Bank Holidays: వరుసగా 5 రోజులు బ్యాంక్‌లు బంద్, ఈ ఏడాదిలో మిగిలిన 9 రోజుల్లో 7 హాలిడేస్
రుస సెలవుల కారణంగా అసౌకర్యాన్ని ఎదుర్కోకూడదు అనుకుంటే, ఈ సెలవుల జాబితా ప్రకారం మీ బ్యాంక్ పనిని ప్లాన్ చేసుకోవాలి.
![Bank Holidays: వరుసగా 5 రోజులు బ్యాంక్‌లు బంద్, ఈ ఏడాదిలో మిగిలిన 9 రోజుల్లో 7 హాలిడేస్ Christmas 2023 Bank Holidays Bank Holidays Next Week Banks Will Remain Closed For 5 Days Next Week Bank Holidays: వరుసగా 5 రోజులు బ్యాంక్‌లు బంద్, ఈ ఏడాదిలో మిగిలిన 9 రోజుల్లో 7 హాలిడేస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/22/891a48ca8e80c2be967973dd6e181d2d1703226031067545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Christmas 2023 Bank Holidays: క్రిస్మస్ పండుగ (Christmas 2023) ఈ సంవత్సరం సోమవారం నాడు వచ్చింది. శని, ఆదివారాలకు క్రిస్మస్ హాలిడే తోడు కావడంతో బ్యాంకులకు సుదీర్ఘ సెలవులు వచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో, వారాంతం + క్రిస్మస్ వేడుకల వల్ల వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులకు హాలిడేస్ (Bank Holiday in December 2023) ఉన్నాయి. ఈ ఏడాది మిగిలి ఉన్న 9 రోజుల్లో 7 రోజులు బ్యాంకులు మూతబడి కనిపిస్తాయి.
ఇది సంవత్సరాంతం. లాకర్ కొత్త అగ్రిమెంట్ వంటి బ్యాంక్‌లోనే ముగించాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయి. మరికొన్ని పనులు కూడా బ్యాంక్‌లతో ముడిపడి ఉంటాయి. కాబట్టి, బ్యాంక్ సంబంధించి ఏ పని ఉన్నా ఈ రోజే వెళ్లి పూర్తి చేసుకోండి. ఆలస్యం అయితే అనవసరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు (Christmas state-wise bank holiday list)
నాలుగో శనివారం కారణంగా డిసెంబర్ 23న దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు. 24వ తేదీన ఆదివారం సెలవు. ఆ తర్వాత, క్రిస్మస్ సందర్భంగా సోమవారం కూడా హాలిడే. ఈ 3 రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడతాయి.
కొన్ని రాష్ట్రాల్లో, క్రిస్మస్ వేడుకల కారణంగా డిసెంబర్ 26, 27 తేదీల్లోనూ (మంగళవారం, బుధవారం) కూడా బ్యాంకులకు హాలిడేస్ ఇచ్చారు. అంటే, కొన్నిచోట్ల వరుసగా ఐదు రోజులు హాలిడేస్ వస్తాయి. ఈ వరుస సెలవుల కారణంగా అసౌకర్యాన్ని ఎదుర్కోకూడదు అనుకుంటే, ఈ సెలవుల జాబితా ప్రకారం మీ బ్యాంక్ పనిని ప్లాన్ చేసుకోవాలి.
డిసెంబర్ 23, 2023- నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 24, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు
డిసెంబర్ 25, 2023- క్రిస్మస్ కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 26, 2023- క్రిస్మస్ వేడుకల కారణంగా ఐజ్వాల్, కొహిమా, షిల్లాంగ్‌లలో బ్యాంకులు మూసివేత
డిసెంబర్ 27, 2023- క్రిస్మస్ వేడుకల కారణంగా కొహిమాలోని బ్యాంకులు పని చేయవు
డిసెంబర్ 30, 2023- యు కియాంగ్ కారణంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 31, 2023- ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు
RBI హాలిడే క్యాలెండర్ 2023 ప్రకారం.. డిసెంబరు నెలలో రాష్ట్ర అవతరణ దినోత్సవం/దేశవాళీ విశ్వాస దినోత్సవం, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్, పా-టోగన్ నెంగ్మింజా సంగ్మా, లోసోంగ్/నామ్‌సూంగ్, యు సోసో థామ్ వర్ధంతి, గోవా లిబరేషన్ డే, క్రిస్మస్, యు కియాంగ్ నంగ్బా సందర్భంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు వచ్చాయి.
బ్యాంక్ సెలవు రోజుల్లో లావాదేవీలు ఇలా చేయొచ్చు
సెలవులతో బ్యాంక్‌లు పని చేయకపోయినా ఖాతాదార్లు ఇప్పుడు పెద్దగా ఇబ్బంది పడడం లేదు. డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ATMని ఉపయోగించొచ్చు, బ్యాంక్ సెలవు రోజుల్లోనూ ATMలు 24 గంటలూ పని చేస్తాయి. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు నగదు బదిలీ చేయడానికి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లేదా UPI అందుబాటులో ఉంటుంది. ఈ సర్వీస్ కూడా 24 గంటలూ పని చేస్తుంది.
మరో ఆసక్తికర కథనం: గోల్డ్ కొనేవాళ్లకు మరో షాక్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)