అన్వేషించండి

Paytm Shares: పేటీఎం ర్యాలీకి అలీబాబా అడ్డుపుల్ల, మొత్తం వాటాకు మంగళం

చైనీస్ బహుళ జాతి కంపెనీ అలీబాబా తన మొత్తం వాటాను విక్రయించిందని ANI రిపోర్ట్‌ చేసింది.

Alibaba Group - Paytm: మార్కెట్‌ వర్గాల సమాచారం ప్రకారం.. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ (Alibaba Group) Paytm నుంచి పూర్తిగా తప్పుకుంది, తన వద్ద ఉన్న మొత్తం పేటీఎం షేర్లను ఇవాళ (శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023) అమ్మేసింది. పేటీఎం ప్రారంభ పెట్టుబడిదార్లలో అలీబాబా గ్రూప్ ఒకటి. పేటీఎంలో వాటాను సున్నాకి తీసుకురావడానికి, ఈ ఫిన్‌టెక్ సంస్థలో తనకు మిగిలిన 3.4% వాటాను బ్లాక్‌ డీల్‌ ద్వారా ఇవాళ విక్రయించినట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Paytm మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌లోని (One97 Communications‌) 3.4% స్టేక్‌ లేదా 2.1 కోట్ల షేర్లు బ్లాక్ డీల్‌ ద్వారా ఈ రోజు చేతులు మారాయని, చైనీస్ బహుళ జాతి కంపెనీ అలీబాబా తన మొత్తం వాటాను విక్రయించిందని ANI రిపోర్ట్‌ చేసింది. 

2022 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి Paytmలో అలీబాబా గ్రూప్‌నకు 6.26% వాటా ఉండగా, జనవరిలో ఓపెన్ మార్కెట్ మార్గంలో దాదాపు 3% ఈక్విటీని విక్రయించింది. మిగిలిన వాటాకు ఇవాళ మంగళం పాడింది.

ఇవాళ 9% పతనం
ఇవాళ పేటీఎం షేర్‌ ధర దాదాపు 9% పడిపోయింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి 7.35% నష్టంతో రూ. 654 వద్ద ఉంది.

మన దేశంలోని లిస్టెడ్ న్యూ ఏజ్ టెక్నాలజీ కంపెనీల షేర్‌ ధరలు భారీగా పడిపోతుండడంతో, వాటిలోని తన వాటాలను అలీబాబా ఆఫ్‌లోడ్ చేస్తూ వస్తోంది. ఈ చైనీస్ సంస్థ, నవంబర్‌లో, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటోలోనూ 3% వాటాను ఆఫ్‌లోడ్ చేసింది.

పేటీఎం Q3 నికర నష్టం ఏడాది క్రితం నాటి రూ. 779 కోట్ల నుంచి రూ. 392 కోట్లకు తగ్గింది. కంపెనీ వృద్ధిపై పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ప్రకటన పెట్టుబడిదార్లలో ఉత్సాహం నింపింది, షేర్‌ ధరలో ర్యాలీని తెచ్చింది. డిసెంబరు త్రైమాసికంలో ఆపరేటింగ్ ప్రాఫిట్‌ ప్రకటించిన పేటీఎం, గత కొన్ని రోజులుగా బెలూన్‌లా ఉబ్బిపోతోంది. దానిని అలీబాబా ఇవాళ పంక్చర్ చేసింది.

గత నెలలో రూ. 850 కోట్ల షేర్ బైబ్యాక్ కార్యక్రమాన్ని Paytm ప్రకటించింది. దాని IPO ఇష్యూ ధర రూ. 2,150 నుంచి ఇప్పటి వరకు దాదాపు 70% క్షీణించింది. అయితే, గత ఐదు రోజుల్లో ఈ స్టాక్ దాదాపు 19% పెరిగింది.

పేటీఎంకు బయ్‌ రేటింగ్స్‌
Paytmను కవర్‌ చేస్తున్న 11 మంది ఎనలిస్ట్‌ల్లో 8 మంది "బయ్‌" సిఫార్సులు చేశారు. వాళ్లు ఇచ్చిన సగటు టార్గెట్ ధర రూ. 915. ఇది, ప్రస్తుత స్థాయి నుంచి 34% పైగా పెరుగుదల అవకాశాన్ని సూచిస్తోంది. 

Paytm ఔట్‌లుక్‌ మీద ఎప్పుడూ కఠినంగా ఉన్న బ్రోకింగ్‌ హౌస్‌ Macquarieను కూడా ఈ న్యూ ఏజ్‌ కంపెనీ త్రైమాసిక ఆదాయాలు ఆకట్టుకున్నాయి. ఈ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ పేటీఎం స్టాక్‌కు డబుల్ అప్‌గ్రేడ్ ఇచ్చింది, టార్గెట్ ధరను 80% పెంచి రూ. 800కు చేర్చింది.

ఇతర గ్లోబల్ బ్రోకరేజ్‌లలో, గోల్డ్‌మన్ సాచ్స్ రూ. 1,150 - సిటీ రూ. 1,061 - బోఫా సెక్యూరిటీస్ రూ. 730 ప్రైస్‌ టార్గెట్లు ఇచ్చాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget