అన్వేషించండి

Aadhaar Pan: డబ్బులు కురిపిస్తున్న పాన్‌-ఆధార్‌, ఇప్పటివరకు రూ.600 కోట్ల పైగా వసూళ్లు

2023 జులై 01 నుంచి, ఆధార్‌ - పాన్‌ లింక్‌ చేయాలంటే రూ.1,000 అపరాధ రుసుము చెల్లించాలి.

Aadhaar Pan Linking: మన దేశంలో మెజారిటీ ప్రజలకు ఆధార్‌ కార్డ్‌లు ఉన్నాయి. భారతదేశంలో, ప్రజల వ్యక్తిగత గుర్తింపుగా మొదట అడుగుతోంది ఆధార్‌ కార్డ్‌నే. చదువు, ఉద్యోగం సహా పుట్టిన నాటి నుంచి మరణించే వరకు దీనితో చాలా పని ఉంది. బీమా వంటి విషయాల్లో, మరణించిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఆధార్‌ కార్డ్‌ కుటుంబ సభ్యులకు అవసరమవుతుంది. 

భారత ప్రజలకు పాన్‌ కార్డ్‌ కూడా చాలా కీలకం. వ్యాపారం, స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు, ఆదాయ పన్ను పత్రాలు (ITR) సమర్పించడం వంటి ఆర్థిక సంబంధిత వ్యవహారాలకు ఇది తప్పనిసరి.

పాన్‌ ఉన్న ప్రతి వ్యక్తి, ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం, పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలం క్రితమే ఆదేశించింది. ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ కార్డ్‌ - పాన్‌ అనుసంధానం గడువును పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది. చివరకు 2023 జూన్‌ 30తో ఆ గడువు ముగిసింది. ఈ గడువులోగా లింక్‌ పూర్తి చేయని పాన్‌ కార్డ్‌లు డీయాక్టివేట్‌ అయ్యాయి. 

2023 జులై 01 నుంచి, ఆధార్‌ - పాన్‌ లింక్‌ చేయాలంటే రూ.1,000 అపరాధ రుసుము (Aadhaar - PAN linking penalty) చెల్లించాలి. 

కేంద్ర సర్కారు ఖజానా నింపుతున్న పాన్‌-ఆధార్‌ అనుసంధానం
2023 జులై 01 నుంచి, ఆధార్‌ - పాన్‌ లింక్‌ చేసుకుంటున్న ప్రజల నుంచి పెనాల్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి భారీగా డబ్బులు వచ్చి పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 60 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఆధార్-పాన్ లింక్ కోసం పెనాల్టీ చెల్లించారు. ఈ విధంగా కేంద్ర ఖజానాలోకి రూ. 601.97 కోట్లు వచ్చి చేరాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిత్వ పంకజ్ చౌదరి, సోమవారం, లోక్‌సభలో ఈ విషయాన్ని లిఖితపూర్వక సమాధానం రూపంలో వెల్లడించారు.
శాఖ సోమవారం పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చింది.

మన దేశంలో, 2024 జనవరి 29 నాటికి, ఇంకా 11.48 కోట్ల పాన్‌కార్డులు (మినహాయింపు వర్గాలు కాకుండా) ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పష్టం చేశారు. 

ఆధార్‌-పాన్ లింక్ చేయడం ఎలా? ‍‌(How to link Aadhaar - Pan?)
1. పాన్‌ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి, ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ https://incometaxindiaefiling.gov.in/ లోకి వెళ్లాలి.
2. వెబ్‌సైట్‌లో మీరు ఇంకా రిజిస్టర్‌ చేసుకోనట్లయితే, ముందుగా రిజిస్టర్‌ చేసుకోండి. ఇక్కడ, యూజర్‌ ఐడీగా మీ పాన్‌ నంబర్‌ను మాత్రమే ఇవ్వాలి.
3. మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్ అవ్వండి.
4. ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'లింక్ ఆధార్‌'పై క్లిక్ చేయండి.
5. మీ పుట్టిన తేదీ, జెండర్‌ వివరాలను ఇప్పుడు నమోదు చేయాలి.
6. మీ మిగిలిన వివరాలను ఆధార్‌తో సరిపోల్చుకోండి. అన్నీ సరిగ్గా ఉంటే, కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
7. పెనాల్టీగా రూ. 1,000 చెల్లించడం ద్వారా మీ పాన్‌ - ఆధార్‌ను లింక్ చేయవచ్చు.
8. పాన్ - ఆధార్ లింక్ అయిన వెంటనే మీ మొబైల్ నంబర్‌కు, ఈ-మెయిల్ ఐడీకి మెసేజ్ వస్తుంది.

మరో ఆసక్తికర కథనం: వడ్డీ రేట్లు ఈసారి కూడా మారకపోవచ్చు, ఎప్పట్నుంచి తగ్గుతాయంటే?

టాప్ హెడ్ లైన్స్

Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Embed widget