అన్వేషించండి

Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్‌లతో నిర్మలా సీతారామన్ రికార్డు, చరిత్రలో నిలిచిపోనున్న మహిళా మంత్రి

మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా 9వ బడ్జెట్ అవుతుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Union Budget: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో కేందర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి ప్రసంగం కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో, ఆమె వరుసగా 9వ సారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డును తన ఖాతాలో వేసుకుంటారు. ఈరోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టగానే నిర్మలా సీతారామన్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. 

నిర్మలా సీతారామన్ కొత్త రికార్డు 

ఈరోజు (ఫిబ్రవరి 1న) ఆదివారం నాడు ప్రవేశపెట్టనున్న కేందర బడ్జెట్‌తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త చరిత్రను సృష్టించనున్నారు. ఆమె వరుసగా 9 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తొలి మంత్రిగా నిలవనున్నారు. అత్యధిక కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారిలోనూ ఆమెకు చోటు దక్కుతుంది. 

ఆమె మే 31, 2019న ఆర్థికమంత్రి పదవిని స్వీకరించారు. జనవరి 31, 2026 నాటికి ఆమె ఆర్థిక మంత్రిగా 6 సంవత్సరాల 8 నెలల పదవీకాలం పూర్తి చేసుకుంటారు. దేశంలోని ప్రముఖ ఆర్థిక మంత్రులలో నిర్మలమ్మ పేరు చేరుతుంది. 

వరుసగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అసాధారణ రికార్డు

నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో పాటు దేశ పార్లమెంటరీ చరిత్రలో తన పేరును లిఖించుకుంటున్నారు. ఇంతకుముందు, మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ మొత్తం 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు, తరువాత పి. చిదంబరం 9 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, వీరిలో ఎవరూ వరుసగా 9 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు. కాబట్టి, ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టగానే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రులలో ప్రత్యేకంగా నిలవనున్నారు. 

అధిక కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన రికార్డు

దేశ చరిత్రలో అత్యధిక కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారిలో సి.డి. దేశ్‌ముఖ్ పేరు వినిపిస్తుంది. ఆయన జూన్ 1, 1950 నుండి వరుసగా 6 సంవత్సరాల 2 నెలల పాటు ఈ బాధ్యతను నిర్వర్తించారు. మన్మోహన్ సింగ్ 1990 నుండి 1996 మధ్య దాదాపు 5 సంవత్సరాల పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించారు. దీనితో పాటు, ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 2008, 2012లో కొంతకాలం ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతల్ని స్వయంగా నిర్వర్తించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Vishnu Priya Bhimeneni: శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
Embed widget