Aha Nenu Super Women: 3rd వీక్ రూ.90 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్న ఏంజెల్స్! సూపర్ విమెన్ హ్యాపీ హ్యాపీ!
Aha Nenu Super Women: మంచి వ్యాపార ఆలోచనతో ముందుకొచ్చిన మహిళలకు అండగా నిలుస్తోంది ఆహా నేను సూపర్ విమెన్. ఏంజెల్స్ కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతున్నారు.
Aha Nenu Super Women:
ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది! మనందరికీ ఎప్పట్నుంచో తెలిసిన పంచ్ డైలాగ్ ఇది! ఆలోచనలు అందరికీ వస్తాయి. వాటిని కార్యరూపంలోకి తీసుకొచ్చి వ్యాపార అవకాశంగా మలిచేది కొందరే! అలాంటి వారికి సరికొత్త దారిని చూపిస్తోంది ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వస్తున్న 'ఆహా, నేను సూపర్ ఉమెన్' ప్రోగ్రామ్! చక్కని ఆలోచనలతో వచ్చిన మహిళలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వ్యాపారులు అండగా నిలుస్తున్నారు.
బిజినెస్ ఒక్కటే కాదు సార్ ఈ 'షో' అంటే!
— ahavideoin (@ahavideoIN) August 1, 2023
మీ మనసును కరిగించే ఎన్నో మూమెంట్స్ ఉన్నాయ్👉
"Episodes that Warm Your Heart This Week!" Watch Episode 5&6 Promo▶https://t.co/E8KjD0cT0C#NenuSuperWoman streaming only on aha..
Every Fri & Sat @ 7pm@renukabodla #Karanbajaj #sindhuranarayana… pic.twitter.com/OGvnr2SiUB
రెండు వారాల క్రితం మొదలైన ఈ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని ఆలోచనలు కార్యరూపం దాల్చబోతున్నాయి. మొదటి రెండు వారాల్లో ఏంజెల్స్ మొత్తం రూ.3 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అమ్మమ్మాస్, జితారా, భయోరస్ ఫార్మా, టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్స్, డాగీ విల్లే లాంటి కంపెనీల్లో పెట్టుబడి పెడుతున్నారు. దాంతో మూడో వారంలో ఏం జరుగుతుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈసారి రూ.90 లక్షలు పెట్టుబడిగా పెట్టడంతో పాటు మెంటార్‌షిప్‌ను అందించబోతున్నారు. ఎవరికి ఇన్వెస్ట్మెంట్ దక్కింది, ఎవరు ఎవరి మెంటార్షిప్ అందుకోబోతున్నారో తెలుసుకోవాలంటే ఆగస్టు 4, 5 రాత్రి 7 గంటలకు ఆహాలో 'నేను సూపర్ వుమన్' షో తప్పక చూడాల్సిందే!
Tummy Foods..!🍲
— ahavideoin (@ahavideoIN) August 1, 2023
In the contemporary market, a perfect business idea!!💯#NenuSuperWoman streaming now only on aha💁🏻♀
▶https://t.co/Cb1iy8ArrG
Every Fri & Sat @ 7pm @renukabodla @sridhargadhi #sindhuranarayana @sudhakar_chirra @chennamaneni #deepadodla @Sreeram_singer… pic.twitter.com/DeIBYX3hoa
ఆహా నేను సూపర్ ఉమెన్’- ఇది మహిళల బిజినెస్ డ్రీమ్స్‌కి డోర్ బెల్. ఈ షోల భాగంగా ఈ స్టేజ్ మీదకి మహిళలు వచ్చి వాళ్ల బిజినెస్ ఐడియాలను ప్రెజెంట్ చేస్తారు. వాళ్ల ఐడియాలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ల బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఏంజెల్స్ ఉంటారు. అయితే ఈ ఆహా షోలో ఏంజెల్స్‌గా హేమాహేమీలే వచ్చారు. సింధూర నారాయణ (నారాయణ గ్రూప్ డైరెక్టర్), శ్రీధర్ గాధి (క్వాంటెలా ఐఎన్‌సీ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్), దీప దొడ్ల (దొడ్ల డెయిరీ ప్రమోటర్), సుధాకర్ రెడ్డి (అభి బస్ ఫౌండర్, ఫ్రెష్ బస్- ఫౌండర్, సీఈఓ), రేణుక బొడ్ల (సిల్వర్ నీడిల్ వెంచర్స్- వెంచర్ పార్ట్‌నర్), రోహిత్ చెన్నమనేని (డార్విన్ బాక్స్ కో-ఫౌండర్), కరణ్ బజాజ్ (ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా) వంటి వారు మహిళలకు అండగా ఉంటున్నారు.
After a week of gloomy skies, the sun is finally out 🌞
— ahavideoin (@ahavideoIN) August 1, 2023
Enjoy the sunny side up 😉 with #NenuSuperWoman pic.twitter.com/BMnb0tu7Fy