Bank Holidays: ఈ నెలలో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, హాలిడేస్ లిస్ట్ ఇదిగో
Bank Holidays In October 2024: అక్టోబర్ నెలలో బ్యాంక్‌లకు చాలా సెలవులు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్ పని ముగించుకోవడానికి, హాలిడేస్‌కు తగ్గట్లుగా ప్లాన్ చేసుకోండి.
15 Holidays To Banks in October 2024: అక్టోబర్ నెలలో స్కూళ్లు, కాలేజీలకు చాలా రోజులు దసరా సెలవులు ఉన్నాయి. విద్యార్థులకే కాదు, బ్యాంక్ ఉద్యోగులు కూడా ఈ నెలలో చాలా హాలిడేస్ ఎంజాయ్ చేయబోతున్నారు. జాతీయ & ప్రాంతీయ సెలవులు, వివిధ సందర్భాల కారణంగా మన దేశంలోని బ్యాంకులు అక్టోబర్‌లో 15 రోజుల పాటు పని చేయవు.
ఈ నెల మొదటి రోజునే ప్రారంభంలోనే జమ్ముకశ్మీర్‌లో బ్యాంక్‌లకు సెలవు ఇచ్చారు. అక్కడ ఎన్నికల కారణంగా హాలిడే వచ్చింది, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో బ్యాంక్‌లు పని చేస్తాయి. ఇది కాకుండా.. అక్టోబర్ 2న గాంధీ జయంతి, ఆ తర్వాత నవరాత్రి ఉత్సవాల ప్రారంభం, దుర్గాష్టమి, దసరా, మహర్షి వాల్మీకి జయంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, దీపావళి వంటి చాలా కారణాలతో మొత్తం 15 రోజులు బ్యాంక్‌లకు సెలవులు వచ్చాయి. అక్టోబర్ హాలిడేస్ లిస్ట్‌లో... ఆదివారాలు, రెండు & నాలుగో శనివారాలు కూడా కలిసి ఉన్నాయి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వార్షిక బ్యాంకు సెలవులు, పండుగలు, ప్రాంతీయ ఈవెంట్‌లు, జాతీయ సెలవులు మరియు సాధారణ వారాంతపు మూసివేతలకు సంబంధించిన వార్షిక జాబితాను జారీ చేస్తుంది.
అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవు రోజులు (Bank Holidays in October 2024):
2024 అక్టోబర్ 01: జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా సెలవు
2024 అక్టోబర్ 02: మహాత్మాగాంధీ జయంతి/ మహాలయ అమావాస్య
2024 అక్టోబర్ 03: శారదీయ నవరాత్రి, మహారాజా అగ్రసేన్ జయంతి -- జైపుర్‌లోని బ్యాంకులకు హాలిడే
2024 అక్టోబర్ 06: ఆదివారం సెలవు
2024 అక్టోబర్ 10: మహా సప్తమి/ దుర్గాపూజ/ దసరా -- అగర్తల, గౌహతి, కోహిమా, కోల్‌కతాలో బ్యాంక్‌లకు సెలవు
2024 అక్టోబర్ 11: దసరా (మహాష్టమి/మహానవమి)/ ఆయుధ పూజ/ దుర్గాపూజ (దసైన్)/ దుర్గ అష్టమి -- చాలా రాష్ట్రాల్లో బ్యాంక్‌లు పని చేయవు
2024 అక్టోబర్ 12: దసరా/ దసరా (మహానవమి/విజయదశమి)/ దుర్గా పూజ (దసైన్), రెండో శనివారం -- దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
2024 అక్టోబర్ 13: ఆదివారం సెలవు
2024 అక్టోబర్ 14: దుర్గా పూజ (దసైన్), దసరా -- గాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు
2024 అక్టోబర్ 16: లక్ష్మీ పూజ -- అగర్తల, కోల్‌కతాలో బ్యాంకులకు హాలిడే
2024 అక్టోబర్ 17: మహర్షి వాల్మీకి జయంతి/ కటి బిహు -- బెంగళూరు, గౌహతిలోని బ్యాంకులు మూతబడతాయి
2024 అక్టోబర్ 20- ఆదివారం సెలవు
2024 అక్టోబర్ 26: విలీన దినం (జమ్ముకశ్మీర్) & నాలుగో శనివారం సెలవు
2024 అక్టోబర్ 27: ఆదివారం సెలవు
2024 అక్టోబర్ 31: దీపావళి/ కాళీ పూజ/ నరక చతుర్దశి/ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి -- దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
బ్యాంక్‌లకు సెలవైనా మీ పని ఆగదు
సెలవుల వల్ల బ్యాంక్‌లు మూతబడినంత మాత్రాన మీ పని మాత్రం ఎక్కడా స్లో కాదు, ఆగదు. బ్యాంక్ హాలిడేస్‌లో కూడా మీరు కొన్ని రకాల బ్యాంక్ లావాదేవీలు నిర్వహించొచ్చు. డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడానికి UPI, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌ను ఉపయోగించుకోండి. క్యాష్ విత్‌డ్రా చేయాలంటే 24 గంటలూ పని చేసే ATMలు మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాయి.
మరో ఆసక్తికర కథనం: ఈ వెల్లుల్లి యమా డేంజర్, పదేళ్ల క్రితం నిషేధం - మీరు ఇదే తింటున్నారా?