అన్వేషించండి

LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!

LPG Connection:వినియోగదారులు మూడు నెలలలోపు పీఎన్జీకి మారకుంటే వారికి నోటీసులు జారీ చేసి అనంతరం ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను నిలిపివేస్తారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎల్పీజీ సరఫరాకు ఆటంకాలు.
  • పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వాడకాన్ని తప్పనిసరి చేస్తోంది ప్రభుత్వం.
  • మూడు నెలల్లో PNG కనెక్షన్ తీసుకోకపోతే LPG సరఫరా నిలిపివేత.
  • PNG వాడకంతో దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని భావిస్తున్నారు.

LPG Connection: పశ్చిమాసియాలో నెలకున్న యుద్ధం వాతావరణ కారణంగా ఎల్పీజీ సరఫరాలో ఏర్పడుతున్న ఆటంకాలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను వేగవంతం చేయడంలో భాగంగా పైపుడ్‌ నేచురల్ గ్యాస్‌(PNG) సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని గృహ వినియోగదారులు మూడు నెలల్లోగా ఆ కనెక్షన్‌కు మారాలని ఆదేశించింది. నిర్ణీత గడువులోపల పీఎన్జీకి మారని పక్షంలో ఎల్పీజీ సిలిండర్ సరఫరా పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించింది. 

గ్యాస్ సరఫరాలో మార్పులు

దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి వరకు సిలిండర్లు రూపంలో అందుతున్న ఎల్పీజీ స్థానంలో పైపుల ద్వారా నేరుగా వంటింట్లోకి వచ్చే పీఎన్జీ వాడకాన్ని ప్రోత్సహించడమే కాకుండా, దీన్ని తప్పనిసరి చేసే దిశగా అడుగులు వేస్తోంది. పైప్‌లైన్‌గ్యాస్ నెట్‌వర్క్ ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు తప్పనిసరిగా మూడు నెలల గడువులోగా పీఎన్జీ కనెక్షన‌కు మారాల్సి ఉంటుంది. 

అధికారులు సమాచారం అందించిన తర్వాత కూడా వినియోగదారులు మూడు నెలలలోపు ఈ సదుపాయాన్ని ఎంచుకోకపోతే, వారికి నోటీసులు జారీ చేసి అనంతరం ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను నిలిపివేస్తారు. దీని వల్ల భవిష్యత్‌లో నగర ప్రాంతాల్లో సిలిండర్ల వినియోగం గణనీయంగా తగ్గి, పైప్‌లై్ వ్యవస్థ ప్రధాన వనరుగా మారనుంది. 

ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?

ఈ ఆకస్మిక నిర్ణయానికి ప్రధాన కారణం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఎల్పీజీ సరఫరా గొలుసులో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎల్పీజీపీ అవసరాల కోసం దిగుమతులపై భారత్‌ ఆధారపడుతుండటంతో సరఫరాలో అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్రం పీఎన్జీ నెట్‌వర్క్‌ను వేగవంతం చేయాలని భావించింది. స్థానికంగా అందుబాటులో ఉండే నేచురల్ గ్యాస్‌ను పైప్‌లైన్ల ద్వారా పంపిణఈ చేయడం వల్ల విదేశీ దిగుమతులపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.  

అమలు ఎప్పటి నుంచి? రూల్స్ ఏంటీ?

ఈ కొత్త రూల్ తక్షణమే అమలులోకి వచ్చింది. పీఎన్జీ అందుబాటులో ఉన్న ప్రతి చోటా మరో మూడు నెలల గడువు వర్తిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపులు కూడా ఉన్నాయి. పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వడంలో ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నప్పుడు మాత్రమే ఎల్పీజీ సిలిండర్లు సరఫరా కొనసాగిస్తారు. దీని కోసం అధికారుల నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. 

పీఎన్జీ అనుమతులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్టం కింద ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం, అధికారులు నిర్ణీత కాలపరిమితిలోగా అన్ని అనుమతులు ఇవ్వాలి. ఒక వేళ వారు విఫలమైతే అనుమతులు ఇచ్చినట్టుగానే భావించి పనులు కొనసాగించవచ్చు. హౌసింగ్ సొసైటీలకు పీఎన్జీ సౌకర్యాన్ని నియంత్రించే సంస్థలు కేవలం మూడు రోజుల్లోనే అనుమతులు మంజూరు చేయాలి. అన్ని ప్రక్రియలు పూర్తి అయిన తర్వాత ఫైనల్ కనెక్షన్ కేవలం రెండు రోజుల్లో వినియోగదారుడికి అందించాలని కేంద్రం ఆదేశించింది. 

వినియోగదారులకు కలిగే ప్రయోజనం ఏంటీ?

పీఎన్జీ అనేది ఎల్పీజీతో పోలిస్తే సేఫ్‌. నిరంతరాయంగా సరఫరా అయ్యే ఇంధనం. సిలిండర్ల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. నేరుగా పైపుల ద్వారా గ్యాస్ అందుతుంది. ప్రభుత్వం  ప్రక్రియను పారదర్శకంగా ఉంచేందుకు స్థిరమైన ఛార్జీలు వసూలు చేస్తుంది. 

Frequently Asked Questions

పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో LPG కనెక్షన్ నిలిపివేయడానికి కారణం ఏమిటి?

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా LPG సరఫరాలో ఆటంకాలను అధిగమించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. PNG నెట్‌వర్క్ వాడకాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.

PNG కనెక్షన్‌కు మారడానికి వినియోగదారులకు ఎంత సమయం ఉంది?

పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని గృహ వినియోగదారులు మూడు నెలల్లోగా PNG కనెక్షన్‌కు మారాలి.

PNG కనెక్షన్‌కు మారకపోతే ఏమి జరుగుతుంది?

నిర్ణీత గడువులోగా PNGకి మారకపోతే, LPG సిలిండర్ సరఫరా పూర్తిగా నిలిపివేయబడుతుంది. వినియోగదారులకు నోటీసులు కూడా జారీ చేస్తారు.

PNG వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?

PNG అనేది LPG కంటే సురక్షితమైనది మరియు నిరంతరాయంగా సరఫరా అవుతుంది. సిలిండర్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, నేరుగా పైపుల ద్వారా గ్యాస్ అందుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget