News
News
వీడియోలు ఆటలు
X

Vedanta: డబ్బు కోసం వేదాంత పడుతున్న పాట్లు వర్ణనాతీతం, RBI అనుమతి కోసం విజ్ఞప్తి

విదేశీ అనుబంధ సంస్థల్లో ఒక దాని ద్వారా ఈ గ్రూప్‌ 1 బిలియన్ డాలర్ల రుణాన్ని సేకరించబోతోంది.

FOLLOW US: 
Share:

Anil Agarwal-led Vedanta: మెటల్స్ & మైనింగ్ రంగ దిగ్గజం వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ (Vedanta Resources Ltd) ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్న సంగతి తెలిసిందే. భారీ మొత్తంలో రుణ వాయిదాలను ఈ సంస్థ తిరిగి చెల్లించాల్సిన పరిస్థితిలో ఉంది. కానీ చేతిలో ఉన్న డబ్బు ఏ మూలకూ సరిపోదు. రుణ వాయిదాలను చెల్లించడానికి వివిధ మార్గాల్లో డబ్బు సేకరించే ప్రతిపాదనలను ఈ కంపెనీ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో, వేదాంత రిసోర్సెస్ ఇండియన్‌ యూనిట్ అయిన వేదాంత లిమిటెడ్ (Vedanta Ltd), రిజర్వ్ బ్యాంక్ నుంచి ఒక అనుమతిని కోరింది.

కంపెనీ ప్లాన్‌ ఇది
మార్కెట్‌ వర్గాల సమాచారం ప్రకారం... వేదాంత గ్రూప్‌లోని విదేశీ అనుబంధ సంస్థల్లో ఒక దాని ద్వారా ఈ గ్రూప్‌ 1 బిలియన్ డాలర్ల రుణాన్ని సేకరించబోతోంది. ఆ రుణానికి హామీ ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి వేదాంత లిమిటెడ్ (VDL) అనుమతిని కోరింది. ఈ విధంగా సేకరించిన నిధులు డివిడెండ్ చెల్లింపుల రూపంలో వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్‌కు (VRL) పంపుతారని చెప్పుకుంటున్నారు.

మారిషస్‌ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న VDL పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ అయిన THL జింక్ వెంచర్స్ (THL Zinc Ventures) ద్వారా రుణాన్ని సమీకరించడం జరగవచ్చు. 1 బిలియన్ డాలర్ల రుణం కోసం JP మోర్గాన్, బార్క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్, డ్యుయిష్ బ్యాంక్‌తో వేదాంత గ్రూప్ చర్చలు జరుపుతోందని సమాచారం. ప్రతిపాదిత రుణాన్ని ఇవ్వడానికి ఆయా బ్యాంక్‌లు సిద్ధపడినా, వడ్డీ రేటు వద్ద ప్రతిష్టంబన నెలకొంది, ఆ పాయింట్‌ నుంచి చర్చలు ముందుకు సాగడం లేదు.

మరో మూడు నెలల్లో చాలా డబ్బు అవసరం
వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ప్రస్తుతం తీవ్రమైన రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2023 జూన్ చివరి నాటికి ఈ కంపెనీ సుమారు 2 బిలియన్‌ డాలర్లను రుణ వాయిదాల రూపంలో చెల్లించాలి. ఈ ఏడాది మార్చి వరకు కట్టాల్సిన అన్ని రుణాలను చెల్లించినట్లు వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ఇటీవల వెల్లడించింది. జూన్ త్రైమాసికం చివరి నాటికి అన్ని చెల్లింపులు పూర్తి చేస్తామని కూడా ఈ కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది.

కంపెనీ చైర్మన్ అనిల్ అగర్వాల్ (Vedanta Chairman Anil Agarwal) కూడా, రుణ వాయిదాలను చెల్లిస్తామన్న విశ్వాసాన్ని ఇటీవలి ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. ఇది టీ కప్పులో తుపాను లాంటి సమస్య అంటూ కొట్టిపారేశారు. వేదాంతకు డబ్బు ఇవ్వాలని చాలామంది ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అయితే, ఏ బ్యాంకు లేదా ఫండ్ పేరునూ ఆయన ప్రస్తావించలేదు.

