అన్వేషించండి

Sadhguru On Technology: భవిష్యత్తులో రాబోయే సాంకేతికత మనకు వరమా, శాపమా?

Sadhguru On Technology: 

భవిష్యత్తులో రాబోయే సాంకేతికత మానవ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయం మీద ఈ వ్యాసంలో సద్గురు తన ఆలోచనలను పంచుకుంటున్నారు. 
సద్గురు: ప్రస్తుత మానవ సమాజంలో 90 శాతానికి పైగా ప్రజలు శారీరిక, మేధో సామర్ధ్యాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. కానీ మీరు చేయగలిగిన ప్రతిపనినీ భవిష్యత్తులో ఒక యంత్రం చేయగలుగుతుంది. జ్ఞాపకశక్తిని నిల్వచేసే ఏ పనైనా, జ్ఞాపకశక్తికి అందుబాటులో ఉన్న, జ్ఞాపకశక్తికి సారాంశమైనా, జ్ఞాపకశక్తిని వ్యక్తీకరించటమైనా, మీ తెలివితేటల ద్వారా మీరు చేసే ప్రతిదీ, మీరే చేస్తున్నారని అనుకున్న ప్రతీది, ఒకనాటికి యంత్రాల ద్వారా జరుగుతాయి. ఒకసారి యంత్రాలు ఇలా చేయటం మొదలుపెట్టాక, మీరెవరనే లోతయిన పార్శ్వాలను అన్వేషించటం తప్పనిసరి అవుతుంది. అది అద్భుతమైన రోజు, ఎందుకంటే దీని అర్ధం మనకి సెలవురోజు అని. అప్పుడు మనం బతుకుతెరువు కోసం పని చేయనక్కరలేదు. మన జీవితాన్ని పూర్తిగా భిన్నమైన దృష్టితో చూడగలుగుతాము.
జ్ఞాపక శక్తికి మించిన పార్శ్వం
మీ శరీరం, మీ మనస్సు అని అనుకుంటున్నది కొన్ని జ్ఞాపకాల సముదాయం. మీరు మీరుగా తయారుకావటానికి జ్ఞాపకశక్తియే పూర్తిగా కారణం. ఉదాహరణకు ఒక పురుషుడు ఒక రొట్టెముక్క తింటే ఆ రొట్టె పురుషునిగా మారుతోంది. ఒక స్త్రీ దానిని తింటే అది స్త్రీగా మారుతుంది. ఒక కుక్క అదే రొట్టెను తింటే అది కుక్కగా మారిపోతుంది. అదంతా రొట్టె గొప్పతనం కాదు. వ్యవస్థ కలిగివుండే జ్ఞాపక విధానమే, అదే రొట్టెను మనిషిగా, స్త్రీగా, లేదా కుక్కగా మారుస్తుంది.
మీ శరీర నిర్మాణమే ఈ జ్ఞాపకాలతో కూడి ఉన్న ఒక రకమైన పార్శ్వం. జ్ఞాపకాలు హద్దుల్ని కూడా నిర్వచిస్తాయి. కానీ మేధస్సుకు "చిత్త " అనే పార్శ్వం ఉంది , దీనినే ఆధునిక భాషలో సరళంగా చైతన్యం (Consciousness) అనవచ్చు. ఈ మేధో పరిమాణానికి జ్ఞ్యాపకం (స్మృతి) ఉండదు. జ్ఞాపకం లేనిచోట సరిహద్దులు కూడా ఉండవు.
మానవ మేధస్సు (Intelligence) ఒక ద్వీపంలాంటిది. టెక్నాలజీతో సహా మనిషి మేధో ఉత్పత్తులన్నీ చిన్న చిన్న ద్వీపాలు. చైతన్యం అనే మహాసముద్రంలోనే మన ఉనికి ఉంది. చైతన్యం అనేది ఒక మేధస్సు, ఇది ఏ జ్ఞాపకంతో గానీ లేదా నువ్వు నేను అనే పరిమితులతోగానీ, ఇది లేదా అది అని గానీ గుర్తించబడదు. ఇది మేథస్సుయొక్క సరిహద్దులులేని పార్శ్వం. మన సాంకేతిక సామర్ధ్యం పెరుగుతున్నకొద్దీ, మనం మానవజాతిని వాళ్ళ మేధో పరిమితులకు మించి మనలోనే ఉన్న జీవిత మూల వనరయిన మేధోపరిమాణం లోతుల దాకా ఎదగడానికి ప్రయత్నించాలి.
చైతన్యం కోసం మౌలిక వ్యవస్థ..
ఏదైనా జరగాల్సి ఉంటే కొంత నిర్దిష్టమైన మానవ శక్తి, కాలం, వనరులు దానికి ఉపయోగించాలి. అందువల్ల మనం ఈ చైతన్యం కోసం కోసం పెట్టుబడి పెట్టాలి. ఇప్పటివరకు మనం మన మనుగడకోసమే పెట్టుబడి పెడుతూ వచ్చాము. కానీ ఒకసారి ఈ టెక్నాలజీ వాస్తవాలుగా మారటం మొదలైనప్పుడు, మనుగడ అసలు సమస్యే కాదు. మనుగడ సమస్య కానప్పుడు, మనం ఖచ్చితంగా పెట్టుబడి మొదలుపెడతాము. త్వరగా ఇందులో పెట్టుబడి పెట్టగలిగితే కొత్త టెక్నాలజీ అందించే అవకాశాల ద్వారా వచ్చే అస్పష్టత తక్కువగా ఉంటుంది.
