అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Budget 2023: సొంతింటి కల ఈ బడ్జెట్‌లో నెరవేరే ఛాన్స్‌, ఈసారి అంచనాలు ఇవి

ప్రస్తుత బడ్జెట్‌లో ఇలాంటి మార్పులు ప్రకటిస్తే, దేశంలోని రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని అంచనా.

Budget 2023 - House loan EMI: ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెడుతున్న పూర్తి స్థాయి చివరి బడ్జెట్ ఇదే కావడంతో దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక వేత్తల దగ్గర నుంచి సామాన్యుల వరకు, కేంద్ర పద్దు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

యూనియన్‌ బడ్జెట్‌- 2023లో, సామాన్యులకు ప్రయోజనం చేకూర్చే కొన్ని పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించవచ్చు. ముఖ్యంగా, గృహ కొనుగోలుదార్ల కోసం కొన్ని ప్రత్యేక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. బడ్జెట్ 2023 నుంచి గృహ కొనుగోలుదార్లు ఏం ఆశిస్తున్నారో, బడ్జెట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఎలాంటి బహుమతిని ఇచ్చే ఛాన్స్‌ ఉందో ఈ కథనంలో ద్వారా తెలుసుకుందాం.

రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం లేదా మొదటి సారి ఇల్లు కొనుగోలు చేయడం వంటి కార్యక్రమాల వల్ల సామాన్య జనం కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు అనేక రకాల ఛార్జీలు, పన్నులు, ఇతర చెల్లింపుల రూపంలో సేవింగ్స్‌ మొత్తం ఖాళీ అవుతాయి, అప్పులు మిగులుతాయి. ఈ నేపథ్యంలో, గృహ కొనుగోలుదార్లు బడ్జెట్‌ 2023 నుంచి గరిష్ట పన్ను మినహాయింపును డిమాండ్ చేస్తున్నారు. వాళ్లు ఆశించింది జరిగితే కొన్ని రకాల ఛార్జీల నుంచి తప్పించుకుని, తక్కువ ధరకే ఇంటిని పొందవచ్చు.

గృహ రుణం మీద EMI తగ్గే అవకాశం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, పన్ను మినహాయింపు పరిమితిని పెంచినట్లయితే ఇల్లు కొనుగోలు చేయడానికి తీసుకున్న రుణాన్ని క్లెయిమ్ చేయవచ్చు. పన్ను మినహాయింపు కారణంగా హోమ్ లోన్ EMI కూడా చౌకగా మారుతుంది. దీంతో పాటు ఇతర పన్ను రాయితీలు, GST స్లాబ్‌లో మార్పులు, పరిమితి మీద మినహాయింపు వంటి వరాలు ప్రకటిస్తే కూడా గృహ కొనుగోలుదార్ల నెత్తిన పాలు పోసినట్లు అవుతుంది, ఆర్థిక భారం చాలా తగ్గతుంది. ప్రస్తుత బడ్జెట్‌లో ఇలాంటి మార్పులు ప్రకటిస్తే, దేశంలోని రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని అంచనా.

గృహ రుణం మీద ఇప్పుడున్న పన్ను మినహాయింపు ఎంత?
ప్రస్తుతం, హౌసింగ్ లోన్ మీద గరిష్ట పన్ను మినహాయింపు పరిమితి రూ. 2 లక్షలు ఉండగా, గత కొన్ని బడ్జెట్లుగా ఈ మొత్తాన్ని మార్చకుండా యథాతథంగా కొనసాగిస్తున్నారు. అయితే, 2022 సంవత్సరంలో ద్రవ్యోల్బణం రేటు పెరిగింది. ఈ పరిస్థితుల్లో, ఈసారి గృహ రుణాల మీద పన్ను మినహాయింపు పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచి, రూ. 5 లక్షలుగా చేయవచ్చన్న అంచనాలు, ఆశలు ప్రజల్లో భారీగా కనిపిస్తున్నాయి. 

పన్ను మినహాయింపు పరిమితి పెంచితే ప్రయోజనం ఏంటి?
ఇంటి రుణం మీద పన్ను మినహాయింపు పరిమితి పెరిగితే, పన్ను చెల్లింపుదార్ల మీద ఆర్థిక భారం తగ్గుతుంది. ఫలితంగా, వ్యక్తిగత గృహ కొనుగోలుదార్ల సంఖ్య పెరుగుతుందని రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణులు, డెవలపర్లు భావిస్తున్నారు. అలాగే, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టే వ్యక్తుల సంఖ్య బాగా పెరుగుతుందని, సామాన్య ప్రజలు బడ్జెట్‌ ధరలోనే సొంత ఇంటిని పొందవచ్చని చెబుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - ఆసీస్ ముందు భారీ లక్ష్యం
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - ఆసీస్ ముందు భారీ లక్ష్యం
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులిఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - ఆసీస్ ముందు భారీ లక్ష్యం
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - ఆసీస్ ముందు భారీ లక్ష్యం
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Embed widget