Best Budget Bike: మీకు తెలుసా?, 640 km మైలేజ్ ఇచ్చే హీరో బైక్‌ను కేవలం రూ.2,000 EMIతో కొనవచ్చు
Bank Loan For Hero HF 100: తొమ్మిది లీటర్లకు పైగా పెట్రోల్ పట్టే ఇంధన ట్యాంక్‌ను ఈ హీరో బైక్‌కు బిగించారు. కామన్ మ్యాన్‌కు కరెక్ట్‌గా సరిపోయే ఈ బండి బరువు 110 కిలోలు.

Hero HF 100 Bank Loan And Monthly EMI Plan: హీరో బ్రాండ్, మన దేశంలో కామన్ మ్యాన్ పాలిట నిజంగానే ఒక హీరో. భారతీయుల కోసం 'తక్కువ ధర - ఎక్కువ మైలేజ్' బైక్‌లను ఈ కంపెనీ అందిస్తోంది. ముఖ్యంగా ఇది ఫ్యామిలీ మ్యాన్ బైక్. డైలీ రన్నింగ్ కోసం, బడ్జెట్ రేటులో బెటర్ మైలేజ్ ఇచ్చే బైక్ కోసం మీరు చూస్తుంటే "హీరో HF 100" గురించి మీరు ఆలోచించవచ్చు. ఈ టూవీలర్ నిర్వహణ చాలా సులభం. బెటర్ మైలేజ్ ఇవ్వగలదు కాబట్టి పెట్రోల్ ఖర్చులు కూడా ఆదా అవుతాయి.
హీరో HF 100 బైక్ మీకు నచ్చి & దానిని కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ఫుల్ పేమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం రూ. 10 వేలు జేబులో పెట్టుకుని హీరో షోరూమ్ వెళ్లండి, కొత్త బండి మీద ఇంటికి తిరిగి రండి. అంటే, హీరో HF 100 మీకు ఫైనాన్స్ (లోన్)లో లభిస్తుంది. ఫైనాన్స్ తీసుకున్న తర్వాత, నెలనెలా, మీకు అనుకూలమైన మొత్తాన్ని EMIగా చెల్లించాలి. ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే.. పెట్రోల్ ట్యాంక్‌ను పూర్తిగా నింపితే ఈ బండి దాదాపు 640 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది.
తెలుగు ప్రజలకు అనుకూమైన ధర & డౌన్ పేమెంట్
దిల్లీలో, హీరో HF 100 బైక్ ఎక్స్‌షోరూమ్ ధర (Hero HF 100 Ex-showroom price, Delhi) దాదాపు రూ. 60,200 & ఆన్-రోడ్ ధర (Hero HF 100 on-road price, Delhi) దాదాపు రూ. 71,750. మన తెలుగు రాష్ట్రాల్లో ధర రూ. 71,000 కంటే కొంచం ఎక్కువ ఉండవచ్చు, నగరం & డీలర్‌షిప్‌ను బట్టి రేటు మారుతుంది. మీరు కేవలం రూ. 10,000 డౌన్ పేమెంట్ చేసి ఈ బండిని మీ ఇంటికి తీసుకువెళ్లవచ్చు.
హీరో HF 100 బండిని కొనడానికి మీరు రూ. 10,000 డౌన్ పేమెంట్ కడితే, దిల్లీ ఆన్-రోడ్ ధర ప్రకారం, బ్యాంక్ నుంచి మీకు రూ. 61,000 లోన్ మంజూరు అవుతుంది. బ్యాంక్ 9.5 శాతం వడ్డీ రేటుతో 36 నెలల కాలానికి (మూడేళ్లు) ఈ లోన్ మంజూరు చేసిందని భావిద్దాం. ఈ కేస్‌లో మీరు కేవలం రూ. 1,954 EMI చెల్లించాలి.
ఒకవేళ మీరు 24 నెలల కాల పరిమితి (రెండేళ్లు) లోన్ తీసుకుంటే, 9.5 శాతం వడ్డీ రేటు ప్రకారం మంత్లీ EMI రూ. 2,801 అవుతుంది. మీకు మంచి ఆదాయం ఉండి, 12 నెలల్లోనే (ఏడాది) లోన్ క్లియర్ చేయగలనని మీరు భావిస్తే, 9.5 శాతం వడ్డీ రేటు ప్రకారం నెలకు రూ. 5,349 చెల్లించాలి. దీంతో బ్యాంక్ రుణం తీరిపోతుంది, హీరో HF 100 వందకు వంద శాతం మీ సొంతం అవుతుంది. మీ క్రెడిట్ స్కోర్ & బ్యాంక్ విధానం ప్రకారం లోన్ వడ్డీ రేటు మారుతుంది.
హీరో HF 100 ఇంజిన్ & ఫీచర్లు
హీరో HF 100 బైక్ 97.2 cc, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, OHC ఇంజిన్‌తో పని చేస్తుంది. ఇది, 5.9 kW పవర్‌ను & 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బండి బరువు 110 కిలోలు. పొడవు 1965 మి.మీ., వెడల్పు 720 మి.మీ. & ఎత్తు 1045 మి.మీ. ఇంకా... 165 mm గ్రౌండ్ క్లియరెన్స్, 1235 mm వీల్‌బేస్ & 805 mm సాడిల్ హైట్‌తో ఉంటుంది. హీరో HF 100 ముందు & వెనుక 130 mm డ్రమ్ బ్రేక్‌లు బిగించారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక భాగంలో స్వింగ్ ఆర్మ్‌తో 2-స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి, ఇవి ఎక్కువ కుదుపులు లేని రైడ్‌ను అందిస్తాయి.
హీరో HF 100 మైలేజీ
హీరో HF 100 మోటార్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 9.1 లీటర్లు. ఈ హీరో బైక్ లీటరు పెట్రోల్‌కు 70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ప్రకారం, ట్యాంక్ ఫుల్ చేస్తే హీరో HF 100 బైక్ 637 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.





