వాటా విక్రయించే ఆలోచన లేదట
రుణాన్ని తిరిగి చెల్లించడానికి వాటాలను విక్రయించే అవకాశాలను వేదాంత పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. భారతదేశంలోని లిస్టెడ్ కంపెనీ వేదాంత లిమిటెడ్‌లో 10 శాతం వాటాను వ్యూహాత్మకంగా విక్రయించడానికి వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ పెట్టుబడిదార్లను సంప్రదిస్తోందని ఆ వార్తల సారాంశం. అయితే, వాటా విక్రయ వార్తలను వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ఖండించింది. అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేసింది.

శుక్రవారం (24 మార్చి 2023), 0.59% నష్టంతో రూ. 269.75 వద్ద వేదాంత షేర్‌ ధర ముగిసింది. గత 6 నెలల కాలంలో ఈ స్టాక్‌ కేవలం 2% లాభపడింది. గత ఏడాది కాలంలో 34% పతనమైంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 25 Mar 2023 03:17 PM (IST) Tags: Vedanta Anil Agarwal Vedanta Debt Repayment

సంబంధిత కథనాలు

Aakash IPO: బైజూస్‌ ఆకాశ్‌ ఐపీవో తేదీ మార్పు! వచ్చే ఏడాదికి మార్చిన బోర్డు!

Aakash IPO: బైజూస్‌ ఆకాశ్‌ ఐపీవో తేదీ మార్పు! వచ్చే ఏడాదికి మార్చిన బోర్డు!

Stock Market News: బుల్‌రన్‌ కంటిన్యూ! 18,600 వద్ద క్లోజైన నిఫ్టీ!

Stock Market News: బుల్‌రన్‌ కంటిన్యూ! 18,600 వద్ద క్లోజైన నిఫ్టీ!

Banking Services Unavailable: హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌! జూన్‌లో కొన్ని రోజులు ఈ సేవలు బంద్‌!

Banking Services Unavailable: హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌! జూన్‌లో కొన్ని రోజులు ఈ సేవలు బంద్‌!

Byjus Loan Default: బైజూస్‌కు షాక్‌! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్‌ ఎగ్గొట్టినట్టే!

Byjus Loan Default: బైజూస్‌కు షాక్‌! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్‌ ఎగ్గొట్టినట్టే!

Stock Market News: మార్కెట్లో బుల్‌ రన్‌! 18,614 మీదే కొనసాగుతున్న నిఫ్టీ!

Stock Market News: మార్కెట్లో బుల్‌ రన్‌! 18,614 మీదే కొనసాగుతున్న నిఫ్టీ!

టాప్ స్టోరీస్

Telangana: 9 ఏండ్ల‌ల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ‌, లెక్కలు బయటపెట్టిన మంత్రి ఎర్రబెల్లి

Telangana: 9 ఏండ్ల‌ల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ‌, లెక్కలు బయటపెట్టిన మంత్రి ఎర్రబెల్లి

Vijayashanthi: విజయశాంతి బీజేపీని వీడతారంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన రాములమ్మ

Vijayashanthi: విజయశాంతి బీజేపీని వీడతారంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన రాములమ్మ

కియరా అద్వానీ 'సత్యప్రేమ్ కి కథ' ట్రైలర్: ఇన్‌స్టాలో ఫాలోవర్లే లేని వీడికి పిల్లని ఎవరిస్తారు?

కియరా అద్వానీ 'సత్యప్రేమ్ కి కథ' ట్రైలర్: ఇన్‌స్టాలో ఫాలోవర్లే లేని వీడికి పిల్లని ఎవరిస్తారు?

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో ఏపీ వారంతా సేఫ్‌- ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది 8 మంది: మంత్రి అమర్‌నాథ్‌

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో ఏపీ వారంతా సేఫ్‌- ఆసుపత్రిలో చికిత్స  తీసుకుంటుంది 8 మంది: మంత్రి అమర్‌నాథ్‌