Bank Holidays In February: ఫిబ్రవరిలో సగం రోజులు బ్యాంకులు బంద్ - ఈ లిస్ట్ చూడకుండా బయలుదేరితే మీ టైమ్ వేస్ట్
Bank Holidays For February 2025: బ్యాంకుల సెలవుల జాబితా మీకు తెలిస్తే, మీ ప్రాంతంలో బ్యాంకులు ఏయే రోజుల్లో పని చేయవో అర్ధమవుతుంది. మీ టైమ్ వేస్ట్ కాకుండా ఉంటుంది.

Bank Holiday In February 2025: ఈ సంవత్సరంలో రెండో నెల ఫిబ్రవరి ప్రారంభం కానుంది. మిగిలిన నెలలకు భిన్నంగా ఈ నెలలో అతి తక్కువగా 28 రోజులు మాత్రమే ఉంటాయి. అయినప్పటికీ, ఈ 28 రోజుల్లో సగం రోజులు బ్యాంక్‌లు సెలవు తీసుకుంటాయి. మన దేశంలో, బ్యాంకులను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), 2025 ఫిబ్రవరిలో ఎన్ని రోజులు బ్యాంకులు మూతబడి ఉంటాయన్న లిస్ట్‌ను విడుదల చేసింది.
ఫిబ్రవరిలో బ్యాంక్‌లకు 14 రోజులు సెలవులు
ఫిబ్రవరి నెలలో బ్యాంక్ సెలవులు 02వ తేదీ, ఆదివారంతో ప్రారంభమవుతాయి. సరస్వతి పూజ, మహా శివరాత్రి వంటి పండుగలు & ఛత్రపతి శివాజీ జయంతి, మిజోరం & అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అవతరణ దినోత్సవాలు వంటి సందర్భాలు ఈ నెలలో ఉన్నాయి, ఈ రోజుల్లో బ్యాంక్‌లకు సెలవు. రిజర్వ్ బ్యాంక్ గైడ్‌లైన్స్ ప్రకారం, దేశంలోని అన్ని షెడ్యూల్డ్ & నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు ఆదివారాలతో పాటు రెండో & నాలుగో శనివారం రోజుల్లో మూతబడతాయి.
బ్యాంక్ హాలిడేస్ లిస్ట్‌ను మీరు సేవ్ చేసుకుంటే, మీ ఏరియాలో బ్యాంకులు ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు, ఏయే రోజుల్లో పని చేయవో మీకు తెలుస్తుంది. సెలవులు పోను పని దినాలకు అనుగుణంగా మీ బ్యాంక్ పనిని పూర్తి చేసుకోవచ్చు.
బ్యాంక్ సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండవు, ప్రాంతాన్ని బట్టి సెలవులు మారతాయి.
తేదీ & రాష్ట్రం వారీగా ఫిబ్రవరి 2025లో బ్యాంక్ సెలవుల జాబితా:
ఫిబ్రవరి 02, ఆదివారం - బ్యాంకులకు ఆదివారం వారం సెలవు
ఫిబ్రవరి 03, సోమవారం - సరస్వతి పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు పని చేయవు
ఫిబ్రవరి 08, శనివారం - రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు హాలిడే
ఫిబ్రవరి 09, ఆదివారం - బ్యాంకులకు ఆదివారం వారం సెలవు
ఫిబ్రవరి 11, మంగళవారం - థాయ్ పూసం సందర్భంగా చెన్నైలో బ్యాంకులు మూతబడతాయి
ఫిబ్రవరి 12, బుధవారం - శ్రీ రవిదాస్ జయంతి సందర్భంగా సిమ్లాలో బ్యాంకులకు హాలిడే
ఫిబ్రవరి 15, శనివారం - ఇంఫాల్‌లో Lui-Ngai-Ni సందర్భంగా బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 16, ఆదివారం - బ్యాంకులకు ఆదివారం వారం సెలవు
ఫిబ్రవరి 19, బుధవారం - ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బేలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌లో బ్యాంకులకు హాలిడే
ఫిబ్రవరి 20, గురువారం - మిజోరం & అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అవతరణ దినోత్సవాల సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంక్‌లు మూతబడతాయి
ఫిబ్రవరి 22, శనివారం - నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు హాలిడే
ఫిబ్రవరి 23, ఆదివారం - బ్యాంకులకు ఆదివారం వారం సెలవు
ఫిబ్రవరి 26, బుధవారం - మహా శివరాత్రి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు
ఫిబ్రవరి 28, శుక్రవారం - లోసార్ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు సెలవులో ఉంటాయి
సెలవుల సమయంలో బ్యాంకింగ్ సేవలు
బ్యాంక్‌లు హాలిడేస్ తీసుకున్నప్పటికీ, ఇప్పుడున్న టెక్నాలజీ కారణంగా చాలా బ్యాంకింగ్ సేవలు ఆగవు. UPI, IMPS, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ ఛానెల్‌ల ద్వారా ప్రజలు 24 గంటలూ ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ATMల ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు, ఇవి 24 గంటలూ పని చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఎక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది?





