సాంకేతికత అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. దానిని ఏ విధంగా వాడుకుంటామనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీ గుర్తింపు, అనుభవం చాలా ప్రత్యేకమైనది కావచ్చు, లేదా మీ గుర్తింపు, అనుభవం చాలా కలుపుకొనిపోయేది కావచ్చు, కత్తి అందుకు తగ్గట్టుగా తిరుగుతుంది. మానవసమాజం పెద్ద ఎత్తున చైతన్యంతో వ్యక్తమవడానికి మనము చేయవలసినది ఏమిటి? ప్రతి తరంలో, చాలా చైతన్యం ఉన్నవాళ్లు ఉంటూ వచ్చారు. కానీ కొన్ని తరాలలో, కొన్ని సమాజాలలో, వాళ్ళ గురించి విన్నాం. ఇతర సమాజాలలో వాళ్ళను నిర్లక్ష్యం చేశారు. పరిమాణాలులేని, పరిధులులేని చైతన్యాన్ని, అర్ధంచేసుకుని, అందుబాటులోకి తేవటానికి ఉపయోగపడే పద్ధతులని మనం అందచేయాల్సిన సమయం వచ్చింది.
అంతర్గత శ్రేయస్సుకు సాంకేతికత..
మన బాహ్య ప్రపంచ శ్రేయస్సును సృష్టించటానికి సాంకేతికత ఉన్నట్లే, మన అంతర్గత శ్రేయస్సుకోసం కూడా సైన్స్, సాంకేతికతలు ఉన్నాయి. ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, ఎలా ఉండాలో మీకు తెలియకపోతే, మీరు బాగా లేనట్టే. మానవ చరిత్రలో ఏ తరాలకూ ఎన్నడూ తెలియనంత సౌకర్యాలు, సౌలభ్యాలు మనకి ఉన్నాయి. కానీ మనం చాలా ఆనందకరమైన అద్భుతమైన తరం అని అనుకోగలమా? లేదు! మనుషులు మానసికంగా బలహీనులౌతున్నారు. మనం ఇతర తరాలకన్నా అధ్వాన్నమని నేనటంలేదు. కానీ, మనకు కావలసినవి మనం సమకూర్చుకోవటానికి భూమిపై ఉన్న ఇతర ప్రతి జీవికి హాని కలిగించి కూడా, మనం వేరే తరాల కంటే గొప్పగా ఏమీలేము.
ఈ సాంకేతికత సౌకర్యాలను, సౌలభ్యాలను తెస్తుంది కానీ శ్రేయస్సు కాదు. అంతర్గత శ్రేయస్సు గురించి దృష్టి సారించాల్సిన సమయం ఇది. ఇప్పటివరకు, మీ శ్రేయస్సు అనేది మీ చుట్టూ ఏమున్నదనే దాని మీద నిర్ణయించనున్నారు, కానీ మీలో ఏముందనే దానిమీద కాదు.
ఒకవేళ మీ శరీరం ఇంకా మెదడు మీనుండి ఆదేశాలు తీసుకుంటే, మీ జీవితంలోని ప్రతిక్షణం మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుకుంటారుకదా? మీకు ఆ అవకాశం ఉంటే, తప్పనిసరిగా మీరు అలా ఉంటారు. మీరు ప్రతి క్షణం ఆనందంగా ఉండటం లేదంటే, మీ శరీరం ఇంకా మెదడు మీనుండి ఆదేశాలు తీసుకోవటం లేదన్నది స్పష్టం. అంటే మీరు తగినంత ఎరుకతో లేరని దీని అర్ధం.
అందువలన మనం ఆ దిశలో పెట్టుబడి పెట్టాలి. మన నగరాలలో, ఆసుపత్రులు, స్కూళ్లు, మరుగుదొడ్లు అన్నీ ఉన్నాయి. కానీ ప్రజలు ధ్యానం చేసుకోవటానికి ఒక చోటు ఉందా? సాంకేతికత ఇప్పుడు మీరు చేస్తున్న చాలా పనులు చేయటం మొదలుపెడితే, అప్పుడు మీరెందుకు జీవించిఉన్నారో మీకు తెలీదు, అప్పుడు అంతర్గతంగా హాయిగా ఉండటం యొక్క అవసరం బలం పుంజుకుంటుంది. అందువలన మనం ఆరోజుకు సిద్ధంగా ఉండాలనుకుంటే, మనం ఎవరనే అంతర్గత కీలకం మీద దృష్టి ప్రసరింపగలిగే భౌతిక సదుపాయాల మీద, మానవ వ్యవస్థాపనల మీదపెట్టుబడి పెట్టాలి.

