Budget 2022 Positive Reactions : దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బడ్జెట్.. అభినందించిన ప్రముఖులు !
దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే బడ్జెట్‌గా పలువురు ప్రముఖులు అభినందించారు.
కేంద్ర బడ్జెట్ పవర్ ఫుల్ అని పలువురు ప్రముఖులు అభినందించారు. బడ్జెట్ అద్భుతంగా ఉందని దేశం మరింత ముందుకెళ్లడానికి ఉపయోగపడుతుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అభినందించారు. క్రిప్టో వంటి అంశాల్లో మెరుగైన విధానం తీసుకు రావడం బాగుందన్నారు.
This Budget looks at sunrise areas of growth. India needs to go green, India needs to go digital and that is what this Budget pitches for. It pushes for urbanization, clean electricity, clean mobilization, and digital rupee: NITI Aayog CEO Amitabh Kant pic.twitter.com/mkXeCVix79
— ANI (@ANI) February 1, 2022
బడ్జెట్ పరిశ్రమ వర్గాలకు విపరీతంగా నచ్చింది. ఉద్యోగాల కల్పన దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎండీ ఆశీష్ చౌహాన్ అభిప్రాయపడ్డారు.
Budget is very balanced. It boosts spending towards growth-oriented policies that create jobs, boost manufacturing, help agri-economy & infrastructure creation. In short, a mix of short-term boost & long-term structural emphasis is hallmark of this Budget: BSE MD Ashish Chauhan pic.twitter.com/1qfmbyx1xv
— ANI (@ANI) February 1, 2022
మహింద్రా గ్రూపై చైర్మన్ ఆనంద్ మహింద్రా కూడా బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు. అత్యంత ప్రభావవంతమైనదని అభినదించారు.
Brevity has always been a virtue. @nsitharaman ‘s shortest budget address may prove to be the most impactful…
— anand mahindra (@anandmahindra) February 1, 2022
భారత్‌కు సంబంధించి అన్ని రంగాల వృద్ధికి ఈ బడ్జెట్ ఊతమిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.
It's a progressive Budget. Our Govt is concentrating on infrastructure, employment generation, future development. Good allocation made for the northeast, its culture & tourism: Union Minister G Kishan Reddy#Budget2022 pic.twitter.com/oox19YedYC
— ANI (@ANI) February 1, 2022
భారత్‌ను అమృతకాలానికి తీసుకెళ్లే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినందుకు ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్ అద్భుతంగా ఉందన్నారు.