(Source: ECI/ABP News/ABP Majha)
Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
బడ్జెట్‌లో క్రిప్టో అసెట్స్‌పై రాబడికి ప్రత్యేక నిర్వచనం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే ఇన్వెస్టర్లు లేదా ట్రేడర్ల రాబడిపై ఆదాయపన్ను 35 నుంచి 42 శాతం వరకు ఉండే అవకాశం ఉంది.
Budget 2022 Telugu, Union budget 2022: క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెడుతున్నారా? ట్రేడింగ్ ఏమైనా చేస్తున్నారా? అయితే మీరు భారీ స్థాయిలో జీఎస్‌టీ చెల్లించాల్సి రావొచ్చు! ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సీనియర్ పన్ను సలహాదారులను సంప్రదించిందని తెలిసింది. క్రిప్టో కరెన్సీపై వచ్చే ఆదాయాన్ని పెట్టుబడులపై ఆదాయంగా (క్యాపిటల్ గెయిన్స్) కాకుండా వ్యాపార ఆదాయంగా (బిజినెస్ ఇన్‌కం) పరిగణించేందుకు సిద్ధమైందని సమాచారం.
త్వరలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో క్రిప్టో అసెట్స్‌పై రాబడికి ప్రత్యేక నిర్వచనం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే ఇన్వెస్టర్లు లేదా ట్రేడర్ల రాబడిపై ఆదాయపన్ను 35 నుంచి 42 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. అయితే ఇది ఈక్విటీ కాకుండా కేవలం క్రిప్టో అసెట్స్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లకే వర్తించేలా మార్పులు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం సీనియర్ టాక్స్ అడ్వైజర్లను సంప్రదించిందట. క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్లు చూపించేలా ఆదాయపన్ను చట్టంలోని 26ఏ సెక్షన్ సవరించేందుకు ప్రయత్నిస్తోంది.
క్రిప్టో ఇన్వెస్టర్ల రాబడిని ఎలా లెక్కించాలో ప్రభుత్వం ప్రభుత్వం చూస్తోంది. ఎందుకంటే గతంలోనూ క్రిప్టో అసెట్లలో కొందరు భారతీయులు పెట్టుబడి పెట్టారు. గతేడాది ముందు వరకు వాటిపై రాబడి బాగానే వచ్చింది. అయితే వాటిని నగదులోకి మార్చుకోకుండా వేరే క్రిప్టోలను కొనుగోలు చేసినా పన్ను వేసేలా వ్యూహం రచిస్తోంది. రాబడిపై ఆదాయపన్నును పక్కన పెడితే చేసే ప్రతి క్రిప్టో ట్రేడ్‌పై 18 శాతం జీఎస్‌టీని వడ్డించనుంది.
కేంద్ర ప్రభుత్వం శీతకాల సమావేశాల్లోనే క్రిప్టో అసెట్ బిల్లును తీసుకొస్తుందని ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. మొదట్లో క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధిస్తున్నట్టు వదంతులు వచ్చాయి. ఆ తర్వాత కేవలం చెలామణీపై నిషేధం విధిస్తున్నట్టు, బిల్లు పేరును క్రిప్టో అసెట్‌గా మారుస్తున్నట్టు తెలిసింది. ఈ బిల్లును బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం లేదని సమాచారం. అమెరికా క్రిప్టోలపై తన విధానం ప్రకటించాక.. దానిని బట్టి బిల్లును రూపొందించాలని అనుకుంటోంది. ఇందుకు రెండు, మూడు నెలల సమయం పడుతుందని అంచనా.
Also Read: Budget 2022: దయ చూపాలమ్మా 'నిర్మలమ్మ'! బడ్జెట్‌కు ముందు వేతన జీవుల వేడుకోలు!!
Also Read: Infosys: మీది గ్రాడ్యుయేషన్ అయిందా? ఇన్ఫోసిస్ సంస్థ గుడ్‌న్యూస్, భారీగా ఉద్యోగాలు
Also Read: Doorstep Banking Services: ఇంటి వద్దకే బ్యాంకు! ఒక్క లావాదేవీకి ఎంత తీసుకుంటారో తెలుసా!
Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్ కంపెనీకి నష్టాల సెగ!!
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!