[ఈ వెబ్‌సైట్‌లో వివిధ రచయితలు, ఫోరమ్ భాగస్వాములు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, నమ్మకాలు వారి వ్యక్తిగతమైనవి. ABP నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అభిప్రాయాలు, నమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపవు. ]

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
Andhra Pradesh News: మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
Prashant Kishor: నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
Matka Trailer: వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లు

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
Andhra Pradesh News: మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
Prashant Kishor: నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
Matka Trailer: వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
Tirupati News: తిరుపతిలో చాక్లెట్ల ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యం- సీఎం, హోంమంత్రి దిగ్భ్రాంతి- బాధితులకు సాయం ప్రకటన
తిరుపతిలో చాక్లెట్ల ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యం- సీఎం, హోంమంత్రి దిగ్భ్రాంతి- బాధితులకు సాయం ప్రకటన
Saving Ideas: రూల్‌ 50:30:20 గురించి తెలుసా?, మీ జీవితాన్ని కలర్‌ఫుల్‌గా మార్చే 'గేమ్‌ ఛేంజర్‌' ఇది
రూల్‌ 50:30:20 గురించి తెలుసా?, మీ జీవితాన్ని కలర్‌ఫుల్‌గా మార్చే 'గేమ్‌ ఛేంజర్‌' ఇది
Blue Aadhaar Card: బ్లూ కలర్‌ ఆధార్ కార్డ్ కావాలా? - మీకు వస్తుందో, రాదో ఇక్కడ చెక్‌ చేసుకోండి
బ్లూ కలర్‌ ఆధార్ కార్డ్ కావాలా? - మీకు వస్తుందో, రాదో ఇక్కడ చెక్‌ చేసుకోండి
Pushpa 2 Item Song: శ్రద్ధా కపూర్, సమంత కాదు... అల్లు అర్జున్ 'పుష్ప 2' ఐటమ్ సాంగ్ చేసేది ఈ అమ్మాయే!
శ్రద్ధా కపూర్, సమంత కాదు... అల్లు అర్జున్ 'పుష్ప 2' ఐటమ్ సాంగ్ చేసేది ఈ అమ్మాయే!
Embed widget