వెండి 

Gold Rate Today 07 October 2022: పసిడి ప్రియులకు షాక్ - ఎగబాకిన బంగారం ధరలు, ఊరటనిచ్చిన వెండి 

భారత్‌ వృద్ది రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంకు- జిడిపి 2022-23 లో 6.5% ఉండొచ్చని అంచనా

భారత్‌ వృద్ది రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంకు- జిడిపి 2022-23 లో 6.5% ఉండొచ్చని అంచనా

Facebook Layoffs: ఫేస్‌బుక్‌ షాక్‌! 12000 ఉద్యోగుల్ని సైలెంట్‌గా పంపిచేస్తోంది!

Facebook Layoffs: ఫేస్‌బుక్‌ షాక్‌! 12000 ఉద్యోగుల్ని సైలెంట్‌గా పంపిచేస్తోంది!

EPF interest: ఈపీఎఫ్ ఖాతాల్లో కనిపించని వడ్డీ - క్లారిటీ ఇచ్చిన ఫైనాన్స్‌ మినిస్ట్రీ!

EPF interest: ఈపీఎఫ్ ఖాతాల్లో కనిపించని వడ్డీ - క్లారిటీ ఇచ్చిన ఫైనాన్స్‌ మినిస్ట్రీ!

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Adipurush Director Om Raut : మేం ఏ తప్పూ చేయలేదు - నా రావణుడు ఇంతే!

Adipurush Director Om Raut : మేం ఏ తప్పూ చేయలేదు - నా రావణుడు ఇంతే!