Gas Cylinder Price: బ్లూ సిలిండర్ ధర భారీగా తగ్గింపు, రెడ్ సిలిండర్ రేటు యథాతథం
ఈ రెండు నెలల్లోనే వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేటు 255.50 రూపాయలు తగ్గింది.
LPG Cylinder Price Reduction: ఎల్‌పీజీ సిలిండర్ ధర మరోమారు భారీగా తగ్గింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ప్రతి నెలా LPG, CNG ధరలను సవరిస్తుంటాయి. 2023 జూన్ నెల నుంచి కూడా రేట్లను మార్చాయి. దీంతో, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19.2 కేజీల LPG సిలిండర్ (Commercial LPG Cylinder) ధర రూ. 83.50 తగ్గింది. అంతకుముందు, మే 1, 2023న కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 172 తగ్గింది. దీంతో, ఈ రెండు నెలల్లోనే వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేటు 255.50 రూపాయలు తగ్గింది. రోడ్డు పక్కన టిఫిన్ బండ్లు పెట్టుకునే చిరు వ్యాపారుల నుంచి స్టార్ హోటల్ యాజమాన్యాల వరకు ఈ ప్రయోజనం అందుకుంటాయి. అయితే, ఈ ఏడాది మార్చి 1వ తేదీన, ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటును OMCలు రూ. 350.50 పెంచాయి.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ కొత్త ధరలు
వాణిజ్య సిలిండర్‌కు రూ. 83.50 తగ్గింపు తర్వాత, దేశ రాజకీయ రాజధాని దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (బ్లూ సిలిండర్) రేటు రూ. 1773 కి చేరింది. మే నెలలో ఈ ధర సిలిండర్‌కు రూ.1,856.50 గా ఉంది. జూన్ 1 నుంచి, రీప్లేస్‌మెంట్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ను దిల్లీలో రూ. 1,773కి విక్రయిస్తున్నారు.
దేశ రాజకీయ రాజధాని ముంబైలో, 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,808.50 నుంచి రూ. 1,725కి దిగి వచ్చింది. కోల్‌కతాలో రూ. 1,960.50 నుంచి రూ. 1,875.50 కి తగ్గింది. చెన్నైలో ధర రూ. 2,021.50 నుంచి రూ. 1,973 వద్దకు చేరింది.
మరో ఆసక్తికర కథనం: నేనే నం.1, ప్రపంచ కుబేరుడి కిరీటం మళ్లీ నాదే!
దేశీయ LPG ధరల పరిస్థితి ఏంటి?
వాణిజ్య సిలిండర్ ధరను తగ్గిస్తూ వచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, సామాన్యుడు నిత్యం ఉపయోగించే 16.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను (Domestic LPG Cylinder Price) మాత్రం తగ్గించలేదు. చివరిసారిగా, మార్చి నెలలో ఒక్కో సిలిండర్‌కు రూ. 50 చొప్పున రేటు పెంచాయి, ఆ తర్వాత ఇక తగ్గించలేదు.
ప్రస్తుతం, దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ (రెడ్ సిలిండర్) ధర హైదరాబాద్‌లో రూ. 1,155గా ఉంది. దిల్లీలో రూ. 1,103, ముంబైలో రూ. 1,102.5, చెన్నైలో రూ. 1,118.5, బెంగళూరులో రూ. 1,105.5, శ్రీనగర్‌లో రూ. 1,219, లెహ్‌లో రూ. 1,340, ఐజ్వాల్‌లో రూ. 1,260, భోపాల్‌లో రూ. 1,108.50, జైపుర్‌లో రూ. 1,106.50, బెంగళూరులో రూ. 1,105.50 గా ఉంది.
దేశంలోని మిగిలిన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 16.2 కేజీల దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర పట్నాలో రూ. 1,201, కన్యాకుమారిలో రూ. 1,187, అండమాన్‌లో రూ. 1,179, రాంచీలో రూ. 1,160.50, దెహ్రాదూన్‌లో రూ. 1,122, ఆగ్రాలో రూ. 1,115.5, చండీగఢ్‌లో రూ. 1,112.5, అహ్మదాబాద్‌లో రూ. 1,110, సిమ్లాలో రూ. 1,147.50, లఖ్‌నవూలో రూ. 1,140.5 చొప్పున విక్రయిస్తున్నారు. రవాణా ఛార్జీలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వల్ల ఒక్కో రాష్ట్రంలో సిలిండర్ రేట్లు ఒక్కోలా ఉంటాయి.
మరో ఆసక్తికర కథనం: దిగొచ్చిన పసిడి - బంగారం, వెండి కొత్త ధరలు ఇవి