By: ABP Desam | Updated at : 22 Jan 2022 04:25 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ పతనం
Cryptocurrency crash, Cryptocurrency Prices Today, 22 January 2022: క్రిప్టో మార్కెట్లు శనివారం విలవిల్లాడుతున్నాయి. పెట్టుబడుల విలువ తుడిచి పెట్టుకుపోతోంది. ఇన్వెస్టర్లు తమ డబ్బులను వెనక్కి తీసుకొనేందుకు ఎగబడుతున్నారు. శుక్రవారం 7.70 శాతం తగ్గిన బిట్‌కాయిన్ శనివారం ఏకంగా 10.43 శాతం పతనమైంది. రూ.31.45 లక్షల నుంచి రూ.29.28 లక్షలకు చేరుకుంది. మార్కెట్ విలువ రూ.55.00 లక్షల కోట్ల నుంచి రూ.49 లక్షల కోట్లకు చేరుకుంది. రెండు రోజుల్లోనే మార్కెట్ విలువ రూ.12 లక్షల కోట్ల మేర హాం.. ఫట్ అయ్యింది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ శుక్రవారం 9.49 శాతం తగ్గితే నేడు 15.79 శాతం పతనమై రూ.2,00,785 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.25.55 లక్షల కోట్ల నుంచి రూ.21 లక్షల కోట్లకు తగ్గిపోయింది.
బైనాన్స్ కాయిన్ 16.49 శాతం తగ్గి రూ.29,745, టెథెర్ 0.05 శాతం పెరిగి రూ.81.76, సొలానా 21.41 శాతం తగ్గి రూ.8,807, కర్డానో 18.66 శాతం తగ్గి రూ.84, యూఎస్‌డీ కాయిన్ 0.02 శాతం తగ్గి 82.29 వద్ద కొనసాగుతున్నాయి. పాక్స్ డాలర్, ట్రూ యూఎస్‌డీ, డైయ, టెథెర్ ఒక శాతం కన్నా తక్కువగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఠీటా నెట్‌వర్క్, గాలా, లూప్‌రింగ్, వేవ్స్, కోటి, హార్మని, ఠీటా ఫ్యూయెల్ 26 నుంచి 33 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి. మొత్తంగా అన్ని క్రిప్టోల విలువ కలిసి లక్ష కోట్ల డాలర్ల మేర ఊడ్చుకుపోయింది.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ
World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?
Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలమ్మ
Stock Market Weekly Review: గతవారం నష్టంతో పోలిస్తే రూ.10 లక్షల కోట్లు మిగిలినట్టే!
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!
Weather Updates: ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి