Car Selling Margin: ఒక కారు అమ్మితే డీలర్‌కు ఎంత లాభం - మీరు చెల్లించే దాంట్లో అతనికి ఎంత వెళ్తుంది?
Car Dealer Margin: మీరెప్పుడైనా ఒక కారు కొన్నప్పుడు దాన్ని విక్రయించిన డీలర్‌కు ఎంత డబ్బులు వెళ్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే మీరు చెల్లించే నగదులో డీలర్ జేబులోకి ఎంత వెళ్తుందో తెలుసుకోండి.
Car Actual Price: మనం ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్కన కారు షోరూం కనిపిస్తే... వీళ్లకి ఒక కారు అమ్మితే ఎంత మిగులుతుందో అనో లేకపోతే నెలకు ఒక్క కారు అమ్మితే షోరూం ఓనర్ ఇంక తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చనో అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా ఒక కారు అమ్మితే డీలర్‌కు ఎంత మిగులుతుందో మాత్రం ఆలోచించం. మరి ఒక కారు అమ్మితే ఆ డీలర్‌కు ఎంత మిగులుతుంది?
బ్రాండ్‌ను బట్టి లాభం...
ఒక వస్తువును కొనడానికి వెళ్లినప్పుడు పెట్టే ధరకు అది న్యాయం చేస్తుందా లేదా అని మనం ఎలా అనుకుంటామో... దాన్ని అమ్మే వ్యక్తి కూడా ఆ వస్తువుపై లాభం పొందాలని కోరుకుంటాడు. ఆ లాభం కోసం అతను ఆ వస్తువును తాను వాస్తవ ధరకు కొంత మొత్తాన్ని జోడించి అమ్ముతాడు. దీన్నే వ్యాపార పరిభాషలో మార్జిన్ అంటారు. అదేవిధంగా కారు వాస్తవ ధర, అమ్మే ధర మధ్య వ్యత్యాసం ఉంది. కార్ డీలర్లు దీని ద్వారానే లాభాన్ని పొందుతారు. ఈ లాభం వివిధ బ్రాండ్ల కార్లపై వేర్వేరుగా ఉంటుంది.
Also Read: కొత్త పల్సర్ విడుదల చేసిన బజాజ్ - లేటెస్ట్ ఫీచర్లు, రేటు ఎంతో తెలుసా
కారు డీలర్లకు ఎంత లాభం?
కారు అమ్మకంపై డీలర్లు మంచి లాభం పొందుతారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) కూడా ఈ అంశంపై సర్వే నిర్వహించింది. దీని ప్రకారం భారతదేశంలోని కారు డీలర్లు ఒక కారు అమ్మకంపై ఐదు శాతానికి కాస్త అటూ ఇటుగా మార్జిన్ పొందుతారు. ఎఫ్ఏడీఏ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ మార్జిన్ 2.9 శాతం నుంచి 7.49 శాతం వరకు ఉండవచ్చు.
రూ.10 లక్షల కారుపై ఎంత లాభం?
ఒక కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 10 లక్షలు అనుకుందాం. మీరు కారును కొనుగోలు చేస్తున్న డీలర్ ఆ కారుపై ఐదు శాతం మార్జిన్‌ను ఉంచాడు అనుకుందాం. అప్పుడు ఆ డీలర్ ఈ కారు అమ్మకంపై రూ. 50 వేలు లాభాన్ని పొందుతారు.
ప్రజలు కారును కొనేముందు ఎక్స్ షోరూం ధరపై అనేక ఇతర పన్నులు కూడా చెల్లించాలి. ఇది కాకుండా కొనుగోలుదారు కారు ఇన్సూరెన్స్, ఇతర విషయాలపై కూడా కొంత డబ్బును కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఎక్కువ లాభాలు ఇచ్చే బ్రాండ్లు ఇవే!
కారు డీలర్ల లాభం కూడా కారు బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ఎఫ్ఏడీఏ నివేదిక ప్రకారం కారు కంపెనీ డీలర్లు మారుతి, ఎంజీ మోటార్స్ కార్లపై అత్యధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ రెండు కంపెనీలు తమ కార్ల అమ్మకాలపై డీలర్లకు ఐదు శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్జిన్ ఇస్తాయి. వివిధ ప్రాంతాలను బట్టి మార్జిన్‌లో తేడాను కూడా చూడవచ్చు. ఉదాహరణకు స్కోడా ఆక్టేవియాను ఢిల్లీలో కారు విక్రయించే డీలర్‌కు, హైదరాబాద్‌లో విక్రయించే కారు డీలర్‌కు, విజయవాడలో విక్రయించే కారు డీలర్‌కు మార్జిన్‌లో తేడాలు ఉండవచ్చు.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